Jogi Ramesh Reaction: కల్తీ మద్యం కేసులో అరెస్ట్‌పై తొలిసారి స్పందించారు మాజీ మంత్రి జోగి రమేష్. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని వాపోయారు. చంద్రబాబు ప్రభుత్వం తనను కక్ష గట్టి అక్రమంగా అరెస్టు చేశారని వాపోయారు. నకిలీ మద్యం కేసుతో తనకు సంబంధం లేదన్నారు. భార్యాబిడ్డల సాక్షిగా కనక దుర్గమ్మ ఆలయంలో ప్రమాణం చేస్తానని చెప్పానని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు దుర్మార్గానికి ఇది పరాకాష్టగా వర్ణించారు.
అరెస్టు తర్వాత జోగి రమేష్ ఫస్ట్ రియాక్షన్
ఏపీలోని సంచలనం రేపింది నకిలీ మద్యం వ్యవహారం. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్ పోలీసులు షాకయ్యారు. లీటర్ల కొద్దీ నకిలీ మద్యం బయటపడడంతో అటు వైపు దృష్టి సారించారు. కీలక నిందితులుగా భావిస్తున్న జనార్థన్‌రావు ఈ కేసులో అరెస్టు కావడం, ఆయనను విచారించిన కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం మాజీ మంత్రి జోగి రమేష్‌ను అరెస్టు చేసింది సిట్.
సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన తొలిసారి మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు దుర్మార్గానికి ఇది పరాకాష్ట అని విమర్శించారు. కక్ష గట్టి తనను అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. నకిలీ మద్యం కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, భార్యా బిడ్డల సాక్షిగా కనక దుర్గమ్మ ఆలయంలో ప్రమాణం చేస్తానని చెప్పినా ఎవరూ రాలేదన్నారు.
జోగి అరెస్టుపై వైసీపీ రియాక్ట్
మాజీ మంత్రి జోగి రమేష్‌ని అక్రమంగా అరెస్ట్ చేశారని వైసీసీ ఎక్స్ వేదికగా పేర్కొంది. బీసీలంటే ఎందుకు సీఎం చంద్రబాబుకు ఇంత కడుపు మంట అని ప్రశ్నించింది. కాశీబుగ్గ తొక్కిసలాటని జోగి రమేష్ అరెస్ట్‌తో డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొంది. మరోవైపు జోగి రమేష్ అరెస్ట్‌పై చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మేరుగు నాగార్జున, పేర్నినాని, అంబటి రాంబాబు, కన్నబాబు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మార్గాని భరత్ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
ఆయన అరెస్ట్ పూర్తిగా అక్రమమని పేర్కొన్నారు. ఇది కేవలం కక్ష సాధింపు చర్యగా వర్ణించారు. కల్తీ మద్యం కేసులో ఆయన్ని దురుద్దేశంతోనే ఇరికించారని తెలిపారు. జోగి రమేష్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడమే ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. అందుకే రాజకీయ దురుద్దేశంతో తప్పుడు విచారణలు, అక్రమ అరెస్ట్‌లు లేని లిక్కర్ స్కామ్‌లు సృష్టించారని పేర్కొన్నారు.
ALSO READ: నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్, ఎక్సైజ్ కార్యాలయానికి తరలింపు
ఈ కేసులో సీబీఐ దర్యాప్తు జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేశారని, విచారణకు రాకముందే అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ప్రభుత్వ దమనకాండను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని పేర్కొన్నారు. జోగి రమేష్‌ని సిట్ అరెస్టు చేస్తుందని గత రాత్రి వైసీపీ నేతలకు తెలిపింది. జోగి అరెస్టయిన క్షణాల వ్యవధిలో ఆ పార్టీ నేతలు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు.
చంద్రబాబు కక్ష గట్టి నన్ను అక్రమంగా అరెస్టు చేశారు
నకిలీ మద్యం కేసుతో నాకు సంబంధం లేదని భార్యా బిడ్డల సాక్షిగా కనక దుర్గమ్మ ఆలయంలో ప్రమాణం చేశాను
చంద్రబాబు దుర్మార్గానికి ఇది పరాకాష్ట
– జోగి రమేష్ https://t.co/v97IeaW63q pic.twitter.com/YvjFpoCIAN
— BIG TV Breaking News (@bigtvtelugu) November 2, 2025