E-Paper
Advertisement

Nara Lokesh: కలిసి పని చేద్దాం.. పలు సంస్థలకు మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి

Nara Lokesh: కలిసి పని చేద్దాం.. పలు సంస్థలకు మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి
Advertisement

Nara Lokesh: విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో మంత్రి నారా లోకేష్.. యాక్షన్ టెసా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓ వివేక్ జైన్‌ను ప్రత్యేకంగా కలిసి చర్చలు జరిపారు.

1970లలో ప్రారంభమైన యాక్షన్ టెసా పాదరక్షలు, ఎలక్ట్రానిక్స్, రియల్ ఎస్టేట్, రసాయనాలు, ఫ్లెక్స్ తయారీ, బొగ్గు గనులు, ఇంజనీర్డ్ వుడ్ ప్రోడక్ట్స్ వంటి విభిన్న రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2025 నాటికి సంస్థ రూ.4,865 కోట్ల టర్నోవర్ సాధించడం, భారత్‌లో ఎ-క్లాస్ నగరాల్లో పూర్తి ఆధిక్యం, బి-క్లాస్ నగరాల్లో 70 శాతం ఉనికి కలిగి ఉండటం సంస్థ బలాన్ని స్పష్టంగా చూపిస్తుంది.

Advertisement

సమావేశంలో సీఈఓ వివేక్ జైన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తమ కంపెనీలో 2,846 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. 2018లో సంస్థ ఏడో తరం కాంటిరోల్ టెక్నాలజీని విజయవంతంగా ప్రవేశపెట్టిందని, తాజాగా ఉత్పత్తి వైవిధ్యం కోసం డోమ్ టెక్నాలజీని కూడా అమలు చేస్తున్నట్లు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌లో వేగంగా పెరుగుతున్న నిర్మాణ, ఫర్నిచర్, ప్యాకేజింగ్ డిమాండ్‌ను పరిశీలిస్తే.. ఎండిఎఫ్ రంగంలో భారీ అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం యాక్షన్ టెసా సీతార్గంజ్ (ఉత్తరాఖండ్)లో 7.5 లక్షల సీబీఎం సామర్థ్యం కలిగిన ప్రొడక్షన్ యూనిట్ నడుపుతున్నందున దక్షిణ భారత మార్కెట్ అవసరాలను తీర్చడం కొంచెం దూరప్రయాణంతో కష్టమవుతోందని గుర్తించారు.

Advertisement

అందువల్లే ఎపిలో సెకండరీ లేదా శాటిలైట్ ఎండిఎఫ్ యూనిట్ ఏర్పాటుచేస్తే, ణాది మార్కెట్లను సమర్థంగా సేవలందించవచ్చురవాణా ఖర్చులు భారీగా తగ్గుతాయి. ఏపీలో నిర్మాణ రంగంలో పెరుగుతున్న డిమాండ్‌ను స్థానికంగానే నెరవేర్చవచ్చు. మరిన్ని ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయి. రాష్ట్ర పరిశ్రమల విస్తరణకు ఇది కీలక ప్రాతిపదిక అవుతుంది అంటూ మంత్రి లోకేష్ సూచించారు. ఏపీ ప్రభుత్వంగా అవసరమైన భూమి, అనుమతులు, మౌలిక సదుపాయాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు.

Also Read: ఎర్ర చందనం స్మగ్లర్లకు చుక్కలు చూపించిన గ్రామస్థులు.. డిప్యూటీ సీఎం హర్షం

మంత్రి సూచనలకు స్పందిస్తూ వివేక్ జైన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఈ ప్రతిపాదనను సంస్థ బోర్డ్‌కు తీసుకెళ్లి సమగ్రంగా పరిశీలిస్తామని అన్నారు. ఏపీలో పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని, ముఖ్యంగా పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉందని కూడా గుర్తించారు.

 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×