E-Paper
Advertisement

జాబ్ వెతకడానికి ఇకపై నేరుగా దుబాయ్ వెళ్లిపోవచ్చు.. కొత్త వీసా ఇదిగో.. స్పాన్సర్ అవసరం లేదు

జాబ్ వెతకడానికి ఇకపై నేరుగా దుబాయ్ వెళ్లిపోవచ్చు.. కొత్త వీసా ఇదిగో.. స్పాన్సర్ అవసరం లేదు
Advertisement

UAE Job Search Visa| విదేశాల్లో ఉద్యోగం చేయాలని చాలామంది భారతీయులు కలలు కంటారు. అయితే, విదేశాలకు వెళ్లకముందే ఉద్యోగం లభించకపోవడం చాలామందికి పెద్ద అడ్డంకిగా ఉంటుంది. ఇలాంటి వారికి దుబాయ్‌లో ఉద్యోగ అవకాశాలు నేరుగా వెతుక్కునే అవకాశం ఉంది. యుఏఈ దేశ ప్రభుత్వం తాజాగా ఒక ప్రత్యేక జాబ్ సెర్చ్ వీసా లాంచ్ చేసింది. ఈ వీసా నేరుగా ప్రభుత్వం జారీ చేస్తుంది, స్థానిక యజమాని అనుమతి అవసరం ఉండదు.

దుబాయ్‌లో ఉద్యోగాలు వెతకడానికి ప్రత్యేక వీసా

కొత్తగా లాంచ్ చేసిన దుబాయ్ జాబ్ ఎక్స్‌ప్లోరేషన్ విజిట్ వీసా ద్వారా అర్హులైన వారు ఉద్యోగాలు వెతక్కోవచ్చు. ఈ వీసాతో నేరుగా దుబాయ్ వెళ్లి అక్కడే స్థానికంగా కంపెనీలను సంప్రదించవచ్చు.
అలాగే ఉద్యోగ ఇంటర్వ్యూలకు హాజరై రిక్రూటర్లను నేరుగా కలిసేందుకు వీలు ఉంటుంది. భారత్‌లో ఉండి ఉద్యోగాలకు దరఖాస్తు చేయడంతో పోలిస్తే ఇలా నేరుగా వెళ్లి ఉద్యోగాలు వెతకడం వల్ల ఉద్యోగావకాశాలు, మంచి సాలరీ పొందే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి.

ఈ వీసాతో ఎంతకాలం దుబాయ్‌లో ఉండవచ్చు?

Advertisement

అర్హత ఉన్న దరఖాస్తుదారులు 60, 90 లేదా 120 రోజుల వీసాను ఎంచుకోవచ్చు. ఉద్యోగం వెతకడానికి అవసరమైన సమయాన్ని బట్టి వీసా వ్యవధి ఎంచుకోవచ్చు. కొన్ని పరిస్థితుల్లో నిబంధనలు, అనుమతులకు అనుగుణంగా వీసాను పొడిగించే అవకాశం ఉంటుంది. మొత్తం వ్యవధి కొన్ని సందర్భాల్లో 180 రోజుల వరకు పొడగించుకోవచ్చు. అయితే, ప్రయాణానికి ముందు తాజా ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పరిశీలించాలి.

ఈ వీసాకు ఎవరు అర్హులు?

ఈ వీసా ప్రధానంగా నైపుణ్యం కలిగిన ఉద్యోగార్థుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చింది. సాధారణంగా దరఖాస్తుదారులకు బ్యాచిలర్ డిగ్రీ లేదా సమానమైన విద్యార్హత అవసరం. మీరు వెతుకుతున్న ఉద్యోగాలు యుఏఐ ప్రభుత్వం సూచించిన స్కిల్ లెవెల్స్ 1, 2 లేదా 3లో ఉండాలి. ఈ స్కిల్ లెవెల్స్‌ని యుఏఈ హ్యూమన్ రీసోర్సెస్, ఎమిరటైజేషన్ మంత్రిత్వ శాఖ వర్గీకరిస్తుంది. ఇటీవల చదువు పూర్తి చేసిన భారతీయులు కూడా కొన్ని నిబంధనల ప్రకారం ఈ వీసా పొందవచ్చు. వారు గత రెండు సంవత్సరాల్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాల్సి ఉంటుంది.
వారి యురివర్సిటీ ప్రపంచంలోని టాప్ 500 సంస్థల్లో ఉండాలి. అంతర్జాతీయ ర్యాంకింగ్ సిస్టమ్‌లో ఆ యునివర్సిటీకి గుర్తింపు ఉండాలి. అదనంగా, యుఏఈలో ఉండేందుకు సరిపడా ఆర్థిక వనరులు ఉన్నాయని చూపించాల్సి ఉంటుంది.

దరఖాస్తుకు అవసరమైన పత్రాలు ఇవే

Advertisement

దరఖాస్తుదారులు అవసరమైన పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. కనీసం 6 నెలల చెల్లుబాటు ఉన్న పాస్‌పోర్ట్ అవసరం. ఇటీవలి ఫొటోలు, ధృవీకరించిన విద్యార్హతల పత్రాలు కూడా అవసరం కావచ్చు. అవసరమైనప్పుడు ఆర్థిక వనరులకు సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించాలి. దరఖాస్తుదారు కేటగిరీని బట్టి అదనపు పత్రాలు అవసరం కావచ్చు.

Also Read: పండుగ వేళ అందరిలో స్పెషల్‌గా కనిపించాలా? ఈ 5 మేకప్ లుక్స్ ట్రై చేయండి

ఆన్‌లైన్‌లో వీసాకు ఎలా దరఖాస్తు చేయాలి?

అర్హత ఉన్నవారు అధికారిక యుఏఈ ప్రభుత్వ మార్గాల ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. GDRFA Dubai లేదా ICP ద్వారా దరఖాస్తు చేసే అవకాశం ఉంది. దరఖాస్తుదారులు వ్యక్తిగత వివరాలను నమోదు చేసి వీసా వ్యవధిని ఎంచుకోవాలి. తర్వాత అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి నిర్ణయించిన ఫీజు చెల్లించాలి. దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత వీసాను ఎలక్ట్రానిక్‌ విధానంలో జారీ చేస్తారు.

Also Read: పట్టువదలని విక్రమార్కుడు.. 15 సార్లు అమెజాన్ ఇంటర్‌వ్యూలో ఫెయిల్.. చివరకు అదే కంపెనీలో రూ.కోట్ల జీతానికి జాబ్

వీసా అంటే ఉద్యోగానికి హామీ కాదు

ఈ వీసా లభించినంత మాత్రాన UAEలో ఉద్యోగం తప్పనిసరిగా లభిస్తుందని హామీ ఉండదు. దరఖాస్తుదారులే ఉద్యోగాన్ని వెతికి, నియామక ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలి.
కంపెనీలు, ఉద్యోగ ఆఫర్లు, రిక్రూటర్ల వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఉద్యోగం లేదా వీసా కచ్చితంగా ఇప్పిస్తామని చెప్పే ఏజెంట్లను నమ్మకూడదు. డబ్బు చెల్లించే ముందు అధికారిక వనరుల ద్వారా వివరాలను ధృవీకరించాలి.

Related News

పుతిన్ ‘రష్యా వన్’ vs జిన్‌పింగ్ బోయింగ్ 747.. ఎవరి విమానం ఖరీదైనదో తెలుసా?

ఒకే రోడ్డు.. 14 దేశాలు.. 48 వేల కి.మీ.. ప్రపంచంలోనే లాంగెస్ట్ హైవే ఇదే!

రైలు వాష్ రూమ్ లో యువతి, యువకుడు.. వైరల్ వీడియో చూసి నెటిజన్లు షాక్!

రైలులో ప్రమాదవశాత్తు కిందపడినా ఇక పరిహారం.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు!

QR కోడ్ స్కాన్ చేస్తే సెకన్లలో పేమెంట్.. భారత UPI చూసి జర్మన్ మంత్రి ఆశ్చర్యం!

కాన్వాయ్ వద్దని.. రైలు ఎక్కిన ఆస్ట్రేలియా హైకమిషనర్, నెట్టింట వీడియో వైరల్!

టాయ్ ట్రైన్‌ లో ప్రయాణం, టీ టేస్టీ.. డార్జిలింగ్ అందాలకు అమెరికా రాయబారి ఫిదా!

Big Stories

Advertisement
×