Bus Incident: హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ఔటర్ రింగు రోడ్డుపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. హిమాయత్ సాగర్ దగ్గర అదుపు తప్పి, ఢీ వైడర్‌ను ఢీ కొట్టి.. రోడ్డు అవతలి వైపుకు దూసుకొని వెళ్లి.. బొలెరో వ్యాన్‌ను ఢీ కొట్టింది. బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో.. ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడగా.. పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఔటర్‌పై బస్సు బీభత్సం..
హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్ ఔటర్ రింగ్ రోడ్డు పై బస్సు బీభత్సం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఇటీవలి కాలంలో ప్రైవేట్ ట్రావేల్ బస్సు ప్రమాదంలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. రోజు ఎక్కడో ఒకచోట ప్రవైట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురవుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ORRపై ప్రమాదం జరిగింది. SMRR ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. వీటికి కారణాలు డ్రైవర్ల నిర్లక్ష్యం.. ఓవర్ స్పీడ్ అని చెబుతున్నారు.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. వెళ్తున్న ఆటోను, బైక్‌ను ఢీ కొట్టి బోల్తా కొట్టిన మరో ఆటో
ప్రమాద సమయంలో మొత్తం బస్సులో 30 మంది ప్రయాణికులు స్వల్ప గాయలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ఎవ్వరికి స్వల్ప గాయలతో బయటపడ్డారు తప్ప ఎలాంటి మరణాలు.. సంభవించలేదు.. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.