Amaravati: ఏపీ డీఎస్సీపై వైసీపీ చేస్తున్న రచ్చను తీవ్రంగా ఖండించింది జనసేన పార్టీ. గడిచిన రెండు వారాలుగా ఈ వ్యవహారంపై జరిగిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. జాబ్ క్యాలెండర్ పేరుతో వైసీపీ హయాంలో మోసం చేసిందని ఆరోపించింది. కూటమి చేస్తున్న పనులను సహించలేక తప్పుడు ప్రచారానికి వైసీపీ దిగిందని ఆరోపించింది.
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోగ్యం నిమిత్తం కేరళంకు వెళ్లారు. ఆ సమయంలో ఏపీలో గతేడాది జరిగిన డీఎస్సీపై పెద్ద రచ్చ జరిగింది. దాదాపు రెండువారాలపాటు అధికార టీడీపీ-విపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మాజీ సీఎం జగన్ చేసిన ఆరోపణలను ఖండిస్తూ మంత్రి లోకేష్ పలుమార్లు వీడియో రిలీజ్ చేశారు. మీడియాలో వచ్చిన కథనాలతో స్వయంగా అధికారులు రంగంలోకి దిగిన బాధితులు చెప్పిన వెర్షన్‌పై క్లారిటీ ఇచ్చారు. ఇదంతా జరుగుతున్నా టీడీపీ మాత్రమే ఖండిస్తూ వచ్చింది.
కూటమిలోని జనసేన, బీజేపీలు సైలెంట్ అయ్యాయి. ఈ వ్యవహారంపై ఖండించిన సందర్భాలు లేవు. దీంతో కూటమిలో విభేదాలు వచ్చాయని, అందుకే డీఎస్సీ వ్యవహారంపై నోరు మెదపలేదని భావించింది వైసీపీ. ఈ వ్యవహారాన్ని పదే పదే రైజ్ చేస్తూ వచ్చింది. సీన్ కట్ చేస్తే.. కేరళం నుంచి శనివారం హైదరాబాద్‌కు చేరుకున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆయన నుంచి వచ్చిన సంకేతాలతో మంత్రి కందుల దుర్గేష్ నోరు విప్పారు. గడిచిన కొన్ని రోజులుగా పారదర్శకంగా నియమాకాలు జరిగిన డీఎస్సీపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తప్పుబట్టారు. ఈ విషయంలో వైసీపీ నిరుద్యోగులను మభ్యపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలను జనసేన పార్టీ తరపున ఖండించారు సదరు మంత్రి.
ALSO READ: బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం
జ్యాబ్ క్యాలెండర్ అంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకటించిన వైసీపీ, లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని చెప్పిందని గుర్తు చేశారు. ఐదేళ్ల కాలంలో ఒక్కసారి మెగా డీఎస్సీని ఏర్పాటు చేయలేదన్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కేవలం 148 రోజుల్లోనే ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకం మెగా డీఎస్సీపై సీఎం చంద్రబాబు పెట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అంతేకాదు 16 వేల పైచిలుకు టీచర్ పోస్టులను మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేసిందన్నారు. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా పారదర్శకంగా జరగడం చూసి, ప్రజాభిమానం పెరుగుతుందని భావించి లేని పోని విధంగా ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. ఈ వ్యవహారంపై రేపో మాపో బీజేపీ నేతలు నోరు విప్పే అవకాశమున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో ప్రచారం సాగుతోంది.