E-Paper

అసలెవరీ సాయికృష్ణ.. బతికున్నాడా? బలయ్యాడా? ఏపీలో క్షణక్షణం ఉత్కంఠ!

అసలెవరీ సాయికృష్ణ.. బతికున్నాడా? బలయ్యాడా? ఏపీలో క్షణక్షణం ఉత్కంఠ!
Advertisement

SaiKrishna Missing: విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ అదృశ్యం వ్యవహారం.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. కృష్ణలంక పోలీసులు.. ఓ కేసుకు సంబంధించి అతడ్ని అరెస్టు చేశారని.. స్టేషన్ లో చిత్ర హింసలకు గురిచేసి చంపేశారన్న ప్రచారం తీవ్ర దుమారం రేపుతోంది. ముఖ్యంగా కృష్ణలంక పోలీసు స్టేషన్ సీఐ నాగరాజు లాకప్ లో సాయికృష్ణను చిత్రవద చేసి హత్య చేశారంటూ విపక్ష వైసీపీతో పాటు బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి స్వయంగా వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించడంతో ఒక్కసారిగా రాజకీయాలు హీటెక్కాయి.

అసలు ఎవరీ సాయికృష్ణ?

గాదె సాయికృష్ణకు సంబంధించి అధికారికంగా ఎలాంటి సమాచారం లేనప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం అతడో పెద్ద క్రిమినల్ అంటూ ప్రచారం సాగుతోంది. కృష్ణలంక పోలీసు స్టేషన్ పరిధిలోని రాజీవ్ కాలనీకి చెందిన గాదె సాయికృష్ణ అలియాస్ పిల్ల సాయికి 25 ఏళ్లు. నెట్టింట వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. చిన్న వయసులోనే అతడిపై హత్య, అత్యాచారం, పోక్సో, కిడ్నాప్, దోపిడీలు, గంజాయి స్మగ్లింగ్ వంటి తీవ్రమైన ఆరోపణలతో ఏకంగా 23 కేసులు నమోదై ఉన్నాయని తెలుస్తోంది. 2017 జనవరి 17న 16 ఏళ్లకే అతడిపై రౌడీ షీట్ (C.No.122/HS/ACP-SD/2017)ను పోలీసులు తెరిచినట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement

అంతర్రాష్ట్ర నేరగాడని ముద్ర

గతంలో విజయవాడను గడగడలాడించిన బ్లేడ్ బ్యాచ్ తో పిల్లా సాయికి సత్సంబంధాలు ఉన్నట్లు కూడా నెట్టింట ప్రచారం సాగుతోంది. పిల్లా సాయి విజయవాడ నగరానికి మాత్రమే పరిమితం కాకుండా గుంటూరు, రాజమండ్రి, హైదరాబాద్ పరిధిలోని పలు స్టేషన్ల పరిధిలో నేరాలకు పాల్పడినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. అతడొక అంతర్రాష్ట్ర క్రిమినల్ అంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. నిత్యం గంజాయి మత్తులో మునిగి తేలే పిల్లా సాయి ప్రవర్తనతో సామాన్య మహిళలు, యువతులు.. బయటికి రావాలంటేనే వణికి పోయే పరిస్థితి ఉండేదని కొందరు తమ పోస్టుల్లో పేర్కొంటున్నారు. అదే సమయంలో క్రిమినల్ ను తలపించేలా పిల్లా సాయి దిగిన ఫొటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.

సీఐపై హత్యాయత్నం కేసు

Advertisement

గాదె సాయికృష్ణ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపడంతో.. ఇప్పటికే సీఐ నాగరాజును పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు సీఐపై హత్యాయత్నం ఆరోపణలపై కేసును నమోదు చేశారు. ఇదిలా ఉంటే ఈ కేసులో నిజా నిజాలు తేల్చేందుకు పోలీసు శాఖ.. ఏసీపీ దైవల ప్రసాద్ నేతృత్వంలో దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆయన తాజాగా తన బృందంలోని ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్ఐలను వెంటపెట్టుకొని సాయికృష్ణ ఇంటికి వెళ్లారు. బాధితుడి తల్లి స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. అటు ఫోరెన్సిక్ టీమ్ సైతం ఈ కేసులో ఆధారాల సేకరణపై ఫోకస్ పెట్టింది.

Also Read: బడ్జెట్ ధరలో ఇల్లు ‘స్మార్ట్’.. రూ.5,000లోపు దొరికే టాప్-5 గ్యాడ్జెట్స్ ఇవే!

బతికున్నాడా? బలయ్యాడా?

గాదె సాయికృష్ణ మిస్సింగ్ కు సంబంధించి.. ఏపీ హైకోర్టులో ఇటీవల హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు కాగా న్యాయమూర్తి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 29 తేదీలోగా హైకోర్టులో సాయికృష్ణను ప్రవేశపెట్టాలని ఆదేశించారు. అయితే సాయికృష్ణను విచారణ పేరుతో కృష్ణలంక సీఐ నాగరాజు లాకప్ డెత్ చేశారని.. వైసీపీ నేత అంబటి రాంబాబు వంటి వారు బహిరంగంగా ఆరోపించడం.. తీవ్ర దుమారం రేపుతోంది. అంతేకాకుండా చనిపోయిన సాయికృష్ణ ఫొటోలు ఇదేనంటూ కొన్ని చిత్రాలను సైతం ఆయన విడుదల చేశారు. అయితే అవి గతంలో సాయికృష్ణ చేతిలో మరణించిన మరో యువకుడిదని తేలింది. మెుత్తం మీద వైసీపీ అధినేత జగన్ స్వయంగా రంగంలోకి దిగడం, హైకోర్టు కలుగజేసుకోవడంతో సాయికృష్ణ వ్యవహారంపై ఉత్కంఠ మెుదలైంది. ఇంతకీ అతడు బతికి ఉన్నాడా? లేదా? అన్నది ఇప్పటికీ ప్రశ్నగా ఉండటంతో ఏపీలో క్షణక్షణం ఉత్కంఠ సాగుతోంది.

Also Read: ఒకే ధర.. భిన్నమైన లాభాలు.. జియో, వీఐ రూ.3599 ప్లాన్లలో ఏది బెస్ట్?

Related News

దేశంలో తొలిసారి.. విశాఖ టు భోగాపురం ఎయిర్‌పోర్టు, ఎయిర్ ట్రావెలర్ల కోసం ప్రత్యేకంగా లాంజ్‌లు

వైసీపీ నేతల చుట్టూ కేసుల ఉచ్చు.. ఇకపై కొడాలి నాని వంతు, విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

కూటమి ప్రభుత్వంపై వైవీ సుబ్బారెడ్డి గరంగరం.. అనకొండల మాటేంటి? డైవర్ట్ కోసమేనా?

ఏపీలో అన్నదాతలకు శుభవార్త.. శనివారం అకౌంట్‌లో రూ.7వేలు, ఖాతా ఒక్కసారి చెక్ చేసుకోండి

ప్రైవేటు ట్రావెల్ బస్సులో మంటలు.. స్పాట్‌లో 35 మంది, అనకాపల్లి జిల్లాలో ఘటన

Saikrishna Case: గాదె సాయికృష్ణ కేసుపై సీబీఐ విచారణ జరగాలని.. వైఎస్ జగన్ డిమాండ్..!

హైదరాబాద్ భూకబ్జా కేసు.. వైసీపీ నేత బొల్లా ఆన్సర్లకు.. పోలీసులకే మైండ్ బ్లాక్!

Big Stories

×