BigTV English

Kesineni swetha : టీడీపీకి బిగ్ షాక్.. పార్టీకి, కార్పొరేటర్ పదవికి కేశినేని శ్వేత రాజీనామా..

kesineni swetha : టీడీపీకి విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత రాజీనామా చేశారు. తన కార్పొరేటర్ పదవికి, టీడీపీకి ఆమె తాజాగా గుడ్‌బై చెప్పారు. విజయవాడ మేయర్‌ భాగ్యలక్ష్మికి తన రాజీనామా లేఖను శ్వేత అందించారు. ఈ సందర్భంగా తన కార్పొరేటర్‌ సభ్యత్వం రాజీనామా లేఖను కౌన్సిల్లో పెట్టి ఆమోదించాలని మేయర్‌ను శ్వేత కోరారు. అంతకుముందు కేశినేని శ్వేత, టీడీపీకి రాజీనామా చేయబోతున్నట్టు ఎంపీ కేశినేని నాని ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. కాగా వీరి రాజీనామాలతో టీడీపీకి బిగ్ షాక్‌ తగిలినట్టు అయ్యింది. రాజీనామాల నేపథ్యంలో విజయవాడలో రాజకీయం రసవత్తరంగా మారింది.

Kesineni swetha : టీడీపీకి బిగ్ షాక్.. పార్టీకి, కార్పొరేటర్ పదవికి కేశినేని శ్వేత రాజీనామా..

Kesineni swetha : టీడీపీకి విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత రాజీనామా చేశారు. తన కార్పొరేటర్ పదవికి, టీడీపీకి ఆమె తాజాగా గుడ్‌బై చెప్పారు. విజయవాడ మేయర్‌ భాగ్యలక్ష్మికి తన రాజీనామా లేఖను అందించారు. తన రాజీనామా లేఖను కౌన్సిల్ లో పెట్టి ఆమోదించాలని మేయర్‌ను కోరారు.


అంతకుముందు కేశినేని శ్వేత టీడీపీకి రాజీనామా చేయబోతున్నట్టు ఎంపీ కేశినేని నాని ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. తండ్రీకుమార్తె రాజీనామాలతో టీడీపీకి బిగ్ షాక్‌ తగిలినట్టు అయ్యింది. రాజీనామాల నేపథ్యంలో విజయవాడలో రాజకీయం రసవత్తరంగా మారింది.

పార్టీ అధినేత తనను వద్దనుకుంటున్నారంటూ ఇప్పటికే జెండాలు పీకేసిన కేశినేని నాని. ఇప్పుడు తన కూతురితో టీడీపీకి రాజీనామా చేయించడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 11వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా కేశినేని శ్వేత ప్రాతినిథ్యం వహిస్తున్నారు. రాజీనామా చేయడానికి ముందు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, ఆయన భార్య, మాజీ జడ్పీ ఛైర్‌పర్సన్ అనురాధతోనూ శ్వేత భేటీ అయ్యారు. తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులను వాళ్లకు వివరించారు.


మరోవైపు తిరువూరు సభకు అందిన ఆహ్వానాన్ని ఎంపీ కేశినేని నాని తిరస్కరించారు. తిరువూరు సభలో తనకు ప్రత్యేక సీటు కేటాయించడంపై స్పందించారు. తాను పార్టీనే వద్దనుకున్న తర్వాత ఇక ప్రోటోకాల్ ఏంటని వ్యాఖ్యానించారు. అయితే నాని ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తారా లేక వేరే పార్టీలో చేరతారా అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. సంక్రాంతి తర్వాత తన రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Tags

Related News

GST Relief To Farmers: జీఎస్టీ తగ్గింపుతో రైతులకు భారీ ఊరట.. వేటి ధరలు తగ్గనున్నాయంటే?

AP Weather: అక్టోబర్ 1 నాటికి మరో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. ప్రాజెక్టుల్లో వరద ప్రవాహాలు

Gudivada Amarnath: కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట: గుడివాడ అమర్నాథ్

AP Fee Reimbursement: పండుగ వేళ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు రీయింబర్స్మెంట్ రూ.394 కోట్లు విడుదల

Vijayawada Traffic Diversions: మూల నక్షత్రంలో సరస్వతిదేవిగా దుర్గమ్మ దర్శనం.. రేపు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

CM Chandrababu Meets Pawan: డిప్యూటీ సీఎం నివాసానికి సీఎం చంద్రబాబు.. ఉత్కంఠగా మారిన భేటీ?

Tirumala: గుడ్ న్యూస్.. తిరుమల శ్రీవారి భక్తులకు మరో కానుక

Drone At Srisailam: శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం.. అదుపులో ఇద్దరు యువకులు

Big Stories

×