BigTV English

kakinada GGH Rare Treatment: రోగికి “అదుర్స్” సినిమా చూపిస్తూ.. అరుదైన సర్జరీ చేసిన డాక్టర్లు

kakinada GGH Rare Treatment: రోగికి “అదుర్స్” సినిమా చూపిస్తూ.. అరుదైన సర్జరీ చేసిన డాక్టర్లు

kakinada GGH Doctors Perform surgery Even as Patient Watches Adhurs Movie: అక్కడ ఓ సర్జరీ నిర్వహిస్తున్నారు. అదేదో ఆషామాషి సర్జరీ కాదు. మెదడులో ఏర్పడ్డ ప్రమాదకమైన కణితిని తొలగించే ఆపరేషన్. మరి ఆస్పత్రిలో, ఆపరేషన్ థియేటర్లలో వాతావరణం ఎలా ఉంటుంది. డాక్టర్లు, నర్సులు ఉరుకులు పరుగులు, హడావిడి, స్పృహలో లేని రోగి.. సర్జరీ జరిగే సమయంలో పిన్ డ్రాప్ సైలెంట్.. ఎవ్వరు ఎవరితో ఏమి మాట్లాడుకుండా.. దృష్టి మొత్తం రోగిపైన.. సర్జరీపైన ఉంచి ఉత్కంఠ భరితంగా విధులు నిర్వహించే డాక్టర్లు, నర్సులు.. సర్జరీలో మొట్టమొదటిగా నిర్వహించే రోగికి అనస్తీషియా ఇవ్వడం. ఇక స్పృహకోల్పోయిన తర్వాత తన శరీరంపై ఏం జరుగుతుందో తెలయదు. కత్తెర ఏభాగాన్ని తొలగిస్తుందో.. ఏ భాగం తొలగిపోతుందో ఎక్కడ కుట్లు పడుతున్నాయో.. ఎంత రక్తం కారుతుందో ఇవేవి తెలియకుండానే వారికి ఆపరేషన్ జరిగిపోతుంది.


ఇప్పటిదాకా ఏ రకం సర్జరీ అయిన మనకు తెలిసింది ఇదే.. కానీ కాకినాడలోని సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్) నిర్వహించిన ఓ సర్జరీ గురించి తెలిస్తే ఎవరికైన ఆశ్చర్యం కలిగక మానదు. ఓ మహిళా రోగికి అనస్తీషియాతో పనిలేకుండా “అదుర్స్” సినిమా చూపిస్తూ మెదడులోని కణితిని తొలగించారు వైద్యులు. ముందుగా ఆ అభిమాని నటీ, నటుల గురించి తెలుసుకున్నారు వైద్యులు. ఆమె జూనియర్ ఎన్టీఆర్ మూవీ అదుర్స్ అంటే చాలా ఇష్టం అని తెలిపింది. దీంతో ఆ పేషెంట్‌కి అదుర్స్ సినిమాలోని బ్రహ్మానందం, ఎన్టీఆర్ కామెడీ సీన్ ఆమెకు చూపించారు. మూవీలో నిమగ్నమై ఉండగా ఆమె మెదడులో ఏర్పడిన కణితను డాక్టర్లు తొలగించారు. ఇక ఆమె మెలుకువ ఉండగానే సర్జరీ చేసిన డాక్టర్లు అందరి ప్రశంసలు అందుకున్నారు.

Also Read: ఏలూరులో హాస్టల్ వార్డెన్ దుర్మార్గం.. ఫోటో షూట్‌ల పేరుతో మైనర్ బాలికలపై లైంగిక వేధింపులు


కాకినాడా సర్వజన ఆస్పత్రి న్యూరో సర్జరీ డాక్టర్లు చెప్పిన వివరాల ప్రకారం.. తొడంగి మండలం కొత్తపల్లి అనే గ్రామానికి చెందిన అనంత లక్ష్మి (55) ఇనే మహిళ ఇటీవల తీవ్రమైన తలనొప్పి, మూర్ఛ, శరీరంలో కుడికాలు మొద్దుబారడంతో కాకినాడ జీజీహెచ్ ఆస్పత్రికి చేర్పించారు. దీంతో ఆమెకు మెదడులో కణిత ఏర్పడినట్లు గుర్తించారు. సర్జరీ సమయంలో ఆమెకు తక్కువ మోతాదులో మత్తు మందు ఇచ్చి మెలుకవగా ఉన్నప్పుడే.. కణితను తొలగించారు. “అదుర్స్” సినిమా చూస్తున్న ఆనందంలో ఆమెకు నొప్పి తెలియకుండా ఈ ప్రక్రియను నిర్వహించారు. ఆ తర్వాత ఆమె లేచి కూర్చుందని.. టిఫెన్ కూడా తిందని డాక్టర్లు తెలిపారు. మరో ఐదు రోజుల్లో ఆమెను డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు పేర్కొన్నారు.

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×