BigTV English

Psg-Rcb: PSG చారిత్రక విజయం… అంటే ఈసారి RCB దేనా టైటిల్

Psg-Rcb: PSG చారిత్రక విజయం… అంటే ఈసారి RCB దేనా టైటిల్

Psg-Rcb:  UEFA ఛాంపియన్స్ లీగ్ 2024-25 పారిస్ సెయింట్ జెర్మైన్ చరిత్ర సృష్టించింది. 5-0 గోల్స్ తేడా తో ఇంటర్ మిలన్ పై ఘన విజయం సాధించింది. ఈ లీగ్ చరిత్రలో ఇదే హయ్యెస్ట్ మార్జిన్ విక్టరీ. పీఎస్జీ కి ఇదే తొలి ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీ కూాడా కావడం విశేషం.  వీళ్లు కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరహాలోనే చాలా సంవత్సరాలు తరువాత టైటిల్ గెలిచారు. తాజాగా వీళ్లు గెలవడంతో ఈ సారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా గెలుస్తుందని ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఈ రెండు జట్ల జెర్సీలకు ఫైన ఒకరే బ్రాండ్ అంబాసిడర్ క్వాటర్ ఎయిర్ వేస్.. కాబట్టి కప్పు గెలిచే అవకాశముందని సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. 


Also Read :  MI VS PBKS, Qualifier 2: టాస్ గెలిచిన పంజాబ్..మోడీ స్టేడియంలో భారీ వర్షం.. షాక్ లో ముంబై

అయితే ఈ ఐపీఎల్ సీజన్ ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటికే ఫైనల్ కి చేరుకుంది.  క్వాలిఫయర్ 2 మ్యాచ్ ఇవాళ ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరుగనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధించిన జట్టు ఫైనల్ కి చేరుకుంటుంది. అయితే గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2009, 2011, 2016 సీజన్లలో ఫైనల్ కి వెళ్లింది. కానీ డెక్కన్ ఛార్జర్స్, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లతో ఫైనల్ లో ఓటమిని చవిచూసింది. దీంతో ఆర్సీబీ టైటిల్ కి దూరం అయింది.  ఈ సారి నాలుగో సారి ఫైనల్ కి చేరింది. కచ్చితంగా టైటిల్ సాధించాలని ఆర్సీబీ ఆటగాళ్లు.. అభిమానులు కోరుకుంటున్నారు. పంజాబ్ జట్టు కూడా అలాగే ఫైనల్ కి వెళ్లాలని భావిస్తోంది. ఇప్పటికే 5 సార్లు టైటిల్ సాధించి.. 6వ సారి కూడా టైటిల్ కొట్టాలనే ధీమాతో ముంబై ఇండియన్స్ ఉంది. అయితే ఈ సీజన్ లో మాత్రం ముంబై ఇండియన్స్ జట్టు ప్రారంభంలో పేలవ ప్రదర్శన కనబరిచింది.


కీలక మ్యాచ్ ల్లో విజయం సాధించి ముంబై క్వాలిఫయర్ 2 వరకు దూసుకెచ్చింది. అలాగే ఫైనల్ కి చేరుకుంటుందని.. టైటిల్ కూడా సాధిస్తుందని అభిమానులు ధీమాలో ఉన్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కూడా ఈ సీజన్ లో ప్రారంభం నుంచి మంచి దూకుడుగా నే కనిపించింది. మధ్య లో కొన్ని మ్యాచ్ ల్లో ఓటమి పాలైంది. ఆ తరువాత పుంజుకొని క్వాలిఫయర్ 1లో ఘన విజయం సాధించి.. ఫైనల్ కి దూసుకెళ్లింది. మరో ఫైనల్ టీమ్ కోసం ఎదురుచూస్తోంది. మరోవైపు ఎవరి ధీమాలో వారు ఉన్నారు. ట్రోఫీ మేము గెలుస్తామంటే.. మేము గెలుస్తామని పేర్కొన్నారు.  గత సీజన్ ఐపీఎల్ మ్యాచ్ లకు.. ఈ సీజన్ ఐపీఎల్ మ్యాచ్ లకు చాలా తేడా ఉంది అనే చెప్పాలి. ఈ సీజన్ లో ఎప్పుడూ ఎవ్వరూ విజయం సాధిస్తున్నారో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. గత సీజన్ వరకు ఈ జట్టు విజయం సాధిస్తుందని అంచెనా వేశారు. కానీ ఈ సీజన్ లో మాత్రం అది పని చేయడం లేదు. ఈ సారి ఆర్సీబీ జట్టు టైటిల్ సాధిస్తుందో లేదో వేచి చూడాలి మరీ.

Tags

Related News

Ind vs Pak : “బై కాట్” సోనీ స్పోర్ట్స్‌.. టీమిండియా అభిమానులు సీరియస్

Virat Kohli : AB డివిలియర్స్ తల్లిని పచ్చి బూతులు తిట్టిన కోహ్లీ… ఇదిగో షాకింగ్ వీడియో

RCB Jersey : కోహ్లీ పరువు పాయే… కుక్కకు RCB జెర్సీ వేసి దారుణం

Rizwan : పాక్ క్రికెటర్ ను పొట్టు పొట్టుగా కొట్టిన వెస్టిండీస్ క్రికెటర్ రహ్కీమ్ కార్న్‌వాల్

RCB Sarees : RCB పేరుతో చీరలు… క్రేజ్ మామూలుగా లేదుగా.. 11 మంది డెడ్ బాడీ లు ఎక్కడ అంటూ ట్రోలింగ్

Rinku Singh’s Wedding : రింకు సింగ్ పెళ్ళికి షారుక్ ఖాన్.. కోట్లల్లో గిఫ్ట్ ఇచ్చేందుకు ప్లాన్ ?

Big Stories

×