BigTV English

Leopard In Tirumala: శ్రీవారి మెట్టు వద్ద చిరుత సంచారం.. టీటీడీ అధికారులు ఏమన్నారంటే..?

Leopard In Tirumala: శ్రీవారి మెట్టు వద్ద చిరుత సంచారం.. టీటీడీ అధికారులు ఏమన్నారంటే..?

తిరుమల దారిలో చిరుత సంచారం. ఎవరూ కొట్టిపారేయలేని స్టేట్ మెంట్ ఇది. ఎందుకంటే ఇటీవల కాలంలో తిరుమల దారిలో చిరుతలు కనపడటం సాధారణంగా మారింది. కనపడిన చిరుతను కనపడినట్టు అధికారులు బోనులో బంధించి జూలో సంరక్షణ కోసం తరలిస్తున్నారు. కొన్నిటిని తిరిగి అడవిలో విడిచిపెట్టారు. ఇటీవల ఘాట్ రోడ్ లో గోడపైనుంచి పరిగెడుతున్న చిరుతను ఓ వ్యక్తి కారులో వెళ్తూ వీడియో తీశాడు. ఆ వీడియో వైరల్ గా మారింది. అయితే ఈరోజు శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత కనపడిందంటూ ఓ వార్త వైరల్ అయింది. అయితే అది ఫేక్ న్యూస్ అని టీటీడీ అధికారులు కొట్టిపారేశారు. తిరుమలలో ఆదివారం చిరుత ఎవరికీ కనపడలేదని, అది తప్పుడు వార్త అని, భక్తుల్ని తప్పుదోవ పట్టించడానికే ఆ వార్తను వైరల్ చేస్తున్నారని అన్నారు.


తిరుమలలో శ్రీవారి మెట్ల మార్గంలో చిరుత ఓ చిన్నారిని చంపిన తర్వాత ఇలాంటి వార్తలు ఆందోళన కలిగించాయి. చిరుత దాడులపై ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. గత ప్రభుత్వంలో టీటీడీ.. భక్తులకు చేతి కర్రలు అందించి నవ్వులపాలైన విషయం కూడా తెలిసిందే. అయితే చిరుతల సంచారం మాత్రం ఆగలేదు. ఇటీవల కూడా చిరుతలు సంచరించిన ఉదాహరణలు ఉన్నాయి. అయితే వీటికి వీడియో సాక్ష్యాలు కూడా ఉన్నాయి. కానీ ఆదివారం చిరుత సంచారం అంటూ వచ్చిన వార్తలు మాత్రం కేవలం కల్పితం అంటున్నారు అటవీ శాఖ ఎఫ్ఆర్‌వో దొరైస్వామి. శ్రీవారి మెట్టు ప్రాంతంలో చిరుత సంచరించినట్లు జరిగిన ప్రచారం అంతా ఫేక్ అని తేల్చేరు. ఆ మార్గంలో చిరుత రాలేదని స్పష్టం చేశారు. భక్తులు యథావిధిగా దర్శనాలకు వెళ్తున్నట్లు తెలిపారు.

శనివారం సాయంత్రం మాత్రం శిలాతోరణం వద్ద చిరుత కనిపించిందని, ఆ తరువాత అది అడవిలోకి వెళ్లిందని అధికారులు పేర్కొన్నారు. చిరుత సమాచారం తెలియగానే సహజంగానే భక్తులు ఆందోళన చెందుతారు. ముఖ్యంగా నడక మార్గంలో వెళ్లే భక్తులు లేనిపోని భయాందోళనలకు గురై ఇబ్బంది పడతారు. అందుకే టీటీడీ ఇలాంటి వార్తలపై అప్రమత్తంగా ఉంటోంది. చిరుత సంచారం నిజమైతే అధికారులు వెళ్లి దాన్ని పట్టుకోడానికి బోన్లు ఏర్పాటు చేస్తారు. కానీ ఇలా ఫేక్ వార్తలు ప్రచారం కావడం ఆశ్చర్యకరంగా ఉంది. శ్రీవారి మెట్టు వద్ద చిరుత అనగానే.. ఆ మార్గం ద్వారా కొండపైకి వెళ్లే భక్తుల్లో ఆందోళన మొదలైంది. చిరుత ఎక్కడ ఉంది, ఎప్పుడు కనపడింది అంటూ చాలామంది ఆరా తీయడం మొదలు పెట్టారు.


ఇటీవల తిరుమల క్యూలైన్లలో కూడా ఉద్దేశపూర్వకంగానే కొందరు టీటీడీని, చైర్మన్ ని నిందించారు. క్యూలైన్లలో సౌకర్యాలు బాగానే ఉన్నా కూడా వారు కావాలనే అలాంటి ఆరోపణలు చేశారని తర్వాత తేలింది. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయడానికే ఇలా చేస్తున్నారంటూ కూటమి ప్రభుత్వం వైసీపీపై మండిపడింది. ఈ ఘటన తర్వాత శ్రీవారి మెట్టు వద్ద చిరుత అనే ఫేక్ న్యూస్ కూడా సర్కులేట్ కావడం విశేషం. ఇలాంటి ఫేక్ వార్తలతో భక్తులను ఇబ్బంది పెట్టొద్దని టీటీడీ పేర్కొంది.

Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×