BigTV English

Pagers Blast: పేజర్స్.. పేలాయా? పేల్చారా? ఫోన్లను కూడా ఆ తరహాలో పేల్చేయవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

Pagers Blast: పేజర్స్.. పేలాయా? పేల్చారా? ఫోన్లను కూడా ఆ తరహాలో పేల్చేయవచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

Like Pagers Smartphones Can Explode| స్మార్ట్ ఫోన్ లేకుండా జీవనం ఊహించలేని ఈ ప్రపంచంలో కమ్యూనికేషన్ పరికరాలు పేలిపోవడం పెద్ద ప్రమాదంగా మారింది. ముఖ్యంగా సెప్టెబంర్ 18 తెల్లవారు ఝామున లెబనాన్ లో దేశవ్యాప్తంగా 2800 పేజర్ పరికరాలు పేలిపోయాయి. ఈ ఘటనలో 12 మంది చనిపోగా 2800 మందికి గాయాలయ్యాయి. ఇందులో 200 మంది తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం. ఇది ఇజ్రాయెల్ చేసిన దాడిగా లెబనాన్ లోని హెజ్బుల్లా గ్రూప్ ఆరోపణలు చేసింది. ఈ పేజర్ పేలుళ్లపై ఒకవైపు రాజకీయంగా దుమారం లేవగా.. మరోవైపు టెక్నికల్ దృష్ట్యా ఇటువంటి స్మార్ట్ ఫోన్ల ద్వారా కూడా సంభవించే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతుండడం ఆందోళన కలిగించే విషయం.


పేజర్లు ఎలా పనిచేస్తాయి? ఎలా పేలిపోయాయి?

ఫోన్ ఆకారంలో ఉండే పేజర్ పరికరాలు.. కేవలం మెసేజింగ్ కోసమే ఉపయోగిస్తారు. 1990వ దశకంలో ఈ పరికరాల వినియోగం ఎక్కువగా ఉండేది. కానీ మొబైల్ ఫోన్స్ వచ్చాక పేజర్ల ఉనికి తగ్గిపోయింది. అయినా మిలిటరీ కమ్యూనికేషన్ కోసం ఈ పరికరాలు ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. ఇంటర్నెట్, సెల్ ఫోన్ నెట్ వర్క్ ఆధారంగా ఇవి పనిచేయవు. కేవలం పాత రేడియో ఫ్రీక్వెన్సీ టెక్నాలజీ సహాయంగా ఇవి పనిచేస్తాయి. దీంతో వీటిని ట్రాక్ చేయడం లేదా హ్యాక్ చేయడం చాలా కష్టం.


అందుకే గాజా యుద్ధం మొదలైనప్పటి శత్రుదేశమైన ఇజ్రాయెల్ బారి నుంచి తప్పించుకోవడానికి లెబనాన్ సాయుధ పోరాట దళం హెజ్బుల్లా .. పేజర్ల ద్వారా కమ్యూనికేషన్ నడుపుతోంది. అందుకోసం మార్చి, ఏప్రిల్ నెలలో తైవాన్ కు చెందిన కంపెనీకి 5000 పేజర్లు ఆర్డర్ చేసింది. అయితే ఇజ్రాయెల్ ఈ పేజర్లలో బ్యాటరీ టాంపరింగ్ చేసిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే దేశ వ్యాప్తంగా ఒకేసారి 2800 పేజర్లు పేలడమంటే ఇది యాధృచ్ఛికంగా జరిగిన పేలుడు కాదు. ఎవరో కుట్ర పన్ని చేసిన పనే అని స్పష్టంగా తెలుస్తోంది.

Also Read:  లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 9 మంది మృతి.. 2800 మందికి గాయాలు

పేజర్లు పేల్చడం అంత సులువుగా జరిగే పని కాదు. ఎందుకంటే వీటిని రిమోట్ ద్వారా పేల్చడమంటే రేడియో సిగ్నల్స్ ద్వారా మెసేజ్ లు వచ్చినప్పుడు బ్యాటరీ ఓవర్ హీట్ అయ్యేలా చేయాలి. అందుకోసం ముందుగానే పేజర్ లోపల బ్యాటరీ పేలిపోయేందుకు ట్యాంపరింగ్ చేయాలి. లేదా బ్యాటరీలో చాలా సూక్ష్మంగా ఉండే పేలుడు పదార్థాలు అమర్చాలి. ఇదంతా ఆ పేజర్లు తైవాన్ నుంచి లెబనాన్ చేరేముందు .. రవాణా సమయంలో ఇజ్రాయెల్ చేసిఉంటుందనే కథనాలు అంతర్జాతీయ మీడియాలో దర్శనమిస్తున్నాయి.

బ్రిటిష్ సైన్యంలో బాంబు డిస్పోజల్ విభాగంలో పనిచేసిన ఒక నిపుణుడు ఈ అంశంపై మాట్లాడారు. ”ఒక పరికరం పేలిపోవాలంటే అందులో భాగాలు తప్పనిసరి. ఒక కంటెయినర్, బ్యాటరీ, పేలుడు ట్రిగ్గర్ చేసి డివైస్, డిటోనేటర్, ఎక్స్‌ప్లోజివ్ చార్జ్. వీటిలో ఒక పేజర్ లోపల మొదటి మూడు భాగాలు ముందుగానే ఉంటాయి. ఇక మిగిలింది డిటోనేటర్ , చార్జ్ మాత్రమే. ఈ రెండింటిని ఎవరైనా ట్యాంపరింగ్ చేసి అందులో అమర్చేస్తే.. పేలుడు చేయొచ్చు.” అని చెప్పారు.

పేజర్ పరికరాల్లో స్మార్ట్ ఫోన్ లాగా లిథియమ్ బ్యాటరీలు ఉపయోగిస్తారు. ఈ బ్యాటరీలు ఓవర్ హీట్ కావడం, పేలిపోయే ఘటనలు తరుచూ జరుగుతూనే ఉంటాయి. 2016లో ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ శామ్ సంగ్ తన గెలాక్సీ నోట్ 7 మోడల్ ఫోన్స్ లో బ్యాటరీ సమస్య కారణంగా వెనక్కు తీసుకుంది. అలాగే ఒక అమెరికన్ కంపెనీ తన హోవర్ బోర్డ్స్ లో లిథియమ్ బ్యాటీరీలో పేలీపోయే ప్రమాదముందని తెలిసి మార్కెట్ లో ఉన్న 5 లక్షల హోవర్ బోర్డ్స్ ని వెనక్కు తసుకుంది.

స్మార్ట్ ఫోన్లు కూడా పేలుతాయ్..

ఇప్పుడున్న అన్ని స్మార్ట్ ఫోన్లలో లిథియమ్ బ్యాటరీలే ఉపయోగిస్తుండడంతో అవి కూడా పేలిపోయే ప్రమాదముంది. అందుకు నిపుణులు కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

– కంపెనీ ఒరిజినల్ చార్జర్లు మాత్రమే ఉపయోగించాలి.
– ఎక్కువ వేడి లేదా చల్లదనం ఉండే ప్రదేశంలో ఫోన్ పెట్టకూడదు.
– బ్యాటరీ సరిగా పనిచేయకపోయినా లేదా బ్యాటరీ సంబంధించి ఇతర సమస్య వచ్చినా వెంటనే ఒరిజినల్ బ్యాటరీ కొని మార్చుకోవాలి.

Related News

GPT 5 vs GPT 4: AI ప్రపంచంలో నెక్ట్ లెవెల్… ఇక ఉద్యోగాలు గోవిందా ?

Redmi Note 14 SE vs Tecno Pova 7 Pro vs Galaxy M36: ఒకే రేంజ్‌లో మూడు కొత్త ఫోన్లు.. ఏది బెస్ట్ తెలుసా?

Trump Tariff Iphone17: భారత్‌పై ట్రంప్ టారిఫ్ బాంబ్.. విపరీతంగా పెరగనున్న ఐఫోన్ 17 ధరలు?

Caviar iphone: అత్యంత ఖరీదైన ఐఫోన్.. రూ.42 లక్షలు ధర.. కొనుగోలు చేయడం అసాధ్యమే?

Infinix GT 30 5G+: రూ.20000 కంటే తక్కువ ధరలో అద్భుత గేమింగ్ ఫోన్.. ఇన్ఫినిక్స్ GT 30 5G+ లాంచ్

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Big Stories

×