YSRCP Complaint: విజయవాడ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కి వైఎస్ఆర్‌సీపీ నేతలు వెల్లారు. ట్విట్టర్ స్పేస్ హ్యాండిల్‌లో జనసేన నేతల అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. దీంతో ట్విట్టర్ స్పేస్‌లో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆడియో వీడియోలను సైబర్ క్రైమ్ స్టేషన్‌లో వైసీపీ నేతలు అందిచారు.
వైసీపీ సోషల్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు దొడ్డా అంజిరెడ్డి మాట్లాడుతూ.. జనసేన నేతలు మా పార్టీ అధినేతపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కోన్నారు. పవన్ కల్యాణ్ విషయంలో స్పందించవద్దని జగన్ ఆదేశించారని, కానీ జనసేన నేతలు ట్విట్టర్ స్పేస్‌లో 350 మంది ఇష్టానుసారం మాట్లాడారని తెలిపారు. వీడియో ఆధారాలతో ఫిర్యాదు చేశామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
Also read: మనవళ్ల కోసం మళ్లీ ఆయుధం పట్టిన తాత… విలన్లకు దబిడి దిబిడే… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్
జనసేన పార్టీ వ్యక్తులు జగన్ కుటుంబ సభ్యులపై మాట్లాడిన తీరు ఆక్షేపనీయం అని అన్నారు. కేవలం ఫిర్యాదు మాత్రమే కాకుండా పూర్తి ఆధారాలు సమర్పించాంమని తెలిపారు. ట్విట్టర్ స్పేస్‌లో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి ఆధారాలు ఇచ్చామని, వాళ్లను అరెస్టు చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పై ఉందని పేర్కోన్నారు. హోస్ట్ చేసిన వారి వివరాలు మొత్తం అందించామని, మహిళల పట్ల తప్పు జరిగితే ఊరుకోం అని ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతారని రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు రక్షణ కరువైందని, సినిమా డైలాగులు చెప్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని అన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లోకి రాని ఆడవాళ్ళ గురించి మాట్లాడటం మానేసి దమ్ము, దైర్యం ఉంటే జగన్‌ను నేరుగా ఎదుర్కోవాలని అన్నారు.
ట్విట్టర్ స్పేస్‌లో జగన్ ఆయన సతీమణి భారతిపై అసందర్భంగా జనసేన నేతలు మాట్లాడారు. ఆర్గనైజ్డ్‌గా మా పార్టీ అధినేతపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని, పూర్తి వీడియో ఆడియో ఆధారాలు సమర్పించామని అన్నారు. మా పార్టీ సోషల్ మీడియా నేతలపై గతంలో అకారణంగా 800 పైగా కేసులు పెట్టారు. 24 గంటల్లో చర్యలు తీసుకోకుంటే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తామని అన్నారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత ఇష్యూపై మాట్లాడవద్దని మా పార్టీ అధినేత జగన్ ఆదేశించారు. 24 గంటలు గడవకముందే జనసేన నేతలు ఇష్టానుసారం మాట్లాడటం సరికాదని ఫైర్ అయ్యారు. మీ నేతల వ్యక్తిత్వాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు.. రాష్ట్రంలో ఏం జరుగుతుందో దేశం మొత్తం చూస్తుందని, మహిళలకు అనేక దారుణాలు జరిగాయని అన్నారు. రాఫ్తాడులో విద్యార్ధినిపై జరిగిన దారుణం అందరూ చూశారు. చదువుకునే విద్యార్ధినులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. పోలీసులు 24 గంటల్లో చర్య తీసుకోకుంటే మా పోరాటాన్ని మరింత ఉదృతం చేస్తామని వైసీపీ మాజీ ఎమ్మల్యే మల్లాది విష్ణు హెచ్చిరించారు.
Also Read: 24 గంటల్లో ఏపీకి మరో భారీ తుఫాన్.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు!