E-Paper
Advertisement

ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ లేదా… డోంట్ వర్రీ ఈ 5 అద్భుతమైన సినిమాలు ఫ్రీగానే చూడవచ్చు

ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ లేదా… డోంట్ వర్రీ ఈ 5 అద్భుతమైన సినిమాలు ఫ్రీగానే చూడవచ్చు
Advertisement

Free Movies on MX Player : ఈ రోజుల్లో అన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు సబ్‌స్క్రిప్షన్ తీసుకోవడం అన్నది ఖర్చుతో కూడుకున్న పని అయిపోయింది. కానీ మీరు ఇంట్లోనే హాయిగా, ఉచితంగా సూపర్ హిట్ సినిమాలు చూడాలనుకుంటే ఎంఎక్స్ ప్లేయర్ (Mx Player) బెస్ట్ ఆప్షన్. ఇక్కడ రజనీకాంత్, మహేష్ బాబు, ధనుష్, నాగ శౌర్య వంటి స్టార్ల సినిమాలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి ? వీకెండ్ స్పెషల్‌గా ఇంట్లో కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఈ లిస్ట్ లో ఉన్న పర్ఫెక్ట్ మూవీస్ ఏంటి ? అన్న వివరాల్లోకి వెళ్తే…

1. సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata)

మహేష్ బాబు, కీర్తి సురేష్ నటించిన యాక్షన్ డ్రామా ‘సర్కారు వారి పాట’. బ్యాంకింగ్ సిస్టమ్‌ లోని అన్యాయాలకు వ్యతిరేకంగా ఒక సాధారణ యువకుడు ఎలా పోరాడతాడు ? అనేది కథ. థియేటర్లలో భారీ విజయం సాధించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 188 కోట్లు, భారతదేశంలో రూ. 137.95 కోట్లు వసూలు చేసింది. యాక్షన్, ఎమోషన్, మాస్ అప్పీల్ నిండిన ఈ సినిమా. కుటుంబంతో కలిసి చూడడానికి బెస్ట్ ఆప్షన్.

2. రంగబలి (Rangabali)

Advertisement

నాగ శౌర్య, యుక్తి థరేజా నటించిన రొమాంటిక్ యాక్షన్ కామెడీ డ్రామా ఇది. యాక్షన్, ప్రేమ, కామెడీ మూడూ బ్యాలెన్స్‌గా ఉండటం ఈ సినిమా ప్రత్యేకత. థియేటర్లలో ఆశించినంత విజయం రాకపోయినా, ఓటీటీలో మంచి ఆదరణ పొందింది. హాయిగా నవ్వుకుంటూ చూడాలనుకుంటే ఇది బెస్ట్.

3. జైలర్ (Jailer)

రజనీకాంత్ సూపర్ స్టార్ పవర్‌ తో వచ్చిన యాక్షన్ డ్రామా ఈ మూవీ. జైలర్‌ గా రజనీకాంత్ చేసిన మాస్ ఎంట్రీ, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ సినిమాను స్పెషల్ చేశాయి. ఈ మూవీ బడ్జెట్ రూ.200 కోట్లు కాగా, ప్రపంచవ్యాప్తంగా రూ. 604.50 కోట్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్ అయింది. రజనీ ఫ్యాన్స్‌కు తప్పక చూడాల్సిన సినిమా ఇది.

4. వారిసు (Varisu)

Advertisement

తలపతి విజయ్, రష్మిక మందన్న నటించిన యాక్షన్ థ్రిల్లర్ డ్రామా ‘వారసుడు’. కుటుంబం, వ్యాపారం, ప్రతీకారం మూడూ కలిపి ఈ స్టోరీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. థియేటర్లలో మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రం రూ.297.55 కోట్ల గ్రాస్ కలెక్షన్‌ తో విజయం సాధించింది. విజయ్ మాస్, ఎమోషన్, రష్మిక గ్లామర్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటుంది.

5. కెప్టెన్ మిల్లర్ (Captain Miller)

ధనుష్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘కెప్టెన్ మిల్లర్’. 2024లో విడుదలైన ఈ చిత్రం ఇప్పుడు ఎంఎక్స్ ప్లేయర్‌ లో ఉచితంగా అందుబాటులో ఉంది. ధనుష్ యాక్షన్ అవతారం, స్టోరీలోని ఉత్కంఠ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. మోస్తరు బాక్సాఫీస్ వసూళ్లు సాధించినా, ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలన్నీ ఎంఎక్స్ ప్లేయర్లో ఉచితంగా చూడవచ్చు. ఒక్క సినిమాకు కూడా సబ్‌స్క్రిప్షన్ అవసరం లేదు. వీకెండ్‌లో కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయడానికి ఇవి పర్ఫెక్ట్ మూవీస్.

Read Also : మిస్టీరియస్ నాలుకతో ముద్దూ ముచ్చట… మైండ్ ను మడత పెట్టే ట్విస్టులు

Tags

Related News

ఇంట్లో కూర్చుని 80 లక్షల సంపాదన… హర్రర్ గేమ్ ఆడుతూ ఆగమాగం… ఈ హర్రర్ థ్రిల్లర్ పెద్దలకు మాత్రమే

నైట్‌క్లబ్‌లో లేడీ డాన్సర్ల పవర్ వార్… రెండు కొప్పులు ఒకే చోట ఇమడవు అంటే ఇదేనేమో… తెలుగులో టర్కిష్ మూవీ

చిల్లర బ్యాచ్ కాదు… సీట్-ఎడ్జ్ యాక్షన్‌తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ

సినిమా పిచ్చితో సీక్రెట్ పనులు… అపరిచితుడి ఎంట్రీతో అదిరిపోయే ట్విస్ట్… సింగిల్స్ కి మాత్రమే

కోటి బహుమతి కోసం ఎక్స్‌తో జోడీ… కట్ చేస్తే కాటికి తీసుకెళ్ళే ట్విస్ట్… సీక్రెట్ క్లబ్‌లో హారర్ మిస్టరీ

బైక్ పై ఇద్దరమ్మాయిల రచ్చ… అదిరిపోయే రోడ్ ట్రిప్ డ్రామా… నెవర్ బిఫోర్ కథ

కామాంధులను శిక్షించడానికి రంగంలోకి దిగే రహస్య శక్తి… మృత్యుదేవత విలయతాండవం

ఇన్సూరెన్స్ కోసం ముసలోళ్ల ఇంటికెళ్తే ఇదేం అరాచకం భయ్యా ? ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హర్రర్ మూవీ

Big Stories

Advertisement
×