Gundeninda GudiGantalu Today episode November 13th: రాత్రి అయితే అందరూ మగాళ్లు కూడా పైన కూర్చొని తాగుతూ ఉంటారు. బాలు తన మరదలు కి ఆరు ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదని అంటాడు. అదేవిధంగా మనోజ్ నాకు రోహిణి దూరమైపోతే నేను పిచ్చోడిని అయిపోతానేమో అని బాధపడిపోతూ ఉంటాడు. అదేవిధంగా రవి కూడా శృతి నా మాట వినట్లేదు అని చాలా ఫీల్ అయిపోతాడు. మొత్తానికి ముగ్గురు కూడా ఒక్కొక్కచోట కూర్చుని తమ బాధల్ని చెప్పుకుంటూ బాధపడిపోతూ ఉంటారు. కానీ మనోజ్ రోహిణి ఎక్కడ దూరం అయిపోతే పిచ్చోడు అయిపోతాడు అని బాలు సలహా ఇస్తాడు..
అందర్నీ పిలిచి నేను ఒక విషయం చెప్పాలి అని అంటాడు. ఇవాల్టి నుంచి షాప్ కి రోహిణి కూడా తీసుకొని వెళ్తాను అని చెప్పగానే ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావ్? ఒక్క నిమిషం ఆగు అని ఒక గిన్నె తెచ్చి మనోజ్ చేతిలో పెడుతుంది. అయితే ఆ గిన్నె చేతిలో పెట్టి రోహిణి నువ్వు తీసుకొని వెళితే కచ్చితంగా ఇదే నీ పరిస్థితి అని చెప్పగానే మనోజ్ షాక్ అవుతాడు.. ప్రభవతికి రోహిణి గురించి ఎంతగా నచ్చ చెప్పాలని చూసినా సరే.. ఇక నువ్వు నాతో మాట్లాడను నా దగ్గరికి రాను అని ఒక పేపర్లో రాసి ఆ తర్వాత రోహిణి తీసుకుని వెళ్ళు అని చెప్పగానే మనోజు నేను ఒక్కడినే షాప్ కి వెళ్తాను అని వెళ్ళిపోతాడు.
సుమతి అరుణ్ కోసం చాలా కష్టపడి పోతూ ఉంటుంది. ఎలాగైనా సరే అరుణ్ణి పెళ్లి చేసుకోవాలి బాలు బావని ఒప్పించాలి అని తెగ కష్టపడి పోతూ ఉంటుంది. అయితే అరుణ్ వాళ్ళ అమ్మ ఇద్దరు వస్తున్నారని ఆలోచిస్తూ ఉంటుంది ఎలాగైనా సరే అక్కకి ఈ విషయం చెప్పాలి అని మీనా కి ఫోన్ చేస్తుంది. అక్క నేను ఒక విషయం గురించి చెప్పాలి అని ఫోన్ చేశాను అని అంటుంది. ఏంటి సుమతి ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఏమైంది అని అనగానే.. అయితే మీనా ఏమైంది చెప్పు ఎందుకంత కంగారు పడుతున్నావు అని చెప్పగానే అరుణ్ వాళ్ళ అమ్మ అరుణో ఇద్దరూ ఇంటికి వస్తున్నారక్క అమ్మతో మాట్లాడడానికి అని అనగానే మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది. అయితే బాలు క విషయం తెలిస్తే తిడతాడు అని దాచిపెట్టి వెళ్తుంది.. నేను పూలు కట్టడానికి వెళ్తున్నానని అబద్ధం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..
అరుణ్ వాళ్ళ అమ్మ అరుణ్ ఇద్దరూ సుమతి వాళ్ళ ఇంటికి వస్తారు. అయితే సుమతి వాళ్ళని మంచిగా రిసీవ్ చేసుకున్న సరే పార్వతి మాత్రం అసలు మాట్లాడడానికి కూడా ఇష్టపడదు. ఇక మీనా ఏంటమ్మా నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు వాళ్ళు ఏం మాట్లాడతారో చూడాలి కదా అని అంటుంది ఇక అరుణ్ వాళ్ళ అమ్మ అరుణ్ ఇష్టపడ్డాడు అని ఎంత చెప్పినా సరే అసలు వినదు మా అల్లుడికి అవమానం జరిగింది కాబట్టే నేను.. ఈ పెళ్లి వద్దు అని అంటున్నాను అని పార్వతి చెప్తుంది అదే మాట మీద పార్వతి కూడా ఉంటుంది.. మీనా ఒకవైపు ఎంత చెప్తున్నా సరే అసలు వినకుండా పార్వతి తన అల్లుడు గౌరవమే తనకి ఇంపార్టెంట్ అన్నట్టుగా మాట్లాడుతుంది ఇక అరుణ్ వాళ్ళ అమ్మ ఏమి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అరుణ్ని చూసి చాలా ఫీల్ అయిపోతుంది.
మీనా ఎక్కడికి వెళ్లిందో ఇంకా ఇంటికి రాలేదు ఎంత చెప్పినా కూడా ఇది మారదు అని ప్రభావతి చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. అయితే ప్రభావతి తనకి ఫుడ్ కూడా పెట్టలేదు నాకు ఆకలేస్తుంది అనేసి మీనపై అరుస్తూ ఉంటుంది.అప్పుడే సడన్గా ఇంట్లోకి వచ్చిన మీనా ఏంటి ఒకరోజు లేకపోతే మావయ్య గారికి అన్నం కూడా పెట్టలేరా మీరు అంతగానం ఏం పని చేస్తున్నారు అని తిట్టేస్తుంది. చేసి పెట్టిన అన్నాన్ని కూడా మీరు పెట్ట లేకపోతే నేనేం చేయమంటారు మీకు రోహిణి కరెక్టు నేను అస్సలు సెట్ గాను మీనా ప్రభావతిపై విరుచుకుపడుతుంది అయితే సుమతీ గురించి నిజం చెప్పడంతో ప్రభావతి షాక్ అవుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Podarillu Today Episode : మహా ప్లాన్ సక్సెస్.. నారాయణ పేరుతో షాప్.. కన్నీళ్లు పెట్టుకున్న మాధవ్..