Fake Liquor Case: ఏపీలో నకిలీ మద్యం కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ అరెస్టు అయ్యారు. ఆదివారం ఉదయం మాజీ మంత్రి ఇంటికి ప్రత్యేక దర్యాప్తు బృందం-సిట్, ఎక్సైజ్ అధికారులు చేరుకున్నారు. జోగి రమేష్ అరెస్టుతో వైసీపీ నేతలు అలర్టయ్యారు.
నకిలీ మద్యం కేసు.. డొంక కదిలింది
నకిలీ మద్యం కేసులో వైసీపీ నేతల చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. కీలక నిందితులు ఇచ్చిన సమాచారంతో ఓ వైపు ఎక్సైజ్ అధికారులు, మరోవైపు సిట్ అధికారులు రంగంలోకి దిగేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ ఆయన నివాసానికి వెళ్లారు సిట్, ఎక్సైజ్ అధికారులు బృందాలు. ఆయన ఇంట్లో సోదాలు చేశారు.
తొలుత అరెస్టు విషయమై అధికారులు జోగి రమేష్‌తో అధికారులు మాట్లాడారు. తాము అరెస్టు చేస్తున్నట్లు ఆయనకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు పరిశీలించిన తర్వాత తాను ఏ తప్పు లేయలేదని, కావాలనే తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేశారట మాజీ మంత్రి. జోగి రమేష్ సోదరుడి ఇంటికి సిట్ అధికారులు వెళ్లారు. ఆయన్ని అరెస్టు చేశారు.
నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ కీలకంగా వ్యవహరించారని ఆరోపణలు వున్నాయి. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న జనార్థన్ రావు, ఆయన సోదరుడు జగన్ మోహన్‌రావులను వారం రోజులపాటు విచారించిన సిట్-ఎక్సైజ్ అధికారులకు కీలక విషయాలు తెలిశాయి. విచారణలో నిందితులు జోగి రమేష్, ఆయన సోదరుడు రాము పేరు బయటపెట్టినట్టు సమాచారం.
జోగి రమేష్ ని అరెస్టు చేసిన అధికారులు
జనార్థన్ రావుని అరెస్టు చేసిన తర్వాత విచారించిన క్రమంలో ఓ వీడియో బయటకు వచ్చింది. అందులో వైసీపీ నేత జోగి రమేష్ తనకు అండగా ఉన్నాడని, ఆయన ఆదేశాలతో నకిలీ మద్యం వ్యాపారం మొదలు పెట్టినట్టు అందులో ఉంది. ఈ క్రమంలో సిట్-ఎక్సైజ్ అధికారులు వచ్చారు. విచారణకు పిలిచి నోటీసు ఇచ్చి ఆ తర్వాత అరెస్టు చేస్తారని భావించారు.
ఉన్నట్లుండి ఒక్కసారిగా సిట్, ఎక్సైజ్ అధికారుల రాకతో జోగి నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు జోగి రమేష్‌ని అరెస్ట్ చేశారు. బయటకు వచ్చిన వచ్చిన కార్యకర్తలకు నమస్కారం పెట్టి, సిట్ అధికారులతో కలిసి వెళ్లారు.
ALSO READ: కాశీబుగ్గ దుర్ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.15 లక్షలు ఎక్స్‌గ్రేషియా
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో జోగి రమేష్- ఏ1 నిందితుడు జనార్థన్‌రావు మధ్య జరిగిన వాట్సాప్ ఛాటింగ్, ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ సమాచారాన్ని క్రోడీకరించిన తర్వాత ఆదివారం ఉదయం జోగి ఇంటికి అధికారులు వచ్చారు.
ఆదివారం సిట్ అధికారులు తన ఇంటికి వస్తారని ముందుగా సమాచారం అందుకున్న జోగి రమేష్.. పార్టీ నేతలకు, సంబంధించినవారికి ఈ విషయం రాత్రి చెప్పారని అంటున్నారు. సిట్ నుంచి అతనికి సమాచారం అందినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో సీబీఐ చేత విచారణ చేపట్టాలని శనివారం జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెల్సిందే.
మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్..!
ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటికి భారీగా చేరుకున్న పోలీసులు
నకిలీ మద్యం కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న జోగి రమేష్
నకిలీ మద్యం కేసులో పాత్రధారి, సూత్రధారి జోగి రమేష్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చిన జనార్ధన్
మరోవైపు జోగి రమేష్ సోదరుడు జోగి రాము… pic.twitter.com/jEsTkdCthz
— BIG TV Breaking News (@bigtvtelugu) November 2, 2025