BigTV English

Pawan Kalyan : చెప్పులు పంపిన పవన్.. ఇప్పుడు చెప్పండ్రా?

Pawan Kalyan : చెప్పులు పంపిన పవన్.. ఇప్పుడు చెప్పండ్రా?

Pawan Kalyan : పవన్ కల్యాణ్ సీరియస్ పొలిటిషియన్ కాదట. ఈమధ్యే ఎవరో పెద్ద లీడర్ అన్నారీ మాట. జనసేనానిపై ఇలాంటి విమర్శలు కామన్. పొలిటికల్ కెరీర్ మొదటి నుంచీ ఇవే విమర్శలు. ఎప్పటికప్పుడు సమాధానాలు చెబుతున్నా.. ఫుల్ టైమ్ సీరియస్ పాలిటిక్స్ చేస్తున్నా.. అలాంటి డైలాగులు ఇంకా ఆగడం లేదు. ఎన్నికలకు ముందునుంచే సినిమాలకు దూరంగా ఉన్నారు పవన్. డిప్యూటీ సీఎం అయ్యాక క్షణం తీరిక లేకుండా పని చేస్తున్నారు. ఓజీ ఓజీ అంటూ ఫ్యాన్స్ ఎంత గోల చేస్తున్నా.. వారిని కంట్రోల్ చేస్తున్నారే కానీ.. ముఖానికి మేకప్ కూడా వేసుకోవడం లేదు. తన కొడుకు అగ్రిప్రమాదంలో గాయపడ్డాడని ఉదయమే తెలిసినా కూడా.. ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకుని.. రాత్రికి కానీ విమానం ఎక్కలేదు జనసేనాని. అదీ కమిట్‌మెంట్ అంటే. ఇంతటి సీరియస్ పొలిటిషియన్ పవన్ మినహా మరొకరు ఉండరేమో అనిపిస్తుంది. ఇదంతా పక్కన పెడితే.. అసలు మేటర్ ఏంటంటే…


ఇది కదా పవనిజం అంటే..

ఇటీవలే ‘అడవితల్లి బాట’ పట్టారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. పెదపాడు వెళ్లారు. జనసేనాని తమ గూడేనికి వచ్చారని.. ఆయన్ను కళ్లారా చూడాలని.. అక్కడి వారంతా తరలివచ్చారు. అందులో ‘పొంగి మిత్తు’ అనే వృద్ధురాలు కూడా ఎదురొచ్చి పవన్ కల్యాణ్‌కు స్వాగతం చెప్పింది. ఆమె కాళ్లకు చెప్పులు కూడా లేవు. కానీ, గుండెల నిండా పవన్ అంటే ప్రేమ ఉంది. తనపై అంతటి ఆప్యాయత చూపిన ఆ వృద్ధురాలి స్థితి చూసి జనసేనాని చలించిపోయారు. అలా ఆ గూడెంలో చాలా మంది కాళ్లకు చెప్పులు లేవనే విషయం గ్రహించారు. కేవలం పేదరికంతోనే చెప్పులు కొనుక్కోలేకపోతున్నారని గుర్తించారు. వారందరికీ చెప్పులు ఇప్పించాలని డిసైడయ్యారు.


చెప్పులే కదాని లైట్ తీసుకోకుండా..

పెదపాడు ఉపాధి హామీ సిబ్బందిని పిలిపించి.. ఆ గూడెంలో ఎంతమంది ఉంటారు? వారికి ఏ సైజు చెప్పులు అవసరమో సర్వే చేయించారు. అలా గ్రామంలోని 345 మంది గిరిజనులకు.. తన సొంత డబ్బులతో కొత్త చెప్పులు కొని పంపించారు పవన్ కల్యాణ్. డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది స్వయంగా పెదపాడు వెళ్లి.. స్థానిక సర్పంచ్‌ను తోడుగా తీసుకెళ్లి.. ఇంటింటికీ తిరుగుతూ చెప్పులు అందజేశారు.

పవన్‌ చేసిన పనికి ఫిదా

ఇక కొత్త చెప్పులు వేసుకొని ఆ గిరిజనులు తెగ మురిసిపోతున్నారు. తమ కోసం ఏకంగా ఉప ముఖ్యమంత్రే చెప్పులు పంపడంతో వారి ఆనందానికి అవధులు లేవు. తమ కష్టం తెలుసుకొని.. చొరవ తీసుకొని.. చెప్పులు అందించిన పవన్‌ కల్యాణ్‌కు గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read : చేబ్రోలు కిరణ్ అరెస్ట్‌తో పోలీసులకు ఎంత కష్టమొచ్చిందో..

సీరియస్ పొలిటిషియనా? కాదా?

పేదలకు సాయం చేయడంలో పవన్ కల్యాణ్ ఎప్పుడూ ముందే ఉంటారనే దానికి ఇది ఇంకో ఎగ్జాంపుల్ అంటున్నారు. ఇటీవలి అడవితల్లి బాట కార్యక్రమంలో భాగంగా ఓ గూడెంలో తన సొంత ఖర్చులతో పాఠశాల భవనం నిర్మిస్తానని హామీ ఇచ్చారు. చెప్పినట్టే ఆ స్కూల్ బిల్డింగ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇలాంటివి అనేక ఘటనలు ఉంటాయి. పవన్‌ది పెద్ద చేయి. చేతికి ఎముకే లేనట్టు సాయం చేస్తారు. కోటి రూపాయల విరాళం చాలా ఈజీగా ఇచ్చేస్తుంటారు. ఇప్పుడిలా గిరిజనులకు చెప్పులు సమకూర్చి.. దటీజ్ పవన్ అని మరోసారి అనిపించుకున్నారు. ఎనీ డౌట్స్? హి ఈజ్ వెరీ సీరియస్ పొలిటిషియన్.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×