E-Paper
Advertisement

Pawan Kalyan: వైసీపీని తొక్కేద్దాం.. కూటమిని తెచ్చేద్దాం: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: వైసీపీని తొక్కేద్దాం.. కూటమిని తెచ్చేద్దాం: పవన్ కళ్యాణ్
Advertisement

Pawan Kalyanఫ ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. వైసీపీని పాతాళంలోకి తొక్కి.. కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఏపీలో వైసీపీ పాలనలో రాష్ట్రంలో రౌడీయిజం పెరిగిపోయిందని జనసేనాని ఆరోపించారు.

అన్నమయ్య జిల్లాలో కూటమి అభ్యర్థి, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఉమ్మడి సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యం అవుతుందని.. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు.

Advertisement

అన్నమయ్య జిల్లాలో 39 మంది చావుకు వైసీపీనే కారణం అని ఆరోపించారు. అన్నమయ్య డ్యామ్ నుంచి ఇసుకను అక్రమంగా తరలించడం ద్వారా డ్యామ్ ప్రమాదంలో పడిందని.. దాని కారణంగా 39 మంది చనిపోయారని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.

అన్నమయ్య జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డిలను ఘోరంగా ఓడించాలని పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. వైసీపీని పాతళంలోకి తొక్కి.. కూటమిని గెలిపించాలని కోరారు. కూటమి అధికారంలోకి వస్తే రాజంపేట ప్రాంతాన్ని టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Also Read: బాణం ఎక్కుపెట్టిన షర్మిల, జగన్‌ పార్టీకి ఓటేస్తే.. మూడు రాజధానులెక్కడ?

రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసమే కూటమి ఏర్పడిందని మరోసారి పవన్ కళ్యాణ్ వెల్లిడంచారు. వైసీపీని చూసి ప్రజలు భయపడకుండా బయటకు వచ్చి ఓటు వేయాలని కోరారు. దీంతో వైసీపీ ప్రభుత్వం తుడిచిపెట్టుకుపోవాలని కోరారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×