BigTV English

TDP JanaSena Seat Sharing | చివరి దశలో టిడిపి జనసేన సీట్ల సర్దుబాటు.. సమన్వయంగా రెండు పార్టీల క్యాడర్

TDP JanaSena Seat Sharing | తెలుగుదేశం, జనసేన సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చిందంటున్నారు. ఇప్పటికే మెజార్టీ స్థానాలపై అవగాహన కుదిరందని. మరికొన్ని నియోజకవర్గాలపై మాత్రం చర్చలు జరుగుతున్నాయంట. సంక్రాంతి తర్వాత ఏ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందో అధికారికంగా వెల్లడిస్తారని చెప్తున్నారు.

TDP JanaSena Seat Sharing | చివరి దశలో టిడిపి జనసేన సీట్ల సర్దుబాటు.. సమన్వయంగా రెండు పార్టీల క్యాడర్

TDP JanaSena Seat Sharing | తెలుగుదేశం, జనసేన సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చిందంటున్నారు. ఇప్పటికే మెజార్టీ స్థానాలపై అవగాహన కుదిరందని. మరికొన్ని నియోజకవర్గాలపై మాత్రం చర్చలు జరుగుతున్నాయంట. సంక్రాంతి తర్వాత ఏ పార్టీ ఎక్కడ పోటీ చేస్తుందో అధికారికంగా వెల్లడిస్తారని చెప్తున్నారు. ఇప్పటికే రెండు పార్టీల కేడర్ గ్రౌండ్ లెవల్ నుంచి కలిసి పనిచేసేలా నాయకులు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఏ కార్యక్రమం నిర్వహించినా 2 పార్టీల కార్యకర్తలు, నాయకులు కలిసి పొల్గొంటున్నారు. ఆ క్రమంలో శాసనసభ సీట్ల సర్దుబాటును దృష్టిలో పెట్టుకుని లోక్‌సభ సెగ్మెంట్ల పంపకంపై కూడా సర్దుబాటు దాదాపు పూర్తైందంట.


ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం, జనసేనల పొత్తు ఎప్పుడో ఖరారైంది. ఇక ఇప్పుడు సీట్ల సర్దుబాటు కూడా చివరి దశకు వచ్చిందంట. పొత్తులో భాగంగా జనసేనకు 25 అసెంబ్లీ స్థానాలు 4 పార్లమెంటు స్థానాలు ఇవ్వాలని టీడీపీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసేన నేతలు కొందరు 35 అసెంబ్లీ స్థానాలు 10 పార్లమెంటు స్థానాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నప్పటికీ. టీడీపీ ఇస్తానంటున్న సంఖ్యకే పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తోందంటున్నారు.

ఆ లెక్కల సంఖ్య ఎలా ఉన్నా రాష్ట్రంలో జనసేన ఎక్కడెక్కడ పోటీచేయాలనే విషయంలో మెజారిటీ సీట్లకు సంబంధించి రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరిందంటున్నారు. కొద్ది స్థానాలపైనే చర్చలు కొనసాగుతున్నాయట. సంక్రాంతి తర్వాత అధికారికంగా ప్రకటించేందుకు రెండు పార్టీలు సమాయత్తం అవుతున్నాయంట, సంక్రాంతి కన్నా ముందే సీట్ల విషయం ప్రకటించాలని తొలుత భావించారు. అయితే పంపకాల లెక్కలు పూర్తి కాకపోవడంతో పండుగ తర్వాతకు పోస్ట్‌పోన్ అయిందంట.


ఏయే జిల్లాల్లో జనసేన ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది దాదాపుగా తేలిపోయిందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. అది అలా ఉంటే గ్రామస్థాయి నుంచి రెండు పార్టీల క్యాడర్‌ కలిసి పనిచేసేలా సమన్వయ చర్యలు చేపడుతున్నారు నాయకులు. ఏ కార్యక్రమం నిర్వహించినా రెండు పార్టీల కార్యకర్తలు, నాయకులు కలిసి పాల్గొంటున్నాయి. ఇప్పుడు సీట్ల సర్దుబాట ఒక కొలిక్కి వస్తుండటంతో. పండగ తర్వాత తెలుగుదేశం అభ్యర్ధుల తొలి జాబితా ప్రకటించానికి రెడీ అయిందంట.

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ఒకవైపు టీడీపీతో చర్చిస్తూనే మరోవైపు పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులతోనూ సమావేశమవుతున్నారు. జనసేన ఎక్కడెక్కడ పోటీ చేసేందుకు అవకాశం ఉంది? అక్కడ పార్టీ బలం ఏమిటి? టీడీపీ శ్రేణులతో సమన్వయం ఎలా ఉంది? అభ్యర్థుల అంగ, అర్థబలం తదితర అంశాలను జనసేనాని తెలుసుకుంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన కొందరు నియోజకవర్గ ఇన్‌చార్జులతో పవన్‌ చర్చించారు. కాకినాడ లోక్‌సభ నియోజకవర్గంలో వరుసగా మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహిస్తున్నారు.

కాకినాడలో లోక్‌సభ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులతో దాదాపు అయిదు గంటల పాటు పవన్ సమావేశమయ్యారు. అందరితో విడివిడిగా మాట్లాడారు. తనవద్ద ఉన్న నివేదికను ఆధారంగా చేసుకుని కొన్ని అంశాలపై వారిని ప్రశ్నిస్తూ వివరాలు తెలుసుకుంటున్నారంట. ఆ నియోజకవర్గంలోని క్యాడర్‌, కమిటీల ఏర్పాటు, స్థానిక సమస్యలు, పార్టీ బలాబలాలు, లోపాలు ప్రత్యర్థి పార్టీ పరిస్థితి తదితర అంశాలన్నీ ఆ చర్చల్లో వస్తున్నాయంట.

త్వరలో పవన్‌కల్యాణ్‌ రాజమహేంద్రవరం, భీమవరం నగరాల్లో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో ఒక లోక్‌సభ స్థానంలో కచ్చితంగా జనసేన పోటీచేసే ఆస్కారం ఉండటంతో లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులందరితో పవన్‌కల్యాణ్‌ కూలంకషంగా చర్చిస్తున్నారు. శాసనసభ సీట్ల సర్దుబాటును దృష్టిలో పెట్టుకునే కాకుండా ఏ లోక్‌సభ స్థానంలో గెలిచే అవకాశం ఉందనే కోణంలోనూ జనసేనాని వివరాలు సేకరిస్తున్నారంటున్నారు.

Related News

AP Legislative Council: ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యుల నిరసన

AP Assembly: వాడెవడు.. వీడెవడు.. భగ్గుమన్న పాత పగలు.. చిరు VS బాలయ్య

Prakasam: రూ. 20 లక్షల కరెన్సీ నోట్లతో వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు

Chandrababu: చంద్రబాబు ముందు చూపు.. ఎమ్మెల్యేలపై ఆగ్రహం అందుకేనా?

Tirumala Brahmotsavam 2025: తిరుమల బ్రహ్మోత్సవాలు.. ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు..

AP Rain Alert: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏ ఏ జిల్లాలకు ఎక్కువ ఎఫెక్ట్ అంటే?

Kakinada: స్వదేశానికి కాకినాడ మత్స్యకారులు.. ఎంపీ సానా సతీష్ బాబు ప్రయత్నాలు సఫలం

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

Big Stories

×