Cyclone Montha Impact: మొంథా తుఫాను జిల్లాలపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఫోకస్ చేశారు. తుపాను ప్రభావంపై తన కార్యాలయ అధికారుల ద్వారా క్షేత్ర స్థాయి నుంచి సమాచారం సేకరించారు. ముఖ్యంగా కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్ల నుంచి క్షేత్ర స్థాయి సమాచారం తీసుకొన్నారు.
తుఫాను జిల్లాలపై జిల్లాలపై డిప్యూటీ సీఎం పవన్ ఫోకస్
తుఫాను తీరం దాటిన క్రమంలో బలమైన ఈదురు గాలులు, వర్షాల వల్ల కలిగిన నష్టంపై వివరాలు సేకరించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో చెట్లు విరిగిపడటం, విద్యుత్ తీగలు పడటం, స్తంభాలు నేలకొరిగిన క్రమంలో వాటి పునరుద్ధరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని అధికారులను దిశానిర్దేశం చేశారు. తుపాను బలహీనపడినా, భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలను సురక్షిత ప్రదేశాల్లోనే ఉంచాలని ఆదేశించారు.
పునరావాస కేంద్రాల్లో ఉన్నవారిని బుధవారం వరకు అక్కడే ఉంచాలన్నారు. ఆహార-వసతి కల్పించాలని స్పష్టం చేశారు. గాలులు తీవ్రంగా ఉండటంతో ప్రజలను ఇప్పటికిప్పుడు ఇళ్లకు పంపించడం శ్రేయస్కరం కాదన్నారు. తుఫానుపై ప్రజలకు పూర్తి పరిస్థితిని వివరించాలని అధికారులకు సూచన చేశారు.
విద్యుత్ సరఫరా నునరుద్దరించాలని ఆదేశం
ప్రకాశం జిల్లాలో గుండ్లకమ్మ, నెల్లూరు జిల్లాలో పెన్నానది పొంగి ప్రవహిస్తున్న క్రమంలో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాలు తగ్గు ముఖం పట్టిన తరవాత పారిశుధ్య కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని, తాగు నీరు సరఫరా చేయాలని సూచించారు. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అందలేదని వార్తల నేపథ్యంలో విద్యుత్ అధికారులతో మాట్లాడారు.
తుఫాన్ ప్రభావం నేపథ్యంలో నిడదవోలు నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలు, పునరావాస కేంద్రాలను సందర్శించారు మంత్రి కందుల దుర్గేష్. వసతి సౌైకర్యాలపై బాధితులతో మాట్లాడారు. తాత్కాలిక నివాసాల్లో ఉన్న ప్రజలకు ఆహారం, త్రాగునీరు, వైద్య సేవలు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ALSO READ: ఏపీలో మొంథా బీభత్సం.. కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
అటు కర్నూలు జిల్లాలో పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. వర్షం ధాటికి అర్థరాత్రి లింగాలగట్టులో రెండు ఇళ్లు కూలాయి.అలాగే శ్రీశైలం ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. హైదరాబాద్ ణుంచి శ్రీశైలం వైపు వెళ్లే బస్సుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దోర్నాల-శ్రీశైలం, దోర్నాల-ఆత్మకూరు, నల్లమల్ల రహదారుల్లో వాగులు పొంగి ప్రవహించాయి.