BigTV English

Roja vs Pawan : చిత్తూరు చిత్రాంగి.. నాల్గవ జాతి వ్యక్తి.. రోజాకు ఇచ్చిపడేసిన జనసేన

Roja vs Pawan : చిత్తూరు చిత్రాంగి.. నాల్గవ జాతి వ్యక్తి.. రోజాకు ఇచ్చిపడేసిన జనసేన

Roja vs Pawan : తిరుమల గోశాల వివాదం రచ్చ రచ్చ అవుతోంది. గోవుల మరణాలపై వైసీపీ వర్సెస్ టీడీపీ యుద్ధమే జరుగుతోంది. భూమనకు మద్దతుగా గురువారం రోజా ఎంట్రీ ఇచ్చారు. అయితే, టీటీడీనో, టీడీపీనో విమర్శించకుండా పవన్ కల్యాణ్‌పైనే ఎక్కువగా అటాక్ చేస్తూ మైండ్ గేమ్ ఆడారు ఆర్కే రోజా. సనాతన ధర్మాన్ని కాపాడుతానని చెబుతున్న పవన్ కల్యాణే.. టీటీడీ అరాచకాలు, గోవుల మృతిపై సమాధానం చెప్పాలని నిలదీశారు. తిరుమల వెంకన్నతో పెట్టుకుంటే ఎవరికీ పుట్టగతులు ఉండవని.. పవన్‌కు కూడా ఇటీవలే ఈ విషయం అనుభవంలోకి వచ్చిందంటూ.. పరోక్షంగా మార్క్ శంకర్ ఘటనను ప్రస్తావిస్తూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు.


రోజాపై జనసేన సీరియస్

తమ సేనానిని రోజా అన్నేసి మాటలు అంటుంటే జనసైనికులు ఊరుకుంటారా? ఆ పార్టీ సీనియర్ లీడర్ బొలిశెట్టి సత్యనారాయణ, జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్‌లు రంగంలోకి దిగారు. రోజాకు అర్థమయ్యే భాషలోనే ఘాటైన విమర్శలు చేశారు. గోశాల ఘటనపై భూమన కరుణాకర్‌రెడ్డి డ్రామాలు చేస్తున్నారని మండిపడ్డారు.


బొలిశెట్టి కామెంట్స్ :

గతంలో కరుణాకర్‌రెడ్డి హారతి డ్రామా ఆడారని.. ఇప్పుడు గోవుల డ్రామా ఆడుతున్నారని జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ మండిపడ్డారు. భూమాన వలన తిరుమల ప్రతిష్ఠ దిగజారిందన్నారు. గోశాలకు వెళ్లనివ్వడం లేదని కరుణాకర్ రెడ్డి అనడం పచ్చి అబద్ధమన్నారు. ఇక, రోజాను మాటలతో చెడుగుడు ఆడుకున్నారు బొలిశెట్టి. ఆర్కే రోజా.. ఆడా, మగా, హిజ్రా కూడా కాని.. నాల్గవ జాతికి చెందిన వ్యక్తి అంటూ ఫైర్ అయ్యారు. రోజా గతంలో దర్శనం టికెట్లు బ్లాక్‌లో అమ్ముకొని కోట్లు గడించారని విమర్శించారు. ఇప్పుడా దందా ఆగిపోవడంతో.. తిరుమలపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మూర్తి యాదవ్ ఏమన్నారంటే..

జనసేన విశాఖ కార్పొరేటర్, ఫైర్ బ్రాండ్ లీడర్.. మూర్తియాదవ్ మరింత రెచ్చిపోయారు. టీటీడీ చైర్మన్‌గా కరుణాకర్‌రెడ్డి కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల కొండపై అన్యమత ప్రచారానికి ఒడిగట్టారని విమర్శించారు. ఇప్పుడు గోశాల వివాదం తీసుకువచ్చి తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

ఐరన్ లేడీ.. రోజా నడ్డి విరిచినా..

రోజా.. చిత్తూరు చిత్రాంగి అని.. ఐరన్ లెగ్ లేడీ అంటూ మండిపడ్డారు మూర్తి యాదవ్. రోజా తన ఐరన్ లెగ్‌తో వైజాగ్ ఋషికొండ ప్యాలెస్‌కు గృహ ప్రవేశం చేశారని.. అది ఇప్పటికీ అలాగే ఉండిపోయిందని ఎద్దేవా చేశారు. నగరి ప్రజలు రోజా నడ్డి విరిచిన ఇంకా బుద్ధి రాలేదని అన్నారు. రోజా ఆ చిత్రాలలో నటించలేదని తిరుమలలో ప్రమాణం చేయగలరా? అని ప్రశ్నించారు మూర్తి యాదవ్.

Also Read : చెప్పులు పంపిన సేనాని.. ఇప్పుడు చెప్పండ్రా?

రోజాకు జనసేన సవాల్

టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ వైజాగ్ వాడు అంటూ చులకన చేసి మాట్లాడారని రోజాను తప్పుబట్టారు. వారం రోజులలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్‌కు బహిరంగ క్షమాపన చెప్పాలని డిమాండ్ చేశారు. రోజా సారీ చెప్పకపోతే.. ఆమెను వైజాగ్‌లో అడుగుపెట్టనివ్వమని సవాల్ చేశారు మూర్తి యాదవ్.

Related News

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Big Stories

×