E-Paper
Advertisement

కూటమి ప్రభుత్వంపై వైవీ సుబ్బారెడ్డి గరంగరం.. అనకొండల మాటేంటి? డైవర్ట్ కోసమేనా?

కూటమి ప్రభుత్వంపై వైవీ సుబ్బారెడ్డి గరంగరం.. అనకొండల మాటేంటి?  డైవర్ట్ కోసమేనా?
Advertisement

Delhi: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి అయ్యింది. వైసీపీ ఇంకా యాక్టివ్‌లోకి రావడం లేదు. ఒక్కరు లేదా ఇద్దరు ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. వీలైతే రెండు వారాలకు ఒకసారి, లేకుంటే నెలకు ఒకసారి అధినేత జగన్ మీడియా ముందుకు వస్తున్నారు. ఆయన చెప్పాల్సిన మాటల కన్నా, మీడియాకు ఎక్కువగా మసాలా ఇచ్చేస్తున్నారు.

కూటమి ప్రభుత్వంపై వైవీ సుబ్బారెడ్డి గరంగరం

Advertisement

తాజాగా ఆ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం మీడియా ముందుకొచ్చేశారు. రెండు విషయాలను ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఒకటి అమరావతి నిర్మాణం, మరొకటి టీచర్లు నియామకాల గురించి నోరు విప్పారు. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం తొలుత 49 వేల ఎకరాల్లో కట్టాలని చెప్పారని, ఇప్పుడు మరో 40 వేల ఎకరాలు సేకరణ చేస్తున్నారని విరుచుకుపడ్డారు.

కేవలం నిర్మాణానికి రెండు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని జగన్ మాటలను ప్రస్తావించారు. అమరావతిలో అవినీతి జరుగుతుందని చెబుతూనే, సెక్రటేరియట్ 50 లక్షల చదరపు అడుగులతో కట్టాలని చూస్తున్నారని చెప్పారు. ఒక్క చదరపు అడుగుకు రూ. 20,500 ఖర్చు చేస్తున్నారని, ఇది ముమ్మాటికీ ప్రజల సొమ్ము దోచుకోవడమేనని అన్నారు.

Advertisement

అమరావతి నిర్మాణం.. టీచర్ ఉద్యోగాల నియామకంలో భారీ అవినీతి

CPWD ద్వారా ప్రభుత్వం కార్యాలయాలకు చదరపు అడుగుకు 5 వేలు నిర్మాణానికి కేంద్రం ఖర్చు చేస్తోందని, అమరావతిలో నాలుగు రెట్లు ఖర్చు చేస్తున్నారని దుయ్యబట్టారు. అమరావతి నిర్మాణంపై సమగ్ర దర్యాప్తు జరగాలని కుండ బద్దలు కొట్టేశారు. ప్రధాని, హోంమంత్రి, సీబీఐకి జరుగుతున్న అవినీతి‌పై వినతి పత్రాలు అందజేస్తామన్నారు.

మరొక సబ్జెక్ట్ టీచర్ ఉద్యోగాల ప్రక్రియ. అమరావతి తర్వాత అతి పెద్ద స్కామ్ డీఎస్సీ రిక్రూట్‌మెంట్ అని తేల్చేశారు సదరు ఎంపీ. ఈ పరీక్షకు 16 వేల మంది రాస్తే 3 వేల మంది సెలెక్ట్ అయ్యారని ఆ పార్టీ వెర్షన్ చెప్పారు. డీఎస్సీలో పేపర్ లీక్ చేసి పార్టీ నేతలకు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు, స్పోర్ట్స్ కోటా కింద డీఎస్సీలో ఉద్యోగాలు ఇచ్చారంటూ కొత్త విషయాలను బయటపెట్టారు.

ALSO READ: ఏపీలో అన్నదాతలకు శుభవార్త.. శనివారం అకౌంట్‌లో రూ.7వేలు, ఖాతా ఒక్కసారి చెక్ చేసుకోండి

డీఎస్సీలో ముమ్మాటికీ అవకతవకలు జరిగాయని ఆయన వెర్షన్. డీఎస్సీ అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ విషయం బయటకు వచ్చిందన్నారు. స్పోర్ట్స్ కోటలో గోల్డ్ మెడల్ వచ్చినవారికి ఉద్యోగం రాలేదన్నారు. జరిగిన అవినీతిపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఉన్నట్లుండి వైవీ సుబ్బారెడ్డి మీడియా ముందుకు రావడంపై టీడీపీ నేతలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. ఏపీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ నేతలకు నోటీసులు, పలువుర్ని ఈడీ అరెస్ట్ చేయడం వంటి వ్యవహారాలను డైవర్ట్ చేసేందుకు ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారన్నది అధికార పార్టీ నేతల వెర్షన్.

 

Related News

ఊరేగింపు రూట్ మార్చాలన్న పోలీసులు.. భగ్గుమన్న హిందూ సంఘాలు!

చంద్రబాబు సభపై అమర్నాథ్ సెటైర్లు.. విశాఖలో అసలు సమస్య ఇదేనంటూ ఫైర్!

తిరుమల లడ్డులో అసలు నెయ్యే లేదా? మరి జంతువుల కొవ్వు మాటేంటీ?

తిరుమల లడ్డూ కల్తీపై ఈడీ సంచలన ప్రకటన.. పవన్ కళ్యాణ్‌పై నెటిజన్లు ఫైర్!

విశాఖ ప్రజలకు గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు?

టీడీపీ, వైసిపి రెండూ ఆయన తొత్తులే.. వైఎస్ షర్మిలా సంచలన వ్యాఖ్యలు!

2029లో చీపురుపల్లి నుంచే పోటీ.. పుకార్లకు చెక్ పెట్టిన బొత్స సత్యనారాయణ

అనకాపల్లి జిల్లాలో విషాదం.. వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమజంటల ఆత్మహత్య!

Big Stories

Advertisement
×