BigTV English

Neha Sharma holds Roadshow: ఎన్నికల రోడ్ షోలో పాల్గొన్న హీరోయిన్.. జనాలను అదుపు చేయలేక..

Neha Sharma holds Roadshow: ఎన్నికల రోడ్ షోలో పాల్గొన్న హీరోయిన్.. జనాలను అదుపు చేయలేక..

Actor Neha Sharma holds Roadshow: ఇటీవల బీహార్ లో జరిగిన రోడ్ షోలో బాలీవుడ్ హీరోయిన్ నేహా శర్మ పాల్గొన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆమె రాజకీయాల్లోకి వస్తున్నారా ? అనే ఆలోచనలో పడ్డ ఆమె అభిమానులు చివరకు ఓ క్లారిటీకి వచ్చారు. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన తండ్రికి మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారని తెలుసుకున్నారు.


అయితే, బీహార్ లోని భాగల్ పూర్ లోక్ సభ స్థానానికి ఫేజ్ 2లో ఎన్నికలు జరగనున్నాయి. నేహా శర్మ తండ్రి అజిత్ శర్మ కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అటు జేడీయూ పార్టీ తరఫున అజయ్ కుమార్ మండల్ కూడా పోటీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో నేహా శర్మ తండ్రి అజిత్ శర్మకు మద్దతుగా పలు రోడ్ షోలలో పాల్గొని తన తండ్రికి ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఆమె ఓటర్లను కోరారు. ఇందుకు సంబంధించిన వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. దీంతో అవి వైరల్ అయ్యాయి. ఆ వీడియోలో నేహా శర్మ ప్రజలకు అభివాదం చేస్తూ కనిపిస్తారు. లోక్ సభ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఆమె రోడ్ షోలలో పాల్గొన్నారు.

అయితే, ఈ రోడ్ షోలో నేహా శర్మను చూసేందుకు వేలాదిమంది యువతీ యువకులు, అభిమానులు, మద్దతుదారులు తరలివచ్చారు. ఈ క్రమంలో జనాన్ని అదుపు చేసేందుకు అధికార యంత్రాంగం చాలా శ్రమించాల్సి వచ్చింది. అయితే, భాగల్ పూర్ లో లోక్ సభ స్థానానికి పోటీ కీలకంగా మారింది. మరోవైపు గతంలో శర్మ రాజకీయాల్లోకి వస్తున్నారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే, ఆమెకు సంబంధించిన వీడియోలను చూసిన తర్వాత ప్రస్తుతం ఆమె తన తండ్రికి ఎన్నికల్లో మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారనేదిప్రజలకు అర్థమైపోయింది.


Also Read:లుంగీ కట్టుకుని ఓటు అడిగిన సీఎం.. ప్రతిపక్షనేత చూసి..

అయితే, నేహా శర్మ క్రూక్ మరియు తుమ్ బిన్ 2 వంటి చిత్రాలలో నటించింది. పాత్రకు తగ్గట్టుగా నటించి ఆమె ఎంతో పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆమె రోడ్ షోలో పాల్గొనడంతో శర్మ రాజకీయాల్లోకి ఆరంగ్రేటం చేయబోతున్నారా అన్న సందేహం అభిమానుల్లో నెలకొని ఉండేది. కానీ, ఆమె ప్రస్తుతం తన నటనపైనే దృష్టిపెట్టినట్లు, ఇప్పుడైతే రాజకీయాల్లో చేరాలనే ఆలోచన తనకు లేదని ఆమె పేర్కొన్నారని సమాచారం.

Tags

Related News

MiG-21: ముగియనున్న మిగ్-21.. 62 ఏళ్ల సేవకు ఘన వీడ్కోలు

Naxal Couple Arrested: రాయ్‌పూర్‌లో మావోయిస్టు జంట అరెస్ట్..

Ladakh: లడఖ్ నిరసనల వెనుక కుట్ర దాగి ఉందన్న లెఫ్టినెంట్ గవర్నర్

Aadhaar download Easy: ఆధార్ కార్డు వాట్సాప్‌లో డౌన్‌లోడ్.. అదెలా సాధ్యం?

Karnataka News: విప్రో క్యాంపస్ గేటు తెరవాలన్న సీఎం.. నో చెప్పిన ప్రేమ్‌జీ, అసలేం జరిగింది?

Freebies Cobra Effect: ఉచిత పథకాలు ఎప్పటికైనా నష్టమే.. కోబ్రా ఎఫెక్ట్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు

Agni Prime: అగ్ని ప్రైమ్ మిస్సైల్‌ను రైలు నుంచే ఎందుకు ప్రయోగించారు? దాని ప్రత్యేకతలు ఏమిటి?

Ladakh: లద్దాఖ్‌లోని లేహ్‌లో టెన్షన్ టెన్షన్..!

Big Stories

×