E-Paper
Advertisement

ట్రక్కుల వెనుక ‘Horn OK Please’ అని ఎందుకు రాస్తారో తెలుసా? ఆ ‘OK’ వెనుక పెద్ద చరిత్రే ఉంది!

ట్రక్కుల వెనుక ‘Horn OK Please’ అని ఎందుకు రాస్తారో తెలుసా? ఆ ‘OK’ వెనుక పెద్ద చరిత్రే ఉంది!
Advertisement

Horn OK Please Meaning: సాధారణంగా రోడ్లపై ప్రయాణిస్తున్నప్పుడు భారీ లారీలు, ట్రక్కుల వెనుక భాగంలో ఓ వాక్యం అందరి దృషిని ఆకర్షిస్తుంది. పసుపు, ఎరుపు రంగుల్లో ‘Horn OK Please’ అనే వాక్యం ప్రతీ ఒక్కరూ చూసే ఉంటారు. భారత్ లోని హైవే సంస్కృతికి ఒక ఐకానిక్ గుర్తుగా ఈ పదం మారిపోయింది. అయితే ఇది కేవలం ఒక హెచ్చరిక మాత్రమే కాదు. దీని వెనుక శతాబ్దాల చరిత్ర దాగుంది. అసలు ఆ వాక్యంలో ‘OK’ అనే పదం ఎందుకు వచ్చింది? దాని వెనుక ఉన్న అర్థమేంటి? ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

‘OK’ వెనుక దాగున్న కథ?

లారీ వెనుక ‘OK’ అని రాయడం వెనుక ఆసక్తికరమైన ప్రచారం దాగి ఉంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో దేశంలో డీజిల్ కొరత తీవ్రంగా ఉండేది. దాంతో రవాణా వాహనాల్లో డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా కిరోసిన్‌ను ఇంధనంగా వాడేవారు. అయితే కిరోసిన్‌తో నడిచే వాహనాలు త్వరగా మంటలు అంటుకునే ప్రమాదం ఉండేది. అందుకే ఈ వాహనం కిరోసిన్‌తో నడుస్తోంది (On Kerosene) కాబట్టి వెనుక వచ్చే వాహనాలు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచించడానికి ‘O.K.’ (On Kerosene) అని రాసేవారని అంటుంటారు.

సైడ్ ఇవ్వమని కోరే ‘OK’!

Advertisement

మరొక ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం.. ఒకప్పుడు మన దేశంలో రహదారులు చాలా ఇరుకుగా ఉండేవి. సింగిల్ లేన్ రోడ్లపై వెనుక వస్తున్న వాహనం ఓవర్‌టేక్ చేయాలంటే ముందున్న ట్రక్ డ్రైవర్ అనుమతి తప్పనిసరి. వెనుక ఉన్న వాహనం హార్న్ కొట్టినప్పుడు.. ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ తన వాహనం పక్కన సైడ్ మిర్రర్ లేదా చిన్న లైట్ ద్వారా వెనుక వాహనానికి ‘OK, సైడ్ ఖాళీగానే ఉంది.. వెళ్ళవచ్చు’ అని సంకేతం ఇచ్చేవారట. అలా ‘Horn’ కొట్టు.. నేను ‘OK’ చెప్పాక ముందుకు వెళ్లు అనే అర్థంలో ఈ పదం పుట్టుకొచ్చిందని చెబుతారు.

సోప్ బ్రాండ్ పబ్లిసిటీ?

వ్యాపార దృక్పథంతో ముడిపడి ఉన్న ఇంకో సిద్ధాంతం కూడా ప్రచారంలో ఉంది. ప్రముఖ కంపెనీ టాటా.. ప్రారంభ రోజుల్లో ‘OK’ పేరుతో ఒక డిటర్జెంట్ సోప్‌ను మార్కెట్‌లోకి తెచ్చింది. తమ ఉత్పత్తులను విరివిగా ప్రచారం చేసుకోవడానికి టాటా వారు తయారు చేసే లారీల వెనుక ‘OK’ అని రాసి.. దాని పైన తామర పువ్వు గుర్తును వేసేవారట. కాలక్రమేణా సోప్ పోయినా.. లారీల వెనుక ఆ ‘OK’ పదం మాత్రం అలాగే ఉండిపోయిందనే వాదన కూడా ఉంది.

Advertisement

Also Read: ఎయిర్‌టెల్ బిగ్ షాక్.. ఒకేసారి 4 చౌకైన ప్లాన్లు తొలగింపు.. ఇక మీ జేబుకు చిల్లే!

మహారాష్ట్ర ప్రభుత్వ నిషేధం

కాలక్రమేణా ఈ వాక్యం ఎంత పాపులర్ అయ్యిందంటే.. అసలు అర్థం ఏంటో తెలియకపోయినా ప్రతి లారీ వెనుక దీన్ని రాయడం ఆనవాయితీగా మారిపోయింది. అయితే ఈ వాక్యం వాహనదారులను ఊరికే హార్న్ కొట్టేలా ప్రోత్సహిస్తోందని దీనివల్ల ధ్వని కాలుష్యం విపరీతంగా పెరుగుతోందని భావిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం 2015లోనే వాణిజ్య వాహనాలపై ‘Horn OK Please’ అని రాయడాన్ని పూర్తిగా నిషేధించింది. ఏది ఏమైనా, అర్థాలు ఎన్ని ఉన్నా.. భారతీయ రహదారుల చరిత్రలో ‘Horn OK Please’ సంస్కృతి ఒక ప్రత్యేకమైన ముద్ర వేసిందనడంలో సందేహం లేదు.

Also Read: ప్రీపెయిడ్ vs పోస్ట్‌పెయిడ్.. రెండింట్లో ఏది బెస్ట్.. దేనివల్ల డబ్బులు మిగులుతాయి!

Tags

Related News

ఈ కార్లు ఒకప్పుడు భారత్‌లో తిరిగేవని తెలుసా? ఇప్పుడు రోడ్లపై కనిపిస్తే షాక్ అవ్వాల్సిందే!

ప్రపంచంలోని ఐదు వింతైన బైక్‌లు.. వీటి డిజైన్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

అక్టోబర్‌లో దుమ్మురేపనున్న కొత్త ఈవీలు.. స్కూటర్లు, బైక్స్ లిస్ట్ ఇదే!

కారుపై ఏకంగా 20 టన్నుల రాళ్లు.. టాటా ఏరిస్ బలం చూపించేందుకు మైండ్ బ్లోయింగ్ టెస్ట్!

చిన్న కార్ల కోసం సుజుకి మాస్టర్ ప్లాన్.. ‘రీవ్ లైట్’ హైబ్రిడ్ వచ్చేస్తోంది!

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ ఎంట్రీ డేట్ ఫిక్స్.. ధర అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే?

మహీంద్రా విజన్ ఎస్ వచ్చేస్తోంది.. కనెక్టెడ్ టెయిల్‌లైట్లతో అదిరిపోయే లుక్!

టాటా ఏరిస్ విడుదల.. రూ.5.29 లక్షలకే కొత్త సెడాన్!

Big Stories

Advertisement
×