Nagababu Comments: ఏపీ తిరుమల లడ్డు వివాదంపై తాజాగా జనసేన జాతీయ కార్యదర్శి నాగబాబు తాజాగా స్పందించారు. లడ్డు వివాదం సమయం నుండి సైలెంట్ గా ఉన్న నాగబాబు.. తాజాగా స్పందిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే లడ్డులో ఉపయోగించిన కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. సిట్ అధికారులు సైతం విచారణ పర్వాన్ని వేగవంతంగా సాగిస్తున్నారు. ఈ దశలో ఆల్ పార్టీల మధ్య కల్తీ నెయ్యి కాక రాజేసిందని చెప్పవచ్చు. అందుకే ఇటీవల టీడీపీ, జనసేన, బీజేపీలు మూకుమ్మడిగా వైసీపీ ప్రభుత్వ హయాంలోనే నెయ్యి కల్తీ జరిగిందంటూ.. విమర్శలు గుప్పించాయి. నిన్నటి వరకు ఈ వివాదంపై మాట్లాడని నాగబాబు ఒక్కసారిగా తన విమర్శల జోరు పెంచారు.
నాగబాబు మాట్లాడుతూ.. హింధూ ధర్మం దెబ్బతినిందని చెప్పడానికి లడ్డూ అంశం క్లైమాక్స్ లాంటిందన్నారు. దేశంలో ఒక మతాన్ని మరో మతం గౌరవిస్తూ బతుకుతుందని, సనాతన ధర్మం అందరూ కలిసి బ్రతకడం నేర్పించిందని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ ఇటీవల కల్తీ లడ్డు వ్యవహారంపై మాట్లాడుతూ ఘాటుగా వ్యాఖ్యానించడంపై నాగబాబు మాట్లాడుతూ.. సనాతన ధర్మానికి అన్యాయం జరుగుతుందనే పవన్ అలా స్పందించారన్నారు. హిందు దేవాలయాలు, ధార్మిక మండళ్లు హిందువులే చేయాలన్న పవన్ వ్యాఖ్యలను తాను పూర్తిగా సమర్థిస్తున్నానన్నారు. అన్ని మతాలతో సఖ్యంగా ఉండే నైజం పవన్ సొంతమని, వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలకు సమాధానాలు అవసరం లేదన్నారు.
Also Read: Tirumala: దసరాకు తిరుమల వెళ్తున్నారా.. దర్శనం టికెట్ లేకున్నా.. ఇలా చేస్తే శ్రీవారిని దర్శించవచ్చు
అలాగే ఇటీవల ప్రకాష్ రాజ్ లడ్డు వివాదంపై మాట్లాడిన మాటలపై నాగబాబు స్పందిస్తూ.. సూడో సెక్యులర్లుగా ప్రకాశ్ రాజ్ , జగన్మోహన్ రెడ్డిలను పోల్చారు. హిందూ ధర్మక రక్షణ మండలి అవసరం ఉందని, అందుకు తగ్గ చర్యలు తీసుకోవడంలో హిందువులు ఏకం కావాలన్నారు. హిందువులే హిందూ మతాన్ని అగౌరవ పరుస్తున్నారని, హిందూ మతం పరిరక్షణకు అందరూ కలిసి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే కల్తీ నెయ్యి వ్యవహారంపై చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. దోషులు ఎవరైనా సిట్ విచారణలో బయటకు వస్తారని, వారిని ఆ కలియుగ వైకుంఠం శ్రీ శ్రీనివాసుడే చూసుకుంటారన్నారు.
ప్రభుత్వాల నిర్ణయాలు కోట్లాది మంది హిందువులపై ప్రభావం చూపుతున్నాయన్నదే పవన్ బాధగా తెలిపిన నాగబాబు.. ఎట్టి పరిస్థితుల్లో దేవాలయాల పరిరక్షణపై హిందువులు దృష్టి సారించాలన్నారు. ఇలా లడ్డు వ్యవహారంపై నాగబాబు స్పందించగా.. ఎక్కువగా హిందూ ధర్మ పరిరక్షణపైనే వ్యాఖ్యానించడం విశేషం. అలాగే ఇటీవల పవన్ సనాతన ధర్మంకు మద్దతుగా మాట్లాడిన తీరుకు తాను సైతం మద్దతు తెలుపుతున్నట్లు.. అలాగే అన్ని మతాలను గౌరవించడం కూడా సనాతన ధర్మం నేర్పించిందని నాగబాబు అన్నారు.