Big Stories

Gas cylinder: 500లకే గ్యాస్‌ సిలిండర్‌.. సర్కార్ బంపర్ డిస్కౌంట్.. ఎప్పటి నుంచంటే..

Gas cylinder: వంట సిలిండర్ ఎంత? ఎప్పుడో వెయ్యి దాటేసింది కదా? మరి ఇదేంటి? 500 లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడమంటే మామూలు విషయమా? ఇంతకంటే బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇంకేమైనా ఉంటుందా? అందుకే, ఈ బంపర్ డిస్కౌంట్ ప్రకటించింది సర్కార్. గ్యాస్ బండ ధర సగానికి సగం తగ్గిస్తామంటూ హామీ ఇచ్చింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. 500లకే గ్యాస్ సిలిండర్ అంటూ విపక్షాల మైండ్ బ్లాంక్ చేశారు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్. అయితే, కండిషన్స్ అప్లై అంటున్నారు. కేవలం ఉజ్వల్ పథకం లబ్దిదారులకు మాత్రమే ఈ డిస్కౌంట్ అట.

- Advertisement -

ఉజ్వల్‌ పథకం లబ్ధిదారులకు వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి కేవలం 500లకే సిలిండర్ రీఫిల్‌ చేయనున్నట్టు సీఎం అశోక్ గహ్లోత్ ప్రకటించారు. ఉజ్వల్‌ పథకంలో నమోదు చేసుకొని దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలే దీనికి అర్హులని స్పష్టం చేశారు.

- Advertisement -

రాజస్థాన్‌లోని అల్వార్‌లో కొనసాగుతున్న భారత్‌ జోడో యాత్రలో.. రాహుల్‌ గాంధీ సమక్షంలో.. ఈ ఆఫర్ ప్రకటించారు అశోక్‌ గహ్లోత్‌. ప్రతి కుటుంబానికి ఏడాదికి 12 సిలిండర్లను సగం ధరకే అందజేస్తామన్నారు. ఇప్పటికే భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలతో అవస్థలు పడుతున్న పేద ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

“ఉజ్వల పథకం కింద ప్రధాని మోదీ పేదలకు వంటగ్యాస్‌ కనెక్షన్లు అందించారు. కానీ, సిలిండర్ ఖాళీగా ఉంది.. ఎందుకంటే సిలిండర్‌ ధరలు ఇప్పుడు 1040కి పెరిగాయి. అందువల్ల ఉజ్వల్‌ లబ్ధిదారులకు 500లకే ఒక్కో సిలిండర్‌ చొప్పున ఏడాదికి 12 సిలిండర్లు అందిస్తాం” అని సీఎం అశోక్ గహ్లోత్‌ హామీ ఇచ్చారు. మరి, ముఖ్యమంత్రి హామీ ఎన్ని ఓట్లు కురిపిస్తుందో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News