OPPO Enco Buds3 Pro: ప్రస్తుత డిజిటల్ యుగంలో వైర్‌లెస్ ఇయర్ బడ్స్ కేవలం ఒక గాడ్జెట్ మాత్రమే కాదు, అది మన రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన భాగమైపోయాయి. ప్రయాణాలు చేసేటప్పుడు, ఆఫీస్ వర్క్ చేసుకునేటప్పుడు, వర్కవుట్ చేసేటప్పుడు లేదా ఆన్ లైన్ క్లాసులు వినేటప్పుడు ఇలా ప్రతి చోటా TWS ఇయర్ బడ్స్ వాడకం విపరీతంగా పెరిగింది. అయితే.. తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లు అందించడంలో ఒప్పో కంపెనీ ఎప్పుడూ ముందుంటుంది. తాజాగా ఆ బ్రాండ్ నుంచి మార్కెట్లోకి వచ్చిన ఈ మోడల్ బడ్జెట్ యూజర్ల అంచనాలను తలకిందులు చేస్తూ ట్రెండింగ్‌లో సెన్సేషన్ సృష్టిస్తోంది. కేవలం రూ.1799 ధరకే లభిస్తున్న ఈ ఇయర్ బడ్స్ ఫీచర్లు చూస్తే ప్రతి ఒక్కరూ కొనడానికి ఆశపడతారు.
ఈ ఇయర్ బడ్స్ డిజైన్ చాలా మోడ్రన్‌గా, ట్రెండీగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో అందించిన ‘గ్రాఫైట్ గ్రే’కలర్ వేరియంట్ దీనికి ఒక హై-ఎండ్ ప్రీమియం లుక్‌ని ఇస్తుంది. ఇయర్ బడ్స్ ఎర్గోనామిక్ డిజైన్‌తో.. రావడం వల్ల చెవుల్లో ఎంతో సౌకర్యంగా సెట్ అవుతాయి. ఎంతసేపు వాడినప్పటికీ.. చెవులకు ఎలాంటి నొప్పికానీ, ఇబ్బంది కానీ కలగదు. అలాగే జేబులో లేదా చిన్న పర్సులో ఈజీగా పట్టేలా ఉండే దీని కాంపాక్ట్ ఛార్జింగ్ కేస్ ట్రావెలింగ్ చేసేవారికి పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది.
12.4mm టైటానియం-కోటెడ్ డ్రైవర్స్ :
ఇక సౌండ్ క్వాలిటీ విషయానికి వస్తే.. ఈ ప్రైస్ రేంజ్‌లో ఇది నిజంగా అద్భుతమనే చెప్పాలి. ఇందులో పవర్ ఫుల్ 12.4mm టైటానియం-కోటెడ్ డ్రైవర్లను వాడారు. ఇది క్రిస్టల్ క్లియర్ ఆడియో అవుట్ పుట్‌ను అందిస్తుంది. ముఖ్యంగా డీప్ బేస్ లవర్స్ కోసం ఈ ఇయర్ బడ్స్ ఒక గొప్ప వరమనే చెప్పొచ్చు. మీరు ఎలాంటి మ్యూజిక్ విన్నా.. బీట్స్ చాలా స్పష్టంగా, లౌడ్‌గా , వైబ్రేటింగ్‌గా వినిపిస్తాయి. కాల్స్ మాట్లాడుతున్నప్పుడు.. బ్యాక్ గ్రౌండ్ నాయిస్ పెద్దగా వినిపించకుండా క్లియర్ వాయిస్ ట్రాన్స్‌ఫర్ అవుతుంది.
రోజంతా ఛార్జింగ్ టెన్షన్ లేకుండా ఉండాలంటే.. ఈ ఇయర్ బడ్స్ బెస్ట్ ఛాయిస్. ఛార్జింగ్ కేస్‌తో.. కలిపి ఇది ఏకంగా 54 గంటల లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. అంటే.. ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. దాదాపు వారం రోజుల పాటు ఎలాంటి ఛార్జింగ్ కేబుల్స్ అవసరం లేకుండా మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు. ఆఫీస్ మీటింగ్స్ అటెండ్ కావచ్చు. రాత్రింబవళ్ళు సినిమాలు చూసే వారికి, ఎక్కువ సేపు కాల్స్ మాట్లాడే వారికి ఈ బ్యాటరీ కెపాసిటీ చాలా బాగా ఉపయోగ పడుతుంది.
Also Read: రూ.30వేలలోపు బెస్ట్..కూకా Y74 ప్లస్ 55 ఇంచుల టీవీ రివ్యూ!
ఈ ప్రైస్ రేంజ్‌లో డ్యూయల్-డివైస్ పేరింగ్ ఫీచర్ ఉండటం విశేషం. దీని సహాయంతో.. మీ లాప్ టాప్ స్మార్ట్ ఫోన్ రెండింటికి ఒకేసారి కనెక్ట్ అయి ఉండొచ్చు. వర్క్ చేసుకుంటూ.. సడన్‌గా ఫోన్ కాల్ వస్తే ఎలాంటి ఇబ్బంది లేకుండా డివైస్ స్విచ్ చేసుకోవచ్చు. అలాగే జిమ్‌లో.. వర్కవుట్లు చేసేటప్పుడు, జాగింగ్‌కి వెళ్ళేటప్పుడు చెమట పట్టినా లేదా చిన్నపాటి వర్షంలో తడిచినా ఇయర్ బడ్స్‌కి ఎలాంటి ఇబ్బంది రాకుండా IP55 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ ఇచ్చారు.
రూ.2000 లోపు బడ్జెట్‌లో ఒక నమ్మకమైన, స్టైలిష్, పవర్ ఫుల్ TWS హెడ్‌సెట్ కావాలనుకునే ..వారికి ఈ మోడల్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అద్భుతమైన బేస్, లాంగ్ బ్యాటరీ లైఫ్, డ్యూయల్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు దీన్ని మార్కెట్లో బెస్ట్ వ్యాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్‌గా నిలబెడుతున్నాయి.