BigTV English
Advertisement

BMW i5 M60 : BMW కొత్త ఎలక్ట్రిక్ కార్ లాంచ్.. ధర ఎంతంటే?

BMW i5 M60 : BMW కొత్త ఎలక్ట్రిక్ కార్ లాంచ్.. ధర ఎంతంటే?

BMW i5 M60 : ప్రస్తుత కాలంలో ఎలక్ట్రిక్ కార్లను వినియోగించే వారు రోజురోజుకు పెరుగుతున్నారు. కారు కొనుగోలు విషయంలో ఎంత ఖరీదైన తగ్గడం లేదు. అందుకే కొంత మంది వాహనప్రియులు మార్కెట్‌లో ఏ కొత్త ఎలక్ట్రిక్ కారు వచ్చినా వెంటనే కొనేస్తున్నారు. ఈ క్రమంలోనే జర్మన్ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ BMW కొత్త ఎలక్ట్రిక్ కారు i5 M60 xDrive భారతదేశంలో అధికారికంగా ప్రారంభించింది. ఈ వాహనంలో కంపెనీ ఎలాంటి ఫీచర్లు అందించింది, ఎంత ధర నిర్ణయించారు? తదితర విషయాలను తెలుసుకోండి.


BMW కొత్త i5 M60 xDrive కిడ్నీ గ్రిల్, అడాప్టివ్ LED లైట్లు, 20 అంగుళాల అల్లాయ్ వీల్స్, పనోరమా స్కైరూఫ్, స్పోర్ట్స్ సీట్లు, యాక్టివ్ సీట్ వెంటిలేషన్, రెడ్, స్కై బ్లూ కలర్స్, హెడ్-అప్ డిస్‌ప్లే, పార్కింగ్ అసిస్టెంట్, డిజిటల్ కీ, 12.3 ఇన్‌స్ట్రూమెంట్ డిస్‌ప్లే, చాలా ఉన్నాయి. 14.9 అంగుళాల కంట్రోల్ డిస్‌ప్లే, 8.5 బిఎమ్‌డబ్ల్యూ ఆపరేటింగ్ సిస్టమ్, యాంబియంట్ లైట్, ఫోర్ జోన్ కంట్రోల్‌తో ఆటో ఎసి, 17 స్పీకర్లతో ఆడియో సిస్టమ్, పిడిసి, ఎయిర్‌బ్యాగ్, ఎబిఎస్, బ్రేక్ అసిస్ట్, సిబిసి, క్రాష్ సెన్సార్, డిఎస్‌సి, డిటిసి, టిపిఎంఎస్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

Also Read : ల్యాండ్ రోవర్ నుంచి పవర్ ఫుల్ ఎస్‌యూవీ.. జూలైలో లాంచ్!


కొత్త ఎలక్ట్రిక్ కారులో BMW 83.9 kWh కెపాసిటి గల బ్యాటరీని అందించింది. ఇది ఫుల్ ఛార్జింగ్ తర్వాత 516 కిలోమీటర్ల రేంజ్ పొందుతుంది. ఇందులో డ్యూయల్ మోటార్ ఆల్ వీల్ డ్రైవ్ సెటప్ ఉంది. ఇందులో అమర్చిన రెండు మోటార్లు 601 హార్స్ పవర్ మరియు 795 న్యూటన్ మీటర్ టార్క్‌ను అందిస్తాయి. దీన్ని కేవలం 3.8 సెకన్లలో సున్నా నుంచి 100 కిలోమీటర్ల వరకు నడపవచ్చు. దీని గరిష్ట వేగం గంటకు 230 కిలోమీటర్ల వరకు ఉంటుంది. వాహనంతో పాటు 11 కిలోవాట్ కెపాసిటీ గల ఛార్జర్‌ను అందజేస్తున్నారు.

BMW ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పహ్వా మాట్లాడుతూ.. మొట్టమొదటి BMW i5 M60 xDriveతో, మీరు ఆల్-ఎలక్ట్రిక్ అనుభవానికి తక్కువ ఏమీ ఆశించలేరని అన్నారు. ఇది స్పోర్టియెస్ట్ ఎగ్జిక్యూటివ్ సెడాన్ ఎనిమిదో జనరేషన్‌లా కనిపిస్తుంది.’5′, ‘M’ అడ్రినలిన్- పెర్ఫామెన్స్ ‘i’ స్ట్రాంగ్‌నెస్. BMW గ్రూప్ ఇండియా నుండి ఆరవ ఎలక్ట్రిక్ వెహికల్‌గా BMW i5 M60 xDrive భారతీయ లగ్జరీ ఎలక్ట్రిక్ మొబిలిటీ సెగ్మెంట్‌లో ఈ కారు మరింత బలోపేతం చేస్తుంది.

Also Read : దేశంలో బెస్ట్ మైలేజ్ ఇచ్చే కార్లు.. టాప్‌ ప్లేసులో ఇవే!

i5 M60 xDrive ఎక్స్-షోరూమ్ ధరను కంపెనీ రూ. 1.19 కోట్లుగా నిర్ణయించింది. కంపెనీ దీనిపై రెండు సంవత్సరాల అపరిమిత వారంటీ అందిస్తోంది. వెహికల్ బ్యాటరీపై కంపెనీ ఎనిమిదేళ్లు లేదా 1.60 లక్షల కిలోమీటర్ల వారంటీ ఇస్తోంది.

Tags

Related News

DMart: ఏంటీ.. డిమార్టులో ఇలా మోసం చేస్తున్నారా? ఈ వీడియోలు చూస్తే గుండె గుబేల్!

Gold Rate Increased: వామ్మో.. భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతుందంటే?

Digital Gold: డిజిటల్ గోల్డ్‌ తో జాగ్రత్త.. సెబీ సీరియస్ వార్నింగ్!

JioMart Winter Offer: జియోమార్ట్‌ భారీ వింటర్‌ ఆఫర్లు.. బియ్యం, సబ్బులు, మసాలాలు అన్నీ సగం ధరకే..

Luxury Mattresses: అమెజాన్‌లో లగ్జరీ మెట్రెస్‌పై భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ మిస్ అవ్వకండి..

DMart Offers: నవంబర్ లో డిమార్ట్ క్రేజీ ఆఫర్లు, ఆ వస్తువులపై ఏకంగా 80% తగ్గింపు!

Gold Rate: గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Big Stories

×