Coaching Centres: ఐఐటీ-జేఈఈ, నీట్ పరీక్ష ఫలితాలు రేపో మాపో విడుదల కానున్నాయి. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్ సెంటర్లపై కొరడా ఝలిపించింది కేంద్ర ప్రభుత్వం. తప్పుడు ర్యాంకులను ప్రకటిస్తూ మోసం చేస్తున్న పలు కోచింగ్ సెంటర్లపై చర్యలు చేపట్టింది సెంట్రల్ కన్‌జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ.
కోచింగ్ సెంటర్లపై కొరడా
ప్రతీ ఏడాది మార్చి, ఏప్రిల్ మధ్యలో సెంట్రల్ కన్‌జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ(CCPA) రంగంలోకి దిగుతుంది. పదో తరగతి తర్వాత విద్యార్థులు.. ఇంటర్ కాలేజీల్లో అడ్మిషన్లు తీసుకుంటారు. ఈ క్రమంలో తమ సెంటర్లకు ర్యాంకులు వచ్చాయని పేరెంట్స్, విద్యార్థులను మోసగించే ప్రయత్నాలు చేస్తున్నాయి కొన్ని కోచింగ్ సెంటర్లు.
ఈ క్రమంలో సెంట్రల్ కన్‌జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఎంట్రీ ఇచ్చేసింది. రూల్స్ అధిగమించిన కోచింగ్ సెంటర్లకు జరిమానా విధించింది. కొన్ని సెంటర్ల యాజమాన్యాలను నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా కోచింగ్ సెంటర్లు పాటించాలని తెలిపింది.
జరిమానాలు, ఆపై నోటీసులు
దీని ప్రకారం విద్యార్థులు సాధించిన ర్యాంకుల వివరాలు ఖచ్చితంగా ఉండాలి. ఇతరును తప్పుదారి పట్టించకుండా ఉండకూడదు. ర్యాంకు సాధించిన విద్యార్థుల పేర్లు, కోర్సు వివరాలు, హాల్ టికెట్ నెంబర్ బహిరంగంగా వెల్లడించాలని CCPA పేర్కొంది. నిబంధనలకు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ALSO READ: మాంసాహారం తినేవారు రోత.. మరాఠీలతో గొడవ పడిన గుజరాతీలు
ఇప్పటివరకు ఉల్లంఘనలు అతిక్రమించిన 24 కోచింగ్ సెంటర్లపై దాడులు చేసింది. ఆ తర్వాత 49 నోటీసులు ఇచ్చింది. దాదాపు రూ.77.60 లక్షల జరిమానాలు విధించిట్టు సీసీపీఏ అధికారులు తెలిపారు. కోచింగ్ సెంటర్ లు వినియోగదారుల రక్షణ చట్టం- 2019 ప్రకారం.. తప్పుదారి పట్టించే ప్రకటనల నివారణకు మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని సూచించింది CCPA.
గడిచిన మూడేళ్లుగా వినియోగదారుల హక్కులను కాపాడటానికి CCPA కృషి చేస్తోంది. కోచింగ్ రంగంలో పారదర్శకత, తప్పుదారి పట్టించే ప్రకటనలపై ఉక్కుపాదం మోపుతోంది. UPSC CSE, IIT-JEE, NEET, RBI, NABARD వంటి పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లపై CCPA చర్యలు తీసుకుంది.
చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై జరిమానాలు వేసింది కూడా. గతేడాది UPSC CSE 2022-23 ఫలితాలకు సంబంధించి అభ్యర్థులను తప్పుదారి పట్టించే ప్రకటనలు చేశాయి కొన్ని కోచింగ్ సెంటర్లు. దాదాపు ఏడు లక్షల వరకు పెనాల్టీ విధించింది.