BigTV English

Jagan Talk with Raghurama: అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం, జగన్‌‌తో రఘురామ మాటలు, ఆయన పక్కనే..

Jagan Talk with Raghurama: అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం, జగన్‌‌తో రఘురామ మాటలు, ఆయన పక్కనే..

Jagan talks with Raghuramakrishnaraju: రాజకీయాల్లో శాశ్వత శత్రువు.. శాశ్వత మిత్రులు ఉండరు. ఎవరు .. ఎప్పుడు.. ఎందుకు కలుస్తారో ఎవరికీ తెలీదు. బద్దశత్రువు ఒక్కసారిగా కలిస్తే మాటల్లో వర్ణించలేము. అలాంటి సన్నివేశం ఒకటి సోమవారం ఏపీ అసెంబ్లీలో చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు నేరుగా వెళ్లి జగన్ దగ్గర మాట్లాడడం ఇవాళ సభలోకి ఆసక్తికర పరిణామం.


సోమవారం అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగం మొదలైం ది. ఆయన స్పీచ్ తర్వాత అనుకోని సన్నివేశం సభలో చోటు చేసుకుంది. ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘు రామక‌ృష్ణరాజు వైసీపీ అధినేత జగన్‌ను పలకరించడం ఆసక్తికరంగా మారింది. మాజీ సీఎం వద్దకు వెళ్లిన రఘురామ, ఆయనను పలకరించారు. కొన్ని నిమిషాల పాటు ఇద్దరు మాట్లాడుకున్నారు.

ప్రతిరోజు అసెంబ్లీకి రావాలని, ప్రతిపక్షం లేకపోతే ఎలా అంటూ జగన్ చేతిలో చేయి వేసి మాట్లాడారు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. ఇకపై అసెంబ్లీకి రెగ్యులర్ వస్తానని, మీరే చూస్తారుగా అంటూ బదులి చ్చారు జగన్. దీని తర్వాత ఇరువురు నేతలు పైకి నవ్వుకుంటూ మాట్లాడుకోవడం కనిపించింది. ఈ క్రమంలో రఘురామను పలకరించారు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.


ALSO READ:  నల్ల కండువా ధరించి అసెంబ్లీకి జగన్, పోలీసు అధికారికి వార్నింగ్

జగన్-రఘురామరాజు మధ్య ఏం చర్చ జరిగిందన్న కుతూహలం సభ్యుల్లో నెలకొంది. జగన్ పక్కనే తనకు సీటు కేటాయించాలని శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌ను కోరారు ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు. అసెంబ్లీ హాల్‌‌లో నడుచుకుంటూ వెళ్తుండగా ఈ వ్యాఖ్యలు చేశారాయన. దీంతో ఆయన నవ్వుతూ అలాగే అంటూ సమాధానం ఇచ్చారు. మొత్తానికి ఐదేళ్ల తర్వాత ఇరువురు నేతలు అసెంబ్లీలో నవ్వుతూ మాట్లాడుకోవడం కనిపించడం కొనమెరుపు.

అన్నట్టు జగన్ అధికారంలో ఉన్నప్పుడు తనను హత్య చేయించాలని చూశారని ఇటీవలే ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కేసు పెట్టారు. పోలీసులూ కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై రేపోమాపో జగన్‌ని ఆయన్ని విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

 

Related News

AP News: తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ యాక్టివ్.. సుగాలి ప్రీతి కేసు కూడా

Srikakulam News: లవ్ మ్యారేజీకి ఒప్పుకోవడం లేదని.. సెల్ టవర్ ఎక్కి యువకుడు హల్చల్.. చివరకు?

YSR CSO John Wesley: కొడుకు వర్ధంతి.. తల్లి అదే రోజు మృతి.. ఈ ఫ్యామిలీకి జగన్ కు సంబంధమేంటి?

Nellore Politics: కాకాణితో భేటీ.. నెల్లూరు నగర మేయర్ స్రవంతికి పదవీగండం

Smart Kitchen: సీకే దిన్నె ప్రభుత్వ పాఠశాలలో దేశంలోనే తొలి స్మార్ట్ కిచెన్ ప్రారంభించిన మంత్రి లోకేష్

Jagan-Vijayamma: కలసిపోయిన జగన్, విజయమ్మ.. కొడుకు, కోడల్ని ముద్దు పెట్టుకుని..

Big Stories

×