E-Paper
Advertisement

హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్ల ఆగడాలు.. కొత్త బీఎండబ్ల్యూ కారుని చుట్టి ముట్టి, రూ2. లక్షలు డిమాండ్

హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్ల ఆగడాలు.. కొత్త బీఎండబ్ల్యూ కారుని చుట్టి ముట్టి, రూ2. లక్షలు డిమాండ్
Advertisement

Hyderabad City: హైదరాబాద్ సిటీలో ట్రాన్స్‌జెండర్ల ఆగడాలు ఏ మాత్రం ఆగలేదు. ఈ విషయంలో వారిని పిలిచి పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా, కనీసం మారిన సందర్భం కనిపించలేదు. తాజాగా కొత్త ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. షోరూమ్ నుంచి ఓ వ్యక్తి బీఎండబ్ల్యూ కారు తీసుకుని వెళ్తుండగా దాన్ని చుట్టుముట్టారు కొంతమంది ట్రాన్స్‌జెండర్లు. రెండు లక్షలు ఇవ్వాలని కారు ఓనర్‌ని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.

హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్ల ఆగడాలు

హైదరాబాద్ పేరు చెబితేచాలు చాలామంది వణికిపోతున్నారు. కొత్త ఇళ్లు కొనుగోలు, షాపు ఓపెనింగ్, వాహనాలు తీసుకోవాలన్నా ట్రాన్స్‌జెండర్ల వేధింపులు తప్పుకోలేకపోతున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే వీరు ట్రాన్స్‌జెండర్లు కాదు.. మనీ మాయలేడీలు. ట్రాన్స్‌జెండర్లు పేరుతో దోపిడీలకు తెగబడుతున్నారు. ఒకరు ఇద్దరు కాదు.. హైదరాబాద్ నగరంలో రకరకాల పేర్లతో గ్రూపులు ఉన్నాయి. స్థానిక ట్రాన్స్‌జెండర్లు పెద్దగా ఒత్తిళ్లు చేసిన సందర్భాలు చాలా తక్కువ. కాకపోతే ఉత్తరాది వచ్చిన ఓ గ్యాంగ్, బీభత్సం సృష్టిస్తున్నారు.

కొత్త బీఎండబ్ల్యూ కారుని చుట్టి ముట్టి, రూ2. లక్షలు డిమాండ్

Advertisement

తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యక్తి కారు షోరూమ్ నుంచి BMW కారును ఇంటికి తీసుకువెళ్తుండగా కొందరు ట్రాన్స్‌జెండర్లు చుట్టుముట్టారు. శుభ సూచక కానుక పేరుతో రూ. 2 లక్షలు డిమాండ్ చేశారు. ఆ యువకుడు కొంత డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించాడు. అందుకువారు ఏ మాత్రం అంగీకరించలేదు. రూ. 2 లక్షలు పూర్తిగా ఇవ్వాలని పట్టుబట్టారు. డబ్బులు లేకుంటే క్యూఆర్ (QR) కోడ్ ద్వారా చెల్లించమని ఒత్తిడి చేశారు. చివరకు వాళ్ల నుంచి ఏదో విధంగా కారు ఓనర్ బయటపడ్డాడు. హైదరాబాద్ నడిరోడ్డులో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ALSO READ: చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

Advertisement

గతవారం శ్రావణమాసం సందర్భంగా కొత్త ఇంట్లలోకి హైదరాబాద్‌కు చెందిన  ఓ ఫ్యామిలీ దిగింది. వాళ్లు ఇంట్లోకి దిగిన సమయంలో ట్రాన్స్‌జెండర్లు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ వీడియో వైరల్ అయ్యింది. చివరకు బట్టలు విప్పేసి మరీ వారి నుంచి డబ్బులు వసూలు చేశారు. డబ్బులు లేకుండా అంత ఇళ్లు ఎలా కొనుగోలు చేశారు? అంటూ ఎదురు ప్రశ్న వేయడం, ఇంట్లోని దేవుడు సామాన్లు నానా బీభత్సం చేసిన విషయం తెల్సిందే.

ఈ ఘటన తర్వాత నగర పోలీసులు పలువురు ట్రాన్స్‌జెండర్లు పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. మనీ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గేదు. హైదరాబాద్ సిటీలో కొత్త ఇళ్ల నిర్మాణాలు ఎక్కడ జరుగుతున్నాయి? మంచి ముహూర్తాలు ఎప్పుడు ఉన్నాయి? ఇవన్నీ చూసుకుని తెల్లవారుజామున వాహనాలు వేసుకుని కదలికలు గమనిస్తున్నారు. జరుగుతున్న ఘటనపై నగరవాసులు పోలీసులకు ఫిర్యాదు చేసినా షరామామూలే.

 

Related News

చవితి ముసురు.. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున నుంచి..

పొంగులేటి సమాధానం చెప్పలేదు.. క్షమాపణ కోరలేదు: హరీశ్‌రావు

వంద రోజుల్లో అన్నాం.. ఏ వంద రోజులో చెప్పామా? బీఆర్‌ఎస్ మాక్ అసెంబ్లీలో తలసాని రచ్చ!

ఖమ్మం జిల్లాలో ఎల్‌నినో ఎఫెక్ట్.. పంట మార్చినా రైతన్నకు తప్పని కన్నీళ్లు!

తెలంగాణను దేశంలోనే క్రీడా శక్తిగా తీర్చిదిద్దుతాం: మంత్రి వాకిటి శ్రీహరి

అధికారంలో ఉంటేనే సభకు వస్తారా? BRS ఎమ్మెల్యేలపై కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణలో గీజర్ అక్కర్లేని గ్రామం.. నిరంతరం వేడినీరు దొరికే ఊరు ఎక్కడో మీకు తెలుసా..?

Big Stories

Advertisement
×