E-Paper
Advertisement

జగన్ మాజీ సీపీఆర్‌ఓ శ్రీహరి మళ్లీ కష్టాలు.. బెంగుళూరులో అరెస్ట్, ఏపీకి తరలించిన కుప్పం పోలీసులు

జగన్ మాజీ సీపీఆర్‌ఓ శ్రీహరి మళ్లీ కష్టాలు.. బెంగుళూరులో అరెస్ట్, ఏపీకి తరలించిన కుప్పం పోలీసులు
Advertisement

Bengaluru: వైసీపీ మీడియా కార్యదర్శి శ్రీహరికి కష్టాలు తప్పలేదా? సుప్రీంకోర్టు పిటిషన్ తోసిపుచ్చిన తర్వాత ఏపీ నుంచి బెంగుళూరు ఎందుకు వెళ్లారు? అక్కడి నుంచి ఎస్కేప్ కావాలని భావిస్తున్నారా? ముందుగానే కుప్పం పోలీసులు ఆయన్ని పసిగట్టారా? బుధవారం హైకోర్టు తీర్పు ఆయనకు అనుకూలంగా వస్తుందా? ఇవే ప్రశ్నలు వైసీపీ నేతలను వెంటాడుతున్నాయి.

జగన్ మాజీ సీపీఆర్‌ఓ శ్రీహరి మళ్లీ కష్టాలు

Advertisement

వైసీపీ మీడియా కార్యదర్శి పూడి శ్రీహరిని ఇవాళ కుప్పం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ని బెంగుళూరులో అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ని పోలీసు స్టేషన్‌కు తరలించారు పోలీసులు. శ్రీహరి పెట్టుకున్న పిటిషన్‌ బుధవారం హైకోర్టులో విచారణకు రానుంది.  పిటిషన్ విచారణ సమయంలో ఆయన బెంగుళూరులో ఎందుకు ఉన్నారన్నది అసలు ప్రశ్న.

ఈ కేసు విషయమై మంగళవారం ఆయనకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.  ఈలోగా ఆయన విజయవాడ నుంచి బెంగుళూరుకు ఎందుకు వెళ్లారనే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో టీడీపీ అధినేత చంద్రబాబుపై అనుచిత పోస్టులు పెట్టిన కేసులో ఈనెల 15న విజయవాడలో కుప్పం పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

బెంగుళూరులో అరెస్ట్, ఏపీకి తరలించిన కుప్పం పోలీసులు

ఆయనతోపాటు అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ కార్యకర్త గిరీష్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. ఈ కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించడానికి హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించిన విషయం తెల్సిందే. ఈనెల 15న పూడి శ్రీహరిని విజయవాడలో అరెస్టు చేసి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు కుప్పం పోలీసులు.

మేజిస్ట్రేట్‌ కోర్టు శ్రీహరి జ్యుడిషియల్‌ రిమాండ్‌ను తిరస్కరించడంతో పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. దీంత కుప్పం కోర్టు ఆదేశాలను హైకోర్టు రద్దు చేసింది. దీనిపై శ్రీహరి సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఆయనకు అక్కడ ఊరట లభించలేదు.  ఇదిలావుండగా శ్రీహరి పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. ఆయనకు అనుకూలంగా రాకుంటే ఏంటని నేతలు మాట్లాడుకుంటున్నారు.

ALSO READ: తెలుగుదేశం పార్టీలో సరికొత్త అధ్యాయం.. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్న నారా లోకేశ్

 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×