Gold Shop Robbery: మార్కెట్లో గోల్డ్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎక్కడా బ్రేక్ పడిన సందర్భం కనిపించలేదు. రాను రాను ధరలు పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కరుడుగట్టిన, అంతరాష్ట్ర దొంగల ముఠాల చూపు బంగారం షాపులపై పడింది. పట్టపగలు షాపులను దోచేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి ముంబైలో చోటు చేసుకుంది.
పెరుగుతున్న బంగారం షాపుల దోపిడీలు
బంగారం ధరలు సామాన్యుడి అందుబాటులోకి రాలేదు. రోజు రోజుకూ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. దీనికితోడు అంతర్జాతీయ పరిణామాలు ధర పెరగడానికి కారణమైంది. దీంతో కొనుగోలు తగ్గినా, ధర మాత్రం దిగిరానంటోంది. ఈ నేపథ్యంలో కరుడుగట్టిన నేరగాళ్లు చూపు బంగారంపై పడింది. ఈ మధ్యకాలంలో బంగారు షాపులను టార్గెట్ చేస్తున్నారు.
ముంబై శివారులోని ఘట్కోపర్ ప్రాంతంతో బంగారం షాపు దోపిడీకి గురైంది. ఈ ఘటనలో దుండగులు నగల దుకాణంలోకి ప్రవేశించారు. కాసేపు షాపు యజమానితో మాట్లాడారు. లోపల నగలను బయటకు తీశాడు. ఈలోగా ఒకడు యజమానిపై దాడి చేశాడు. వారిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కత్తితో ఓనర్‌ని గాయపరిచాడు. అంతలో మరొకడు ఎంట్రీ ఇచ్చాడు.
ముంబైలో పట్టపగలు బంగారం షాపు దోపిడీ
బాక్సుతో బయటపెట్టిన బంగారు ఆభరణాలను వారు తీసుకొచ్చిన సంచిలో సర్దుకుని అక్కడి నుంచి పరారయ్యారు. దోచుకెళ్లిన ఆభరణాల విలువ అక్షరాలా 3 లక్షలు ఉంటుందని షాపు యజమాని చెప్పారు. ఈ ఘటన జరిగిన వెంటనే కాసేపటికి తేరుకున్నాడు షాపు ఓనర్. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు షాపులోని సీసీటీవీ కెమెరా ఫుటేజ్ పరిశీలించారు.
షాపుకు ఇరువైపులా ఉన్న ఫుటేజ్ ని చెక్ చేశారు. చివరకు ఇద్దర్ని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని ఆ ప్రాంతం పోలీసులు తెలిపారు. ఇది ముమ్మాటికీ దోపిడీ అని, ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు జోన్-7 డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ తెలిపారు. ఓనర్ షాపు ఓపెన్ చేయగానే ఇద్దరు వ్యక్తులు లోపలికి ప్రవేశించినట్టు తెలిపారు.
ALSO READ: వరంగల్-ఖమ్మం హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటో-బైక్‌ని ఢీ కొట్టిన మరో ఆటో
ఇటీవల హైదరాబాద్‌లో కూడా ఇలాంటి ఘటన జరిగింది. దొంగలు షాపులోకి ఎంట్రీ ఇచ్చి బంగారం దోచేశారు. ఆ కేసులో నిందితులను అరెస్టు చేశారు. ఈ మధ్యకాలంలో బంగారం షాపులు దోపిడీకి గురికావడంతో జ్యువెలర్స్ అసోసియేషన్ రియాక్ట్ అవుతోంది. ఈ తరహా కేసులు పెరగడం ఆందోళన కలిగించే అంశంగా పేర్కొంది. ఇలాంటి సమయంలో దొంగల బారి నుంచి బంగారం రక్షించుకోవడానికి ఆభరణాలకు ఇన్సూరెన్స్ చేయడం ఉత్తమమని తెలిపింది. దొంగలను ఎవరూ ఆపలేరు, కాకపోతే ఆభరణాలను బీమా చేయడం ద్వారా నష్టాన్ని నివారించవచ్చని తెలియజేసింది.
పట్టపగలు నగల దుకాణంలో దోపిడీ.. సీసీ ఫుటేజ్
ముంబై-ఘట్కోపర్లోని నగల దుకాణంలో జరిగిన దోపిడీ
అమృత్నగర్లోని ఓ నగల దుకాణంలోకి ప్రవేశించి దోపిడీకి పాల్పడిన ముగ్గురు దుండగులు
దుకాణ యజమానిపై దాడి చేసి, సుమారు రూ.3 లక్షల విలువైన నగలను ఎత్తుకెళ్లిన వైనం
ఈ ఘటనలో దుకాణ యజమానికి… pic.twitter.com/w2h6khDuym
— BIG TV Breaking News (@bigtvtelugu) October 16, 2025