BigTV English

Big TV EXclusive : సంక్రాంతికి ‘రోల్ మోడల్’గా వస్తున్న రవితేజ

Big TV EXclusive : సంక్రాంతికి ‘రోల్ మోడల్’గా వస్తున్న రవితేజ
Advertisement

Big TV EXclusive : రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమా తర్వాత అందరి చూపులు మాస్ జాతరపైనే ఉన్నాయి. కానీ, సైలెంట్‌గా మరో మూవీ కంప్లీట్ అయింది. అదే.. కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో వస్తున్న మూవీ. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా టైటిల్‌ ఇదే అని బిగ్ టీవీకి ఓ సమాచారం అందింది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం.


నేను శైలజ, ఉన్నది ఒక్కటే జిందగి, చిత్రలహరి వంటి క్లాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కిషోర్ తిరుమల… మాస్ మహారాజ రవితేజతో సినిమా చేస్తున్నాడు అంటూ అనౌన్స్‌మెంట్ వచ్చింది. RT76 అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటూ వచ్చింది. సంక్రాంతికి రిలీజ్ చేస్తామని చెప్పారు. సంక్రాంతికి చిరంజీవి – అనిల్ మూవీతో పాటు మరి కొన్ని కూడా పోటీలో ఉన్నాయి. చిరు – అనిల్ మూవీ షూటింగ్ స్టార్టింగ్ నుంచే ప్రమోషన్స్ అదరగొడుతుంది. కానీ, రవితేజ – కిషోర్ తిరుమల మూవీ RT 76 మాత్రం ఇప్పటి వరకు కనీసం టైటిల్ ను కూడా రివీల్ చేయలేదు.

RT 76 టైటిల్ ఇదే…

అప్పట్లో ఈ సినిమాకు అనర్కలి, భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే టైటిల్స్ ఫిక్స్ చేశారు అనే రూమర్ వచ్చింది. కానీ, ఆ రూమర్ కొద్ది రోజుల్లోనే కనుమరుగైంది. అయితే, తాజాగా బిగ్ టీవీకి రవితేజ – కిషోర్ తిరుమల మూవీ టైటిల్‌పై ఓ సమాచారం అందింది. దీని ప్రకారం… రవితేజ – కిషోర్ తిరుమల మూవీ RT 76 కి ‘రోల్ మోడల్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారట.


రోల్ మోడల్.. సరిగ్గా సెట్…

రవితేజ నిజానికి ఇండస్ట్రీలో చాలా మందికి రోల్ మోడల్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇంత పెద్ద స్టార్ అయ్యాడు. అసిస్టెంట్ డైరెక్టర్… చిన్న చిన్న పాత్రలు… ఇలా ఎన్నో చేసి ఈ రోజు… తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకడిగా నిలిచాడు.

దీన్నే చాలా సినిమాల్లో రవితేజ కొన్ని డైలాగ్స్‌తో చెప్పాడు. ఇక ఇప్పుడు కిషోర్ తిరుమల మూవీలో అయితే ఏకంగా.. టైటిల్‌తోనే తాను రోల్ మోడల్ అని చెబుతున్నాడు.

ఈ రోల్ మోడల్ టైటిల్… వేరే వాళ్లకు ఎలా ఉన్నా.. మాస్ మహారాజ్ రవితేజ అభిమానులకు అయితే మంచి కిక్ ఇస్తుందని చెప్పొచ్చు. ఈ రోల్ మోడల్ టైటిల్ అనౌన్స్ మెంట్ అతి త్వరలోనే ఉండబోతుందని తెలుస్తుంది.

మూవీ ఫుల్ డీటైల్స్.. 

ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఇటీవల ఫారెన్ సెట్స్‌కి వెళ్లింది. ఈ మధ్య స్పెయిన్‌లో షూటింగ్ స్టార్ట్ చేశారు. దీని తర్వాత ఫ్రాన్స్, జెనీవా లాంటి దేశాల్లో కూడా షూటింగ్ చేయబోతున్నారు. ఈ షెడ్యూల్ దాదాపు 25 రోజుల పాటు ఉండబోతుందట. ఈ లాంగ్ షెడ్యూల్‌లో పలు కీలక సన్నివేశాలతో పాటు రెండు పాటలను కూడా షూట్ చేయనున్నారు. ఈ పాటలకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫి ఇవ్వబోతున్నారు. అలాగే భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నాడు.

 

Related News

HBD Hema Malini: ఏజ్ లెస్..77 ఏళ్లలో కూడా స్టిల్ యంగ్.. ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా?

Bahubali The Epic: సెన్సార్ పూర్తి చేసుకున్న బాహుబలి ది ఎపిక్.. రన్ టైం ఎంతంటే?

Kriti Sanon: ఇంటర్నేషనల్ స్టేజ్‌పై ప్రభాస్ బ్యూటీ.. తొలి భారతీయ నటిగా గుర్తింపు!

HBD Prithvi Raj Sukumaran: గాయకుడి నుండి నటుడిగా, దర్శకుడిగా.. పృథ్వీరాజ్ ఆస్తులు ఎన్ని కోట్లంటే?

Bandla Ganesh: అది పీకుతా.. ఇది పీకుతా అని చెప్పాల్సిన పనిలేదు.. నిర్మాతకు బండ్లన్న కౌంటర్

Samantha: జూబ్లీహిల్స్‌ ఓటర్ లిస్ట్‌లో రకుల్, తమన్నా, సమంత… మరి ఓటు ఎక్కడ వేస్తారు ?

Telusu Kada Story : ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు… తెలుసు కదా ఇంటర్వెల్ ట్విస్ట్ ఇదే?

Prashanth Neel: KGF-3కి సర్వం సిద్ధం.. ఫైనల్ బ్లాస్ట్ కి సిద్ధం కండంటూ!

Big Stories

×