Bigg Boss 9 Promo:బిగ్ బాస్.. ప్రస్తుతం సీజన్ 9 తెలుగులో కొనసాగుతోంది. ఇందులో ఐదు వారాలు పూర్తి కాగా.. ఆరవ వారం కూడా మొదలయ్యింది. ఆరవ వారంలో హౌస్ కి కెప్టెన్ గా ఎవరు ఉండబోతున్నారు అనే విషయంపై కంటెస్టెంట్స్ మధ్య గట్టి పోరు నెలకొన్న విషయం తెలిసిందే. ఇటు హౌస్ మేట్స్.. అటు వైల్డ్ స్ట్రోమ్ మధ్య టాస్కులు నిర్వహిస్తూ.. చూసే ఆడియన్స్లో సరికొత్త ఆసక్తిని కలిగిస్తున్నారు. కానీ ఈ కంటెస్టెంట్స్ మధ్య టాస్కులు ఆ టాస్కులలో కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్న తీరు చూస్తే మాత్రం నిజంగా భయం వేస్తోంది అంటూ బిగ్ బాస్ చూసే వారు కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.
తాజాగా 39వ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. ఇందులో కెప్టెన్సీ వార్ జరుగుతోంది. ప్రోమో విషయానికి వస్తే.. “మీ కెప్టెన్సీ కంటెండర్ షిప్ ను కాపాడుకోవడానికి.. వైల్డ్ స్ట్రోమ్ అలాగే వారు ఎంచుకున్న సభ్యులు రెండు టీములుగా ఏర్పడి.. ఒక టాస్క్ లో తలపడాల్సి ఉంటుంది. అందుకోసం నేను మీకు ఇస్తున్న టాస్క్.. కెప్టెన్సీ ఎయిమ్. ప్రతి రౌండ్లో బజర్ మోగగానే.. సెంటర్ లో రెడ్ మార్క్ మీద ఉంచిన బాల్ ను తీసుకొని.. ప్రత్యర్థి సీన్ బోర్డ్ లో పోల్ చేయగలిగితే.. వారి నుండి ఏ ఒక్కరిని ఈ రేసు నుంచి తప్పించాలని పోల్ చేసిన సభ్యులు నిర్ణయిస్తారు ” అంటూ బిగ్ బాస్ టాస్క్ నిర్వహించారు.
అందులో భాగంగానే ఇటు వైల్డ్ స్ట్రోమ్ అటు హౌస్ సభ్యులు పోటాపోటీగా ఈ టాస్క్ లో తలపడ్డారు. అయితే ఇక్కడ పోల్ చేసే సమయంలో ఒకరికొకరు శారీరకంగా పోటీ పడడం చూసేవారికి భయాందోళనలకు గురిచేసింది. ముఖ్యంగా పచ్చళ్ళ పాపకు పోల్ బోర్డ్ తలకు తగిలేసరికి కాసేపు అంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా ఎవరికి వారు తమ స్ట్రాటజీ చూపించేశారు. తోసుకోడాలు.. ఒకరి మీద ఒకరు పడడాలు.. జుట్టు పీక్కోడాలు అన్నీ కూడా భయాన్ని కలగజేస్తున్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా కెప్టెన్సీ టాస్క్ కోసం కంటెస్టెంట్స్ మధ్య సృష్టించబడిన ఈ ఫిజికల్ వైలెన్స్ చూసి అరే ఏంట్రా ఇది ఇంతలా గొడవ పడుతున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది. ఇకపోతే ఈ టాస్క్ లో భరణిని ఎలిమినేట్ చేసిన విషయం తెలిసిందే.. మరి ఎవరు కెప్టెన్ అయ్యారు అనే విషయం తెలియాలి అంటే ఎపిసోడ్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.
ALSO READ:Mitramandali: మిత్రమండలి ఓటీటీ, శాటిలైట్ హక్కులు వీరికే..