E-Paper
Advertisement

సీఎం చంద్రబాబుతో మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ భేటీ.. ప్రభుత్వంతో ఎంఓయూ, వెల్‌నెస్‌ సెంటర్‌ ఏర్పాటు

సీఎం చంద్రబాబుతో మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ భేటీ.. ప్రభుత్వంతో ఎంఓయూ, వెల్‌నెస్‌ సెంటర్‌ ఏర్పాటు
Advertisement

Visakha CII Summit: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ-విదేశాల నుంచి వ్యాపారవేత్తలు తరలి వస్తున్నారు. అందులో వివిధ వర్గాలకు చెందినవారు ఉన్నారు. వారిలో మాజీ క్రికెట్ కూడా ఉన్నారు. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ ఒకరు. ఆయన కంపెనీ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇంతకీ ఆయన పెట్టబోయే కంపెనీపై ఓ లుక్కేద్దాం.

సీఎం చంద్రబాబుతో మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ భేటీ

విశాఖ వేదికగా రెండురోజులపాటు సీఐఐ సదస్సు జరుగుతోంది. ఇప్పటివరకు ఏపీలో వ్యాపారాలు చేస్తున్నవారు తమ తమ కంపెనీలు విస్తరిస్తున్నారు. కొత్తగా మరి కొందరు ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టాలనే దానిపై ఫోకస్ చేశారు. అందులో మాజీ క్రికెటర్ కూడా ఉన్నారు. సదస్సులో భాగంగా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

Advertisement

తమ ఆధ్వర్యంలోని ఓ సంస్థ పెట్టబోయే వ్యాపారం గురించి సీఎం చంద్రబాబుతో దాదాపు అర్థగంటపాటు చర్చించారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు.  రూ.55 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు వద్ద ముక్కం కోస్టల్ వెల్ నెస్, సర్ఫ్ క్లబ్‌కు బ్రాండ్ బీచ్‌లో వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుకు ఓ సంస్థ ముందుకొచ్చింది. ఆ సంస్థకు జాంటీ రోడ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు.

ప్రభుత్వంతో ఎంఓయూ, వెల్‌నెస్‌ సెంటర్‌ ఏర్పాటు

ఉన్నట్లుండి సదస్సుకు జాంటీ రోడ్స్ కనిపించడంతో చాలామంది షాకయ్యారు. ఆయన వ్యాపారాల్లోకి ఎప్పుడు దిగారంటూ చర్చించు కున్నారు. సీఐఐ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు సమక్షంలో రిలయన్స్, గెయిల్, సెయింట్ గోబెయిన్, ఎల్ అండ్ టీ, గ్రీన్‌కో ఎనర్జీస్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదిరాయి.  క్లీన్ ఎనర్జీస్ సొల్యూషన్, హిందుస్థాన్ కోకా-కోలా బేవరేజెస్, కెల్లాగ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వంటి పరిశ్రమల కార్యకలాపాలను ప్రారంభించుకునేందుకు ప్రభుత్వం వెంటనే అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

Advertisement

ALSO READ: ఏపీ స్థానిక ఎన్నికల్లో బీజేపీ అంతర్మథనం.. ఆందోళనలో కమళ నాథులు!

ఆ జీవో కాపీలను ఆ సంస్థ ప్రతినిధులకు అందచేశారు. జపాన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్ కెంజి హిరమత్సు సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. జపాన్ ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటుకు తమ దేశ కంపెనీలు ఆసక్తిగా ఉన్నాయని వివరించారు. అనంతపురం- విశాఖ వద్ద క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు తమ కంపెనీలు ముందుకు వస్తాయని వివరించారు. అమరావతిలో ఏపీ-జపాన్ బిజినెస్ సమ్మిట్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు.

 

Related News

ఏపీ స్థానిక ఎన్నికల్లో బీజేపీ అంతర్మథనం.. ఆందోళనలో కమళ నాథులు!

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణ జనసేనలో అందరి కీలక పదవులన్నీ రద్దు!

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు!

ఏపీతో కియా కార్పొరేషన్ భారీ ఒప్పందం.. రూ.19 వేల కోట్లతో మరో కొత్త ప్లాంట్ అక్కడే..?

విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు వైసీపీ నేతలు ఫిర్యాదు.. వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్!

విజయసాయి రెడ్డి పార్టీ ప్రకటనపై.. చెవిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

బిగ్ బ్రేకింగ్.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మృతి!

Big Stories

Advertisement
×