BigTV English

Sri Krishnadevaraya : వైసీపీలో అసంతృప్తితో ఎంపీ లావు కృష్ణదేవరాయ.. జగన్

Sri Krishnadevaraya : వైసీపీలో చోటు చేసుకుంటున్న మార్పులు చేర్పులు ఆ పార్టీలో ఎవరికీ అంతపట్టడం లేదు. ఎన్నికల ముందు అభ్యర్ధిత్వాల మార్పులతో పార్టీ కీలక నేతలకు అధినేత జగన్ షాక్‌లు ఇస్తున్నారు. ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీకి దింపుతున్నారు. వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు టికెట్ లేదని చెప్పేస్తున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా పోటీ చేయాలని సూచిస్తున్నారు. ఆ నిర్ణయాలు మింగుడుపడని పలువురు నాయకులు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇప్పటికే కొందరు వైసీపీకి గుడ్‌బై చెప్పేసి తమదారి తాము చూసుకుంటున్నారు. ఆ క్రమంలో నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయని కూడా నియోజకవర్గం మారమనడం చర్చనీయాంశంగా మారింది.

పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీగా లావు కృష్ణదేవరాయ సౌమ్యుడిగా పేరు ఉన్న ఆయనకు లోకల్‌గా మంచి పేరు ఉంది. పల్నాడు నేతలతో మంచి సంబంధాలే ఉన్నాయి. రెండోసారి కచ్చితంగా నరసరావుపేట నుంచి పోటీ చేస్తానని భావిస్తున్న కృష్ణదేవరాయకు జగన్ షాక్ ఇచ్చారు. నరసరావు పేట ఎంపీగా టికెట్ ఇవ్వడం లేదని తేల్చి చెప్పేశారు. అక్కడ బీసీ నేతకు టికెట్ ఇవ్వాలని భావిస్తున్నామంటూ..కృష్ణదేవరాయను గుంటూరు ఎంపీగా పోటీ చేయమన్నారంట. దానికి జగన్ ముఖం మీదే కుదరదని చెప్పేశారంట నరసరావుపేట ఎంపీ.

గుంటూరుకు మారే ప్రసక్తే లేదని నరసరావుపేటలోనే కొనసాగుతానని లావు కృష్ణదేవరాయ స్పష్టం చేసినట్లు తెలిసింది. మారాల్సిందేనని సీఎం అనడంతో గుంటూరు లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలోని రాజధాని అమరావతి ప్రస్తావన తెచ్చి అక్కడకు వెళ్లి ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించారంట. గుంటూరు వెళ్లే ప్రసక్తే లేదని అవసరమైతే పోటీ నుంచి తప్పుకుంటానని జగన్ ముందు కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారంట.

అది అలా ఉంటే నరసరావుపేట ఎంపీ స్థానంపై వైసీపీలో చాలా కాలంగా మంతనాలు జరుగుతున్నాయంటున్నారు. అసలు కృష్ణదేవరాయకు మొదటి నుంచి జగన్‌తో పడటం లేదన్న ప్రచారం ఉంది కొంత కాలం ముందు ఓ ప్రోగ్రామ్‌లో జగన్‌ చెప్పినా వినకుండా విసురుగా బయటకు వచ్చేశారు నరసరావుపేట ఎంపీ. తర్వాత పార్టీ నేతలు ఆయనతో మాట్లాడి సర్ధి చెప్పి వేదికపైకి తీసుకెళ్లాల్సి వచ్చింది. పలు సందర్భాల్లో కూడా ఆయనకు పార్టీకి చాలా గ్యాప్ ఏర్పడిందన్న ప్రచారం ఉంది.

కృష్ణదేవరాయ ఏక్షణమైనా పార్టీ మారవచ్చన్న వార్తలు గతంలో గుప్పుమన్నాయి. అయితే ఆయనెప్పుడూ ఆ విషయంపై స్పందించలేదు. ఎప్పుడూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడింది లేదు. పార్టీతో గ్యాప్ ఉన్న విషయాన్ని మాత్రం తన వారి వద్ద చెప్పేవారట. ఆ క్రమంలో ఎన్నికల టైంలో టికెట్ విషయంపై అధినేతతో పలుమార్లు భేటీ అయ్యారు. అయితే ఆయనకు నరసరావుపేట టికెట్ ఇవ్వకూడదని జగన్ అప్పటికే ఫిక్స్ అయిపోయారట.

చివరికి తాజాగా సీఎంఓలో దానిపై చర్చలు నడిచాయి. ఇందులో నరసరావుపేట ఎంపీ స్థానం పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు, కృష్ణదేవరాయ పాల్గొన్నారు. చివరకు నరసరావుపేటలో కృష్ణదేవరాయకు టికెట్ ఇవ్వడం లేదని జగన్ తేల్చి చెప్పినట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. నరసరావుపేటలో కృష్ణదేవరాయకు టికెట్ ఇవ్వకపోవడం. పలువురు ఎమ్మెల్యేలకు కూడా నచ్చడం లేదని తెలుస్తోంది. నరసరావుపేట కాకపోతే పోటీ నుంచే తప్పుకుంటానంటున్న లావు కృష్ణదేవరాయ భవిష్యత్తు నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.

Tags

Related News

Free Bus: ఉచిత బస్సు.. వైసీపీ విమర్శలను జనం నమ్మేస్తారా?

Tollywood Producers: ఏపీకి చేరిన సినిమా పంచాయితీ.. మంత్రి దుర్గేష్ తో ఫిలిం చాంబర్ నేతల సమావేశం

Anantapur News: ఏపీలో షాకింగ్ ఘటన.. బస్సు ఆపలేదని మహిళ ఆగ్రహం.. డ్రైవర్ చెంప పగలకొట్టింది

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Big Stories

×