BigTV English

Jagan warning to police officer: నల్ల కండువా ధరించి అసెంబ్లీకి జగన్, పోలీసు అధికారికి వార్నింగ్

Jagan warning to police officer: నల్ల కండువా ధరించి అసెంబ్లీకి జగన్, పోలీసు అధికారికి వార్నింగ్
Advertisement

Jagan warning to police officer(AP political news): ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు.. ఈ సామెత వైసీపీ అధినేత జగన్‌కు అతికినట్టు సరిపోతుంది. మూడేళ్ల కిందట జగన్ సర్కార్ చేసిన పనే.. సోమవారం అసెంబ్లీ గేటు వద్ద రిపీట్ అయ్యింది. ఆ సన్నివేశాన్ని చూసి కోపంతో ఊగిపోయారు పులివెందుల వైసీపీ ఎమ్మెల్యే జగన్. అంతేకాదు ఓ పోలీసు అధికారికి వార్నింగ్ ఇచ్చారు.


ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్ హాజరయ్యారు. ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ లతో కలిసి అసెంబ్లీకి ర్యాలీగా వచ్చారు. నేతలు నల్ల కండవాలు ధరించి ప్లకార్డ్స్‌ పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు.

అయితే అసెంబ్లీ గేటు వద్ద జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. ప్లకార్డులను సభలోకి అనుమతించేది లేదని రిక్వెస్ట్‌గా పోలీసులు చేప్పారు. శాసనసభ సభ్యుల హక్కులను పరిరక్షించే బాధ్యత మీదన్నారు జగన్. ఈ క్రమంలో ఆగ్రహానికి గురయ్యారు మాజీ సీఎం జగన్.


ALSO READ: చంద్రబాబు, రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్

మమ్మల్ని అడ్డుకుంటారా అంటూ ఓ పోలీసు అధికారిపై చిందులేశారు. మధుసూదన్‌‌రావు.. గుర్తు పెట్టుకో.. పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవన్నారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామంటూ హెచ్చరించారు. తాము తీసుకొస్తున్న పేపర్స్ చింపే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు. టోపీకి ఉన్న సింహాలకు అర్థం ఏంటో తెలుసా? అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ కొట్టడంకాదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారన్నారు. ఈ విషయాన్ని గుర్తు పెట్టాలన్నారు.

 

జగన్ ఆగ్రహాన్ని చూసి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు షాకయ్యారు. పోలీసులు కూల్‌గానే చెప్పారని అంత కోపం ఎందుకని అనుకుంటున్నారు. మూడేళ్ల కిందట టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇలాగే చేశారని, ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయ్యిందని అంటున్నారు. ఆ తరహా సన్నివేశాలు ఈ ఐదేళ్లలో ఇంకెన్ని చూడాల్సి వస్తుందోనని చర్చించుకోవడం వైసీపీ నేతల వంతైంది. జగన్ మాట్లాడిన మాటలు ఐదేళ్ల కిందట చెబితే బాగుండేదని, ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నది టీడీపీ నేతల మాట.

 

Related News

Pithapuram Politics: మంత్రి నారాయణ కామెంట్స్ పై.. ఇన్ డైరెక్ట్‌గా స్పందించిన వర్మ..

Lokesh In Kurnool: గ్యాప్ రాకూడదు, మళ్లీ మనమే రావాలి – లోకేష్

Modi Kurnool: బాబు-పవన్ రూపంలో ఏపీలో శక్తిమంతమైన నాయకత్వం ఉంది -కర్నూలు సభలో మోదీ

Pawan Kalyan:15 ఏళ్లు మనదే అధికారం.. హై ఓల్టేజ్ స్పీచ్

CM Chandrababu: ప్రధాని మోదీ తెచ్చిన సంస్కరణలు దేశానికి గేమ్ ఛేంజర్లు: సీఎం చంద్రబాబు

CM Chandrababu: లండన్ టూర్‌కి సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఖరారు, ఎప్పుడంటే..

PM Modi: మల్లన్నసేవలో ప్రధాని మోడీ.. సీఎం చంద్రబాబు, డీసీఎం పవన్‌తో కలిసి శ్రీశైలంలో పర్యటన

Narayana Nadendla: అలా మాట్లాడటం సరికాదు.. నారాయణపై నాదెండ్ల సీరియస్

Big Stories

×