BigTV English

Janasena Seats : జనసేన బరిలో నిలిచే సీట్లు ఇవేనా?

Janasena Seats : జనసేన బరిలో నిలిచే సీట్లు ఇవేనా?

Janasena with tdp


Janasena Seat Share with TDP(Political news in AP): టీడీపీతో పొత్తుకు సిద్ధమైన జనసేన 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనుంది. మూడు ఎంపీ సీట్ల పరిధిలోని 21 స్థానాలనూ లెక్కలోకి తీసుకుంటే.. మొత్తంగా 45 సీట్లలో జనసేన ప్రభావం ఉండనుంది. ఇప్పటికే తెనాలి, అనకాపల్లి, నెల్లిమర్ల, కాకినాడ రూరల్‌, రాజానగరంలో పోటీచేసే తమ అభ్యర్థుల పేర్లను జనసేనాని ప్రకటించగా, మిగిలిన 18 స్థానాల మీదా పార్టీ ఒక స్పష్టతకు వచ్చినట్లు సమాచారం.

వీటిలో పిఠాపురం, అమలాపురం, భీమవరం, నరసాపురం, నిడదవోలు, పోలవరం, విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, యలమంచిలి, పాలకొండ జనసేనకు ఖరారైనట్లు వినవస్తోంది. వీటికి తోడు గిద్దలూరు, అనంతపురం లేదా పుట్టపర్తి, మదనపల్లె, బద్వేలు లేదా రైల్వే కోడూరు అసెంబ్లీ సీట్లను కోరేందుకు జనసేన సిద్ధమవుతున్నట్లు సమాచారం.


Read More : వారం వారం సర్వే.. తేడా వస్తే అభ్యర్థులను మార్చేస్తా.. చంద్రబాబు వార్నింగ్..

ఇక.. లోక్‌సభ విషయానికొస్తే.. బందరు, కాకినాడ, అనకాపల్లిలో జనసేన పోటీ చేయనుంది. వీటిలో అనకాపల్లి నుంచి మెగా బ్రదర్ నాగబాబు జరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. బీజేపీతో చర్చలు కొలిక్కి రాగానే రెండవ జాబితా రూపంలో సీట్లను ప్రకటించేందుకు జనసేన సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Related News

Vijayawada Singapore Flight: విజయవాడ-సింగపూర్ మధ్య ఇండిగో కొత్త విమాన సర్వీస్.. ఎప్పటి నుంచంటే?

Lulu Mall: లులూ మాల్‌పై పవన్ ఫైర్.. సీఎం చంద్రబాబు స్పందన ఇదే, ఇక లేనట్లేనా?

AP Fire Crackers: బాణసంచా తయారీలో ఈ నిబంధనలు తప్పనిసరి.. లేదంటే?

AP Liquor Scam: ఏపీ కల్తీ లిక్కర్ కేసులో A1 జనార్దన్ రావు అరెస్ట్

APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో పాత బస్సులకు గుడ్ బై.. ఇక అన్ని ఈవీ బస్సులే

AP Cabinet: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం

Perni Nani: అధికారంలోకి రాగానే నేనంటే ఏంటో చూపిస్తా.. పోలీస్ స్టేషన్ లో పేర్ని నాని రచ్చ రచ్చ

Annamaya District: టీచర్ కిరాతకం.. స్కూల్ ఫీజు చెల్లించలేదని.. కంటిపై రాయితో కొట్టాడు

Big Stories

×