BigTV English

Eluru Girls Hostel Incident: ఏలూరులో హాస్టల్ వార్డెన్ దుర్మార్గం.. ఫోటో షూట్‌ల పేరుతో మైనర్ బాలికలపై లైంగిక వేధింపులు

Eluru Girls Hostel Incident: ఏలూరులో హాస్టల్ వార్డెన్ దుర్మార్గం.. ఫోటో షూట్‌ల పేరుతో మైనర్ బాలికలపై లైంగిక వేధింపులు

Hostel Warden in Eluru Misbehaves Physical Harassment of Girls: ఏలూరు జిల్లాలోని యర్రగుంటపల్లిలో.. మైనర్ బాలికలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ.. బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఉద్యోగి శశి కుమార్ పై ఫిర్యాదు చేశారు. ఈ ఘటనలో పలు షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తమను కూడా లైంగికంగా వేధించాడని.. ఓ ప్రైవేట్ హాస్టల్ లోని 28 మంది మైనర్ బాలికలు అధికారులకు వాగ్మూలం ఇవ్వడం కలకలం రేపుతోంది.


బీసీ వెల్ఫేర్ హాస్టల్ ఉద్యోగిగా పనిచేస్తున్న శశి కుమార్.. ప్రైవేట్ గా శ్రీ స్వామి దయానంద సరస్వతి సేవాశ్రమం పేరుతో ఏలూరులో గర్ల్స్ హాస్టల్ నిర్వహిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేని ఆ హాస్టల్ కు తన భార్య మణిశ్రీని వార్డెన్ గా పెట్టి కార్యకలాపాలు సాగిస్తున్నారు. అయితే 2023 ఫిబ్రవరి నెలలో ప్రారంభమైన ఈ హాస్టల్ లో ప్రస్తుతం ప్రైమరీ స్కూల్ నుంచి డిగ్రీ వరకు చదువుతున్న 45 మంది విద్యార్ధినిలు ఉన్నారు. ప్రైవేట్ గా ఫోటో స్టూడియో నిర్వహిస్తూ, ఫోటో షూట్స్, కోచింగ్ వంటి మాయ మాటలతో విద్యార్థినులపై లైంగిక దాడికి శశి కుమార్ పాల్పడుతున్నాడంటూ ఓ బాలిక పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

Also Read: 5 ఏళ్ల పాప ప్రైవేట్ భాగాలు, నోటిపై వాతలు పెట్టిన మహిళ.. ఆ పాప ఏం చేసిందంటే?..


బాలికల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు ప్రైవేట్ హాస్టల్ కు వెళ్లి విచారించగా విస్తుబోయే నిజాలు బయటపడ్డాయి. తమనూ లైంగికంగా వేధించారని హాస్టల్ లోని 28 మంది బాలికలు ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ గదిలో రాత్రిళ్లు వచ్చి బలవంతం చేసేవాడని వాపోతున్నారు. ఈఘటనపై విచారణ జరిపిన పోలీసులు జిల్లా కలెక్టర్‌కు నివేదిక ఇచ్చి, తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Related News

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Big Stories

×