Bigg Boss 9:తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి బిగ్ బాస్ సీజన్ 9 వచ్చేసింది. ఇప్పటికే ఐదు వారాలు పూర్తయి ఆరవ వారం వైల్డ్ కార్డు ఎంట్రీలు అడుగుపెట్టారు. అయితే వైల్డ్ కార్డు ఎంట్రీలు హౌస్ లోకి వచ్చిన తర్వాత ఆట మరింత ఆసక్తిగా మారింది. ముఖ్యంగా బిగ్ బాస్ టీం అనుకున్నట్టుగానే కావలసినంత స్టఫ్ కూడా దొరుకుతోంది. పైగా హౌస్ మేట్స్ మధ్య సాగుతున్న డిస్కషన్స్, గొడవలు, బాండ్స్ ఇలా అన్నింటా కూడా ప్రేక్షకులకు కావలసిన మంచి స్టఫ్ దొరుకుతోంది అనడంలో సందేహం లేదు. ఇక ఇన్ని రోజులు షో చూసి హౌస్ లోకి వెళ్లిన వైల్డ్ కార్డ్స్ గేమ్ ను మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఎవరు స్ట్రాంగ్? ఎవరు వీక్ ? అనే విషయంపై కాకుండా బయట ఓట్లు ఎలా పడుతున్నాయో అన్నట్టుగా స్ట్రాటజీలు కూడా వేస్తున్నారు.
ఇటు వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి వచ్చిన వారి ప్రవర్తనను కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు పాత కంటెస్టెంట్స్ . అందుకు తగ్గట్టు తమ గేమ్ ప్లాన్ ను మార్చుకుంటున్నారనే చెప్పాలి. అలాంటి వారిలో ముఖ్యమైన వ్యక్తి తనూజ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇకపోతే వైల్డ్ కార్డు ఎంట్రీలు జరగక ముందు వరకు భరణి శంకర్ (Bharani Shankar)ను నాన్న అని పిలుస్తూ ఎలిమినేషన్ కాకుండా సేవ్ అవుతూ వచ్చింది తనూజ. అయితే ఇదే విషయాన్ని వైల్డ్ కార్డు ఎంట్రీ ఆయేషా ప్రస్తావిస్తూ నాన్న, అన్నయ్య, బాయ్ ఫ్రెండ్ అనుకుంటూ కూర్చుంటే గేమ్ సాగదు నీకంటూ ఒక స్ట్రాటజీ చూపించాలి నువ్వు ఒక ఎమోషనల్ బాండ్ తో గేమ్ ని ఆడుతున్నాం అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది.
దాంతో భరణి శంకర్ ను నాన్న అని పిలిచిన తనూజ.. ఆయేషా మాటలతో సార్ అని పిలిచి అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే ఇప్పుడు వైల్డ్ కార్డు ఎంట్రీస్ లో మరో కొత్త బాండింగ్ ను ఏర్పరుచుకుంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన దివ్వెల మాధురిని అమ్మ అని పిలవడం అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. విషయంలోకి వెళ్తే వైల్డ్ కార్డు ఎంట్రీస్ ఎక్కువగా ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉన్న తనూజా, సంజనాతోనే గడిపేస్తున్నారు. ఇక కళ్యాణ్ తో మొదటి జరిగిన వివాదంలో బోరున ఏడ్చిన మాధురి.. తనకు శ్రీనివాస్ గుర్తుకొస్తున్నారని.. ఆయనని రాజా అని పిలుస్తాను అంటూ తనుజాతో తెలిపింది. దీంతో ఆమె ఆ పిలుపుకు లొంగిపోతారని గ్రహించిన తనూజ రాజా అంటూ సంబోధిస్తుండడంతో మాధురి కూడా ఫిదా అవుతోంది.
ALSO READ:Dulquer Salman: దుల్కర్ సల్మాన్ కి షాక్ ఇచ్చిన మహిళ.. లైంగికంగా వేధించాడంటూ?
ఇక ఇప్పటివరకు బాండింగ్ లపై ఘాటుగా స్పందించిన మాధురి తనను తల్లిలా భావించాలి అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు బయట పరిస్థితి ఎలా ఉందో తనుజాకు వివరించింది. టాప్ ఫైవ్ లో ఉండేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఇక వీళ్ళ బంధం ఎంతవరకు వెళ్ళింది అంటే మాధురి గుండెలపై పడుకుని తనూజ ఆమెకు కబుర్లు చెప్పే అంత రేంజ్ కు వెళ్ళిపోయింది.. పైగా మాధురి మాటలను దృష్టిలో పెట్టుకున్న తనూజ ఆమెను అమ్మ లాగా భావిస్తూ ఆమె స్ట్రాటజీని తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇన్ని రోజులు నాన్న అని పిలుస్తూ భరణి గేమ్ ను పట్టుకున్న ఈమె.. ఇప్పుడు అమ్మ పేరుతో మాధురి గేమ్ ను కూడా డి కోడ్ చేసింది. అలా బాండింగ్ పేరుతో ఇద్దరు వ్యక్తులను తన గుప్పెట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తోంది తనూజ అంటూ బిగ్ బాస్ లవర్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా తనూజ మాస్టర్ ప్లాన్ కి రెండు పిట్టలు ఔట్ అయ్యేలా కనిపిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు ఆడియన్స్.