BigTV English

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?
Advertisement

Influencer Bhavani Ram : ఈమధ్య సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది పాపులర్ అవుతూ వస్తున్నారు. ఒకప్పుడు టిక్ టాక్ ద్వారా తమ టాలెంట్ ని బయటపెట్టి బాగా పాపులర్ అయ్యారు. కానీ, ఇప్పుడు యూట్యూబ్ల ద్వారా రీల్స్ ద్వారా తమ టాలెంట్ ని బయటపెడుతున్నారు.. యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ సామాన్యులు సెలబ్రేటీలు అవుతున్న వారేందరో ఉన్నారు. అలాంటి వారిలో యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ భవాని రామ్ ఒకరు. ప్రస్తుతం ఎక్కడ విన్నా ఈ జంట పేరే వినిపిస్తుంది. వీళ్ళు చేస్తున్న రీల్స్ కొందరికి చిరాకు తెప్పించిన.. మరికొంతమంది మాత్రం వీళ్ళ టాలెంట్ ని గుర్తించి ఎంకరేజ్ చేస్తున్నారు. తాజాగా ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెనన్సర్ భవాని రామ్ బిగ్ టీవీ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో తమ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. యూట్యూబ్ ద్వారా వారి సంపాదన ఎంత అన్న విషయాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..


కన్నీళ్లు తెప్పిస్తున్న స్టోరీ..

జీవితంలో పైకి రావాలంటే ఖచ్చితంగా ఎన్నో కష్టాలను అనుభవించాలి అని పెద్దలు ఊరికే అనలేదు. మనము నలుగురిలో మంచిగా బతకాలంటే ముందు నలుగురు అనే మాటలు పడాలి. ఆ మాటలు మనకి జీవితానికి స్ఫూర్తిదాయకంగా మారతాయని చాలామంది నిరూపించారు. అలా ఎంతోమంది సక్సెస్ అవ్వడం మాత్రమే కాదు.. ఎంతోమందికి ఆదర్శంగా కూడా నిలుస్తున్నారు. తాజాగా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ భవాని రామ్ కూడా అలానే ఒక్కో మెట్టు ఎదుగుతూ.. అవమానాలని భరిస్తూ ఇప్పుడు బాగా ఫేమస్ అయ్యారు.. తాజాగా బిగ్ టీవీ ఛానల్ కి ఈ జంట ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తమ జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి పంచుకున్నారు. వాళ్లు మాట్లాడుతూ.. రామ్ కు కిడ్నీ సమస్యలు, అలాగే గతంలో అనే అనారోగ్య సమస్యలు వచ్చాయి. దానివల్లే ఉద్యోగం మానేసినట్లు చెప్పారు. ఓసారి ఇల్లు గడవడం కష్టమైందని కూడా చెప్పారు. ఎవరెన్ని అన్న కూడా మాకు నచ్చింది మేము చేసాము. మా సబ్స్క్రైబర్స్ మమ్మల్ని ఆదరించారు. అందుకే ఈ స్థానంలో ఉన్నాము అని వాళ్ళు ధీమాగా చెప్తున్నారు. ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

Also Read : ‘డ్యూడ్’ మూవీ సూపర్ హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు రాబట్టాలి..?


యూట్యూబ్ ద్వారా ఎంత సంపాదిస్తున్నారు..? 

కష్టపడి ఏదైనా చేస్తే దాన్ని ఫలితం కచ్చితంగా కష్టపడినోడికి దక్కుతుంది అని పెద్దల మాట.. అది నిజమే అని అందరికీ తెలుసు. యూట్యూబ్ ద్వారా ఎంతోమంది తమ టాలెంట్ ని బయట పెడుతూ డబ్బులను సంపాదిస్తున్నారు. అలా ఇన్ఫ్లుయెన్సర్ భవాని రామ్ యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. భార్యాభర్తలిద్దరూ చేదోడు వాదోడుగా ఉంటూ భార్య పాటకు భర్త దరువు జనాలను బాగా ఆకట్టుకుంది. వారిద్దరూ కలిసి చేస్తున్న ప్రయత్నం చూడముచ్చటగా అనిపిస్తుందని నెటిజన్లు కామెంట్లు సైతం పెడుతున్నారు. అలా ఎవరిని అన్నా సరే పట్టించుకోకుండా ఇప్పుడు యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ తమకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇంటర్వ్యూలో తమకు యూట్యూబ్ ద్వారా మంచి ఇన్కమ్ వస్తుందని చెప్పారు. ఎంత వస్తుంది అన్న విషయాన్ని మాత్రం బయట పెట్టలేదు కానీ, జనాల ఆదరణ మా మీద ఉంది. కాబట్టి మా కుటుంబానికి సరిపడా వస్తుంది అంటూ వాళ్ళు చెబుతున్నారు. మొత్తానికైతే ఈ సక్సెస్ స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.

Related News

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Big Stories

×