Dude Movie : అదృష్టం ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పడం కష్టమే.. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో వాళ్ళ జాతకాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఊహించడం కూడా కష్టమే.. ఎందుకంటే ఈమధ్య చాలామంది డైరెక్టర్లు హీరోలుగా మారుతూ సక్సెస్ అవుతున్నారు. మొన్నేమో కన్నడ డైరెక్టర్ రిషబ్ శెట్టి కాంతార సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరో రేంజ్ కి ఎదిగారు. ఇక ఈమధ్య డ్రాగన్ మూవీతో డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా మారాడు. లవ్ టుడే, డ్రాగన్ వంటి చిత్రాలలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ మూవీలను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం డ్యూడ్ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ మూవీ దీపావళి సందర్భంగా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మరి ఈ మూవీ బిజినెస్ వివరాల గురించి ఒకసారి తెలుసుకుందాం..
హీరో ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు జంటగా నటిస్తున్న మూవీ డ్యూడ్.. ఈ నెల 17 న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల దీపావళి కానుకగా విడుదల కాబోతుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన పాటలకు, ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. ప్రదీప్ నుండి రెండు భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల తర్వాత విడుదల అవుతుంది. దీంతో ఇప్పుడు రాబోతున్న సినిమా బిజినెస్ కూడా ఇప్పుడు రాబోతున్న సినిమా బిజినెస్ కూడా బాగానే జరిగినట్లు తెలుస్తుంది. తెలుగు వెర్షన్ థియేట్రికల్ బిజినెస్ 15 కోట్ల, నార్త్ అమెరికాలో 2 బ్లియన్ డాలర్ల బిజినెస్ జరిగినట్లు తెలుస్తుంది. పంచవ్యాప్తంగా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 60 కోట్లకు పైగా వసూలు చేయాల్సి ఉంటుంది. మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే జరిగినట్లు తెలుస్తుంది మరి 60 కోట్లకు పైగా వసూళ్లను రాబడుతుందో లేదో రేపు థియేటర్లలోకి రాబోతున్న సినిమా టాక్ పై ఆధారపడి ఉంటుంది.
Also Read : నార్త్ లో 500 కోట్లు కొల్లగొట్టిన తెలుగు సినిమాలు.. హైయెస్ట్ అదే..?
డ్యూడ్ మూవీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాను ఈ థియేటర్లలో చూసేందుకు యూత్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తమిళనాడు, ఓవర్సీస్ ప్రాంతాల్లో ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ పూర్తిస్థాయిలో మొదలయ్యాయి. మరికొన్ని చోట్ల ఇంకా ప్రారంభించాల్సి ఉంది. ఇవాళ సాయంత్రం లోపు తెలుగు రాష్ట్రాల్లో కూడా పూర్తి స్థాయిలో బుకింగ్స్ మొదలయ్యే అవకాశం ఉంది. కేవలం చెన్నై సిటీలోనే ఈ సినిమాకు కోటికి పైగా వసూళ్లు వచ్చినట్లు తెలుస్తుంది. ఇదే జోరులో అన్ని ప్రాంతాల్లో గనక వస్తే ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హీట్ అవుతుందని సినీ ట్రేడ్ పంతులు అభిప్రాయపడుతున్నారు.. మరి సినిమా ఏ విధమైన టాక్ ని సొంతం చేసుకుంటుందో తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే..