E-Paper
Advertisement

చంద్రబాబు ప్రభుత్వంపై బొత్స ఘాటు వ్యాఖ్యలు.. మళ్లీ బ్రిటీష్ పాలన తలపించేలా..

చంద్రబాబు ప్రభుత్వంపై  బొత్స ఘాటు వ్యాఖ్యలు.. మళ్లీ బ్రిటీష్ పాలన తలపించేలా..
Advertisement

Amaravati:దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 80 ఏళ్లు అయిన వేళ చంద్రబాబు ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యాలు చేశారు వైసీపీ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ప్రశ్నిస్తే నేరం అన్నట్లుగా రాష్ట్రంలో పాలన సాగుతోందన్నారు. ప్రతిపక్షంగా ప్రజల వైపు ఉంటే నేరం కాదని, లోపాలను ఎత్తి చూపితే కేసు, గొంతెత్తితే కేసు అన్నట్లుగా పాలన ఉందన్నారు. ప్రస్తుత రోజులు మళ్ళీ బ్రిటిష్ పాలనను తలపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

 

చంద్రబాబు ప్రభుత్వంపై బొత్స ఘాటు వ్యాఖ్యలు

Advertisement

దేశవ్యాప్తంగా శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. మన దేశాన్ని మనమే నిర్మించుకోవాలన్నారు. పాలనలో పక్షపాతం ఉండకూడదని, కానీ దురదృష్టవశాత్తూ మన రాష్ట్రంలో పక్షపాత పాలన సాగుతోందన్నారు. రాజకీయ కోణంలో చూసి సంక్షేమం అందించటం సరి కాదని, మనవాడా? కాదా? అని చూసి సంక్షేమం అందించడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రశ్నిస్తే నేరం అన్నట్లుగా పాలన సాగుతోందన్నారు. ప్రతిపక్షంగా ప్రజల వైపు ఉంటే నేరం కాదన్నారు.

 

ఏపీలో మళ్లీ బ్రిటీష్ పాలన తలపించేలా..

Advertisement

లోపాలను ఎత్తి చూపితే కేసు, గొంతెత్తితే కేసు అన్నట్లుగా రాష్ట్రంలో పాలన ఉందన్నారు. ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ బ్రిటీష్ పాలనను తలపిస్తున్నాయని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇలాంటి స్వతంత్రం కోసమా మన పూర్వీకులు పోరాటం చేసింది? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు. పోలీసులు.. అధికార నేతల వైపు కాదు, ప్రజాపక్షంగా ఉండాలన్నారు. మన హక్కులను ఏ ప్రభుత్వమో ఇవ్వలేదని, రాజ్యాంగం కల్పించిందన్నారు. ఓటు వేసినా వేయకపోయానా అందరికీ సంక్షేమం అందాలన్నారు. అదే నిజమైన పాలనగా చెప్పుకొచ్చారు.

ALSO READ: పెమ్మసాని ఫొటో మార్ఫింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. అంబటికి హైకోర్టు సమన్లు!

రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించాలన్నారు. అభివృద్ధి అంటే కొన్ని రోడ్లు, భవనాల మాత్రమే కాదన్నారు. ప్రతి పేదవానికి విద్య-వైద్యం అందాలన్నారు. అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి, అప్పుడే అభివృద్ధి సాధించినట్టు అవుతుందన్నారు. పేదరికం లేని రాష్ట్రం కావాలని, జగన్ హయాంలో చేసింది అదేనని చెప్పుకొచ్చారు. కానీ దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేదని మనసులోని మాటను బయటపెట్టారు.

Related News

కత్తితో యువకుడి ప్రైవేటు పార్ట్స్ కట్ చేసి.. ఆ తర్వాత ఏం చేశారంటే, నరసారావుపేటలో ఘోరం

ఏపీలో పల్లె పండుగ 3.0 కార్యక్రమం జోష్.. రాష్ట్ర అభివృద్ధికి రూ.11,085 కోట్ల ప్యాకేజీ!

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో మళ్లీ ఘోర ప్రమాదం.. నిర్లక్ష్యమే కారణమా?

ఏకగ్రీవాల కోసం కూటమి సర్కార్ భారీ కుట్ర.. మాజీ మంత్రి బుగ్గన సంచలనం!

రన్నింగ్ కారులో మంటలు.. ఓ వ్యక్తి సజీవ దహనం!

తిరుపతిలో ఘోర ప్రమాదం.. క్రేన్ కూలి ముగ్గురి మృతి!

కమల్ హాసన్ కూడా వేస్ట్.. కొల్లు రవీంద్ర నటనపై పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు!

మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వాహనం ధ్వంసం, తాడిపత్రిలో టెన్షన్

Big Stories

Advertisement
×