E-Paper
Advertisement

Bihar Election Results: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు.. తేజస్వి యాదవ్ వెనుకంజ

Bihar Election Results: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు.. తేజస్వి యాదవ్ వెనుకంజ
Advertisement

Bihar Election Results: బీహార్ అసెంబ్లీ 2025 ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వస్తున్నాయి. అధికార ఎన్డీయే దూసుకెళ్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి అధికార కూటమి అత్యధిక స్థానాల్లో దూసుకెళ్తోంది.

మూడు రౌండ్ల కౌంటింగ్ ముగిసే సరికి, ఎన్డీయే కూటమి భారీ ఆధిక్యంతో మ్యాజిక్ ఫిగర్‌ను దాటి, 190 పైగా స్థానాల్లో ముందంజలో ఉంది. ఎన్డీయేలో భాగమైన జేడీయూ, బీజేపీని దాటి ముందంజలో పరుగులు తీస్తోంది.

Advertisement

అధికార కూటమి పరంగా చూసుకుంటూ బీజేపీనీ దాటి జేడీయూ దూసుకెళ్తోంది. విపక్ష కూటమి సీఎం అభ్యర్ధి తేజస్వీ యాదవ్ అనూహ్యంగా వెనుకబడ్డారు. బీజేపీ నేత సామ్రాట్ చౌదరీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

విపక్షాల ముఖ్యమంత్రి అభ్యర్ధి తేజస్వియాదవ్ రాఘోపుర్ నుంచి పోటీ చేశారు. తొలత ఆధిక్యంలో కొనసాగిన ఆయన తాజాగా వెనుక బడ్డారు. ప్రస్తుతం మూడు రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. వెనుకంజలో కొనసాగిన భీజేపీ అభ్యర్ధి సతీశ్ కుమార్ అనూహ్యంగా దూసుకొచ్చారు. ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

Advertisement

ఎలక్షన్ కమీషన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థికి 17,599 ఓట్లు.. తేజస్వి యాదవ్ కు 14, 583 ఓట్లు వెల్లడయ్యాయి. గతంలో, తేజస్వి యాదవ్ తండ్రి, మాజీ సీఎం ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలు ప్రసాద్ యాదవ్ ఈ స్థానాంలో గెలుస్తూ వచ్చారు.

Also Read: టెన్షన్ టెన్షన్.. నరాలు తెగే ఉత్కంఠ.. జూబ్లీ రణరంగంలోకి కింగ్ ఎవరు..?

కాగా 2015 నుండి తేజస్వి రఘోపూర్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2020 ఎన్నికల్లో తేజస్వీ యాదవ్ ఈ స్థానాన్ని 38,000 కంటే ఎక్కువ ఓట్ల తేడాతో గెలుచుకున్నారు. ఈసారి తేజస్వి యాదవ్‌పై బీజేపీ సతీష్ కుమార్ యాదవ్‌ను అభ్యర్థిగా నిలబెట్టింది. అతను 2010 ఎన్నికల్లో జేడీయూ అభ్యర్థి, తేజస్వీ తల్లి అయినా రబ్రీ దేవిని ఓడించారు. ప్రశాంత్ కిషోర్ జన్ సూరాజ్ పార్టీ కూడా రాఘోపూర్‌లో అభ్యర్థిని నిలబెట్టింది. కానీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది.

Related News

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

Big Stories

Advertisement
×