BigTV English

Actress Trisha: అన్నయ్యల్లారా చాలా థాంక్స్.. ఆ ముగ్గురిపై త్రిష కామెంట్స్ వైరల్!

Actress Trisha: అన్నయ్యల్లారా చాలా థాంక్స్.. ఆ ముగ్గురిపై త్రిష కామెంట్స్ వైరల్!

Trisha latest comments


Trisha Latest Comments: హీరోయిన్ త్రిష టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. స్టార్ హీరోలతో జతకట్టిన ఈ బ్యూటీ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్పరచుకుంది. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, ఎన్టీఆర్, మహేశ్ బాబు ఇలా చాలామంది సీనియర్ స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరితోనూ జతకట్టింది.

అయితే ఆ మధ్య వరుస ఫ్లాపులు అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత కొన్ని రోజులు సినిమాలకు దూరమైంది. ఇటీవల మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్‌‌లో ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత లియో సినిమాలోనూ విజయ్‌కు జోడీగా నటించి మంచి హిట్‌ను కైవసం చేసుకుంది.


ప్రస్తుతం అజిత్ నటిస్తోన్న ‘విడాముయార్చి’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే కమల్ హాసన్‌కు జోడీగా ‘థగ్స్ లైఫ్’ సినిమా చేస్తోంది. అంతేకాకుండా టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవితో 18 ఏళ్ల తర్వాత మళ్లీ జతకట్టింది. వశిష్ట దర్శకత్వం వహిస్తోన్న ‘విశ్వంభర’ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది.

Read More: త్రిషపై సంచ‌లన వ్యాఖ్య‌లు చేసిన నటుడు.. సంచలనంగా మారిన కామెంట్స్..

ఇక త్రిష సెకండ్ ఇన్నింగ్స్‌లో సినిమాలతో పాటు పలు విమర్శలకు గురవుతుంది. ఈ మధ్య ఆమెను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఆ మధ్య త్రిషపై ప్రముఖ నటుడు మన్సూర్ అలీఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

లియో సినిమాలో త్రిషతో రేప్ సీన్ లేనందుకు బాధపడ్డానంటూ మన్సూర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. దీంతో అతడిని ఇండస్ట్రీ నుంచి తొలిగించాలని పలువురు నటీనటులు ఆమెకు సపోర్ట్‌గా నిలిచారు. ఇక ఈ విషయంపై త్రిష చట్టపరంగా వెళ్లడంతో మాన్సూర్.. త్రిషకు క్షమాపణలు చెప్పాడు. దీంతో ఆ విషయం సర్దుమణిగింది.

ఈ నేపథ్యంలో ఆమెపై మరో వ్యక్తి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అన్నాడీఎంకే లీడర్ ఏవీ రాజు.. త్రిషను అప్రతిష్టపాలు చేసే విధంగా ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఓ ప్రముఖ పొలిటికల్ లీడర్ త్రిషకు డబ్బులిచ్చి రిసార్ట్‌కి తీసుకెళ్లాడని తీవ్రమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

Read More: కఠిన చర్యలు తప్పవు.. ఏవీ రాజుపై విరుచుకుపడ్డ త్రిష

దీన్ని తీవ్రంగా ఖండించిన త్రిష.. అతడికి నోటీసులు పంపారు. ఈ వ్యవహారంలో పలువు సినీ ప్రముఖులు ఆమెకు సపోర్ట్‌గా నలిచారు. ముఖ్యంగా దర్శకుడు చేరన్‌, సముద్రఖని, నాజర్‌ త్రిషపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. దీనికి స్పందించిన త్రిష తనకు మద్దతుగా నిలిచిన ముగ్గురు అన్నయ్యలకు ధన్యవాదాలు అంటూ తెలిపారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×