E-Paper
Advertisement

ఏపీతో కియా కార్పొరేషన్ భారీ ఒప్పందం.. రూ.19 వేల కోట్లతో మరో కొత్త ప్లాంట్ అక్కడే..?

ఏపీతో కియా కార్పొరేషన్ భారీ ఒప్పందం.. రూ.19 వేల కోట్లతో మరో కొత్త ప్లాంట్ అక్కడే..?
Advertisement

Kia Investment: సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో కియా కార్పోరేషన్ సంస్థ ఒప్పందం చేసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, కియా ఇండియా ఎండీ, సీఈఓ గ్వాంగ్ లీ సమక్షంలో ఎంఓయూ చేసుకున్నారు. పెనుకొండలో మరో ప్లాంట్ ఏర్పాటుకు రూ.19 వేల కోట్ల పెట్టుబడిగా పెట్టేందుకు కియా సంస్థతో ఒప్పందం కుదిరింది. దీంతో కొత్తగా 12 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్న కియా సంస్థ ప్రస్తుతం పెనుకొండ ప్లాంట్ నుంచి ఏడాదికి 4.3 లక్షల కార్లను కియా సంస్థ ఉత్పత్తి చేస్తుంది. ఏడాదికి అదనంగా మరో 2 లక్షల కార్ల ఉత్పత్తికి సంబంధించి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న కియా ప్రతినిధులు.

సత్యసాయి జిల్లా ఎర్రమంచిలో..

దీంతో మొత్తంగా ఏడాదికి 6.3 లక్షల కార్లను తయారు చేసే సామర్థ్యానికి ఏపీ కియా చేరుకోనుంది. ఆంధ్రప్రదేశ్ యూనిట్లో తయారైన మేడ్ ఇన్ ఏపీ కార్లను 100కు పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్న కియా కార్పోరేషన్.. సత్యసాయి జిల్లా ఎర్రమంచిలో కార్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు కియా సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నది. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఏపీ పరిశ్రమల శాఖ కార్యదర్శి, కియా కార్పోరేషన్ సీఈఓ సంతకాలు చేసారు. కియా సంస్థతో ఒప్పందం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు.

విస్తృత ప్రయత్నాలు..

Advertisement

కియా కార్ల సంస్థ రాష్ట్రంలో రూ. 19 వేల కోట్ల పెట్టుబడితో ప్లాంట్ విస్తరణ చేపడుతోంది. పెనుకొండకు కియా సంస్థ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తుందని ఎవరూ ఊహించలేదని అన్నారు. ఆ సంస్థను ఏపీకి తీసుకువచ్చేందుకు విస్తృత ప్రయత్నాలు చేశామని, గొల్లపల్లి రిజర్వాయర్ కు నీరు తీసుకువచ్చి కియా ప్లాంట్ ఏర్పాటు చేసుకునేందుకు సహకరించాంమని అన్నారు. జాతీయ రహదారితో పాటు బెంగుళూరు ఎయిర్ పోర్టు కనెక్టివిటీ కల్పించి ఆ సంస్థను ఏపీకి ఆహ్వానించామని, స్వయంగా దక్షిణ కొరియాకు వెళ్లి వారి యాజమాన్యాన్ని ఒప్పించామని దీంతో 14 నెలల్లోనే ప్లాంట్ నిర్మించారని చద్రబాబు అన్నారు.

Also Read: కుర్ర హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్న మలైకా.. ఆ గ్లామర్ ఏంటి బాసూ!

రూ. 19 వేల కోట్ల పెట్టుబడి..

Advertisement

ఏపీలో తయారైన తొలి కియా కారును నేనే ప్రారంభించాను. ఇప్పుడు మేడ్ ఇన్ ఏపీ కియా కార్లు 100కు పైగా దేశాలకు ఎగుమతి అవుతున్నాయని అన్నారు. ఏపీపై నమ్మకం ఉంచి మళ్లీ రూ. 19 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావటం అభినందనీయం అని, పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం పారిశ్రామిక వేత్తలు ఎవరూ అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని అన్నారు. ఇక నుంచి ఏపీలో ఎస్క్రో ఖాతా ద్వారా ప్రోత్సాహకాలు అందించాలని నిర్ణయించామని, ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ యాక్టును కూడా పెట్టుబడులకు రక్షణగా తీసుకువస్తున్నామన్నారు. ఏపీ పారిశ్రామిక రంగానికి దక్షిణ కొరియా కంపెనీలు బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని కోరుతున్నానని అన్నారు.

నమ్మకమైన భాగస్వామి..

విదేశీ పెట్టుబడులకు కూడా ఏపీ ఓ నమ్మకమైన భాగస్వామిగా ఉంది. అందుకే దేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం మాకే వచ్చాయి. సామాజిక బాధ్యతగా కియా పీ4 కార్యక్రమానికి కూడా సహకరించాలని కోరుతున్నానని, నైపుణ్యం ఉన్న యువత ఏపీలో ఉంది. అవకాశాలు కల్పిస్తే పరిశ్రమలకు అనుకూలంగా ఉంటుందని చంద్రబాబు అన్నారు. 2029 మే నాటికే రెండో ప్లాంట్ పూర్తి చేయాలని కియా యాజమాన్యాన్ని కోరుతున్నానని సీఎం చంద్రబాబు కోరారు.

Also Read: మీ ఇంటిని పేల్చేస్తాం… అమితాబ్ ఇంటికి బాంబు బెదిరింపు మెయిల్!

Tags

Related News

విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులకు వైసీపీ నేతలు ఫిర్యాదు.. వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్!

విజయసాయి రెడ్డి పార్టీ ప్రకటనపై.. చెవిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

బిగ్ బ్రేకింగ్.. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మృతి!

24 గంటల్లో ఏపీకి మరో భారీ తుఫాన్.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు!

ఒళ్లు దగ్గర పెట్టుకోండి.. వాళ్లకి జనసేన స్ట్రాంగ్ వార్నింగ్!

శ్రీకాళహస్తి దేవాలయంలో అగ్నిప్రమాదం.. ప్రసాదాల తయారీ కేంద్రంలో ఘటన, ఎలా జరిగింది?

సెమీ కండక్టర్ పరిశ్రమకు హబ్‌గా విశాఖ.. సీఐఐ సదస్సులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×