Adilabad News: రోడ్లపై వెళ్లేటప్పుడు జాగ్రత్త అని పోలీసులు పదే పదే చెబుతున్నారు. అయినా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. లేటెస్టుగా ఆదిలాబాద్ జిల్లాలోని కుప్టి సమీపంలో శనివారం అర్థరాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ప్రైవేటు ట్రావెట్ బస్సు-లారీ ఢీ కొట్టాయి. ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. అసలేం జరిగింది?
శనివారం రాత్రి ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ మండలంలో కుప్టి సమీపంలో ప్రమాదం జరిగింది. గోరఖ్‌పూర్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ప్రైవేటు బస్సు-లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సు ముందు బాగం భారీగా డ్యామేజ్ అయ్యింది. బస్సు అద్దాలు పగిలిపోయాయి. లారీ ముందు భాగం దెబ్బతింది. ఈ ఘటనతో బస్సులో ప్రయాణికులు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు.
అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బస్సు-లారీ డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు. ఘటనలో సమయంలో ట్రాపిక్ జామ్ అయ్యింది.
ఘటన గురించి సమాచారం అందుకున్నపోలీసులు, వెంటనే స్పాట్‌కు చేరుకున్నారు. వాహనాలను పక్కకు తొలగించారు. ట్రాఫిక్ క్లియర్ చేశారు. బస్సులోని ప్రయాణికు మరో వాహనంలో హైదరాబాద్‌కు చేరుకున్నట్లు సమాచారం. ఈ ఘటన గురించి మరింత సమాచారం అందాల్సి వుంది.