E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ ఫుల్ హ్యాపీ.. భద్ర, భాగ్యం ప్లాన్ సక్సెస్..? వల్లికి ఘోర అవమానం..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ ఫుల్ హ్యాపీ.. భద్ర, భాగ్యం ప్లాన్ సక్సెస్..? వల్లికి ఘోర అవమానం..
Advertisement

Illu Illalu Pillalu Today Episode November 13th: కామాక్షి సడన్గా ట్రావెల్ ఆఫీస్ లోకి రావడంతో నేను ఇలాంటివి పనులు చేస్తాను.. అప్పుడే మీకు గుర్తుకు వస్తాను అని అనడంతో ధీరజ్ అలాగే సాగర్ ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి? అక్క నువ్వు ఇలాంటి పనులు చేస్తావ్ ఏంటి?అలా ప్రేమ వాళ్ళు చేస్తున్నారు కదా అని అనగానే.. లేదురా మీకు మేము కనిపించడం లేదు కదా.. ఖచ్చితంగా ఇలాంటి పనులను చేస్తే ఆరోజు మా అక్క వచ్చి ఈ పని చేసింది అని గుర్తుకొస్తుంది కదా అని కామాక్షి అంటుంది. నువ్వు మంచిగా సంపాదించిన తర్వాత నీ ఏసీ కారులో మమ్మల్ని తిప్పవా లేదంటే మా అక్క బావ మీద ప్రేమతో ఒక కారు కొనివ్వాలి అని అనుకోవాలి కామాక్షి వచ్చి రాకతలికి కారుకి టెండర్ వేస్తుంది. నాన్న దగ్గర 30 లక్షలు తీసుకున్నావ్ అంట కదా అని అనగానే సరే అక్క నీకు కూడా ఒక 15 లక్షలు అప్పు రాసిస్తాను అని అంటాడు ఆ మాటతో కామాక్షి ఒక్కసారిగా షాక్ అవుతుంది..

వల్లి వల్ల మళ్లీ గొడవలా..?

అందరూ ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నారు ఇలాంటి టైం లో మళ్ళీ ఎక్కువ ఉంటే బాగుంటది కదా అనేసి నర్మదా అనుకుంటుంది. అయితే అందరూ ఏమనుకున్న పర్వాలేదు కానీ నేను ఇప్పుడు వల్లి అక్కని పిలుస్తాను అని నర్మదా వల్లికి ఫోన్ చేయగానే వల్లి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ధీరజ్ వాళ్లు ట్రావెల్ ఏజెన్సీని స్టార్ట్ చేశారు అని చెప్పగానే వళ్లీ చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అయితే నువ్వు అక్కడే ఉంటే ఏం చూస్తావు ఇక్కడికి రా అక్క నేను పిలుస్తున్నాను కదా నేను చూసుకుంటాను నిన్ను ఎవరు ఏమీ అనరు అని నర్మదా శ్రీవల్లికి మాట ఇస్తుంది.. నర్మద పిలవగానే ఈరోజు ఎలాగైనా సరే బావని కలవాలి అని అనుకుంటుంది. అయితే చందు ఫుల్లుగా తాగేసి పడుకొని ఉండడంతో రామరాజు అలాగే వెధవది చాలా బాధపడిపోతారు. ఎలాగైనా సరే చందు ని తీసుకొని అక్కడికి వెళ్లాలని అనుకుంటారు ఇక తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని బాధ పడిపోతూ ఉంటారు ఈ ఎపిసోడ్ కి ఇదే హైలైట్ గా నిలుస్తుంది. అటు భద్ర ధీరజ్ని ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తుంది.

భాగ్యం, భద్ర ప్లాన్ వర్కౌట్..?

Advertisement

రామరాజుకి జిరాక్స్ కాఫీ లాంటి ధీరజ్ గాడు ట్రావెల్ బిజినెస్ లోకి అడుగు పెడుతున్నాను అని చాలా సంతోషంగా ఉన్నాడు. సంతోషపడనివ్వు ఎంతసేపు సంతోష పడతాడో చూస్తాను అని భద్ర పక్కాగా ప్లాన్ చేసి వాడి బిజినెస్ మొత్తాన్ని నాశనం చేయాలని అనుకుంటుంది ఇక భాగ్యం కూడా చేతులు కలపడంతో ఇద్దరు కలిసి ఆ ట్రావెల్ బిజినెస్ ను మూసేలా చెయ్యాలని అనుకుంటారు అందుకోసం రౌడీలను కూడా పిలుస్తారు. ఆ ధీరజ్ గాడిని ఎలాగైనా సరే దెబ్బ కొట్టి వాడిని ఓపెన్ చేసిన రోజే క్లోజ్ అయ్యేలా చేయాలి అని భాగ్యం రౌడీలకు పెద్ద క్లాస్ పీకుతుంది.. మొత్తానికైతే భాగ్యం అటు భద్ర ఇద్దరు కలిసి మాస్టర్ ప్లాన్ వేసినట్లు అర్థమవుతుంది..

కామాక్షి గోలెంట్రా బాబు..

ఇక రామరాజు చందు అలాగే వేదవతి ముగ్గురు కూడా ఇంటి నుంచి ఆ ఆఫీస్ కి రాగానే అందరూ చాలా సంతోషంగా వాళ్లకు వెల్కమ్ పలుకుతారు. ఆఫీస్ని చాలా బాగా రెడీ చేసార్రా నిజంగానే చాలా బాగుంది అంటూ వేదవతి పొగిడేస్తూ ఉంటుంది ఇక అందరూ కలిసి రిబ్బన్ కట్ చేస్తారు. ఈ రిబ్బన్ కట్లు ఇంకా ఆగిపోకుండా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను అని రామరాజు కూడా అంటాడు. ఇంట్లోనే వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఆఫీసును ఓపెన్ చేసి లోపలికి అడుగు పెడతారు. రామరాజు పేరుతో ట్రావెల్ బిజినెస్ మొదలు పెట్టడంతో ప్రేమ మొదట కాస్త కసుబుస్సు లాడిన కూడా ఆ తర్వాత మావయ్య గారి పేరు కదా అనేసి ఊరుకుంటుంది.. ప్రేమను చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుకుంటారు.

రామరాజు మాటతో ప్రేమ హ్యాపీ..

Advertisement

ఇక రామరాజు షాప్ లోకి రాగానే ధీరజ్ నాన్న మీరు ఈ కుర్చీలో కూర్చోవాలి అని చెప్తాడు. కానీ ధీరజ్ మాత్రం రామ రాసిన కూర్చోబెట్టాలని అనుకుంటే రామరాజు మాత్రం ప్రేమని కూర్చోబెడితే బాగుంటుంది అని అనుకుంటాడు. ప్రేమ ఎప్పుడూ బాధపడకుండా చూసుకోవాలి నీకు ఏ కష్టం వచ్చినా నీ భార్యతో చెప్పుకోవాలి. జీవితాంతం నీకు తోడుండేది నీ భార్య కాబట్టి అది ఏ కష్టమైనా సరే నీ భార్యతో చెప్పాలి అని రామరాజు చెప్పగానే ధీరజ్ సరే నాన్న అని అంటాడు. ప్రేమ నువ్వు కూడా నీ భర్తని ఎప్పుడూ కష్టాల్లోకి నెట్టకుండా చూసుకోవాలి అని రామరాజు చెప్తాడు.. మొత్తానికి చైర్మన్ సీట్లు ప్రేమను కుచ్చుపట్టడంతో ప్రేమ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.. అంతేకాదు భార్యలకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ గురించి చెప్పిన రామరాజుపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఎపిసోడ్ కి ఇదే హైలెట్ సీన్ అని చెప్పాలి..

వల్లి ఎంట్రీతో షాక్..

ఇక పూజారి గారు అక్కడ పూజ చేసిన తర్వాత ఇంటి ఆడబిడ్డలు ముందుగా దీపం వెలిగించాలి అని చెప్పగానే కామాక్షి అలాగే అమూల్య ఇద్దరు కలిసి దీపాలు వెలిగిస్తారు. ఆ తర్వాత ఇంటి కోడలు వెలిగించాలి అని చెప్పగానే శ్రీవల్లి కోసం నర్మద వెయిట్ చేస్తుంది.. అయితే వల్లి రావడం చూసి నర్మద చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చందు వల్లిని చూడకుండా ఉంటాడు మళ్ళీ లోపలికి రాగానే శుభమా అంటూ పూజ చేసుకుంటూ ఉంటే ఈ శ్రీవల్లిని ఎందుకు పిలిచావు అంటూ వేదవతి ఫైర్ అవుతుంది.. మీరు రామరాజు మాత్రం తన కోడలు కూడా ఉంటే బాగుంటుంది అని సంతోషంగా ఉంటాడు.. శ్రీవల్లి దీపం వెలిగిస్తూ ఉండగా చందు వచ్చి వల్లిని అడ్డుకుంటాడు. అంతేకాదు వల్లిని దారుణంగా అవమానిస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: నిజం దాచిన మీనా.. సుమతికి షాక్.. ప్రభావతికి ఝలక్..   

Related News

Gundeninda GudiGantalu Today episode: నిజం దాచిన మీనా.. సుమతికి షాక్.. ప్రభావతికి ఝలక్..   

Podarillu Today Episode : మహా ప్లాన్ సక్సెస్.. నారాయణ పేరుతో షాప్.. కన్నీళ్లు పెట్టుకున్న మాధవ్..

Telugu TV Serials: టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్..ఫ్యాన్స్ కు బిగ్ షాక్..

Brahmamudi Serial Today Episode November 13th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖ పెద్ద షాక్ ఇచ్చిన రాజు

Intinti Ramayanam Today Episode: భరత్, ప్రణతి కాపురంలో పల్లవి చిచ్చు.. రమ్యకు దిమ్మతిరిగే షాక్.. పల్లవికి వార్నింగ్..

Friday TV Movies : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Nindu Noorella Saavasam Serial Today Episode November 13th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌, మిస్సమ్మ షాపింగ్‌ మాల్‌లో పార్థును చూస్తారా..?   

Big Stories

Advertisement
×