BigTV English
Advertisement

Mrunal Thakur: మృణాల్ డ‌బ్బు మ‌నిషా… అలా ఎందుకు మాట్లాడిన‌ట్టు?

Mrunal Thakur: మృణాల్ డ‌బ్బు మ‌నిషా… అలా ఎందుకు మాట్లాడిన‌ట్టు?

Mrunal Thakur: ఫేమ్ వ‌చ్చే వ‌ర‌కు ఒక తీరు, వ‌చ్చాక ఇంకో తీరు అన్న‌ట్టుంటుంది కొంద‌రి వ్య‌వ‌హారం. ఈ మాట‌లు విని…. ఓ.. ఇలాంటి మాట‌లు వంద వింటుంటాం... అవ‌న్నీ కూటికీ గుడ్డ‌కీ ప‌నికి రావు. అందుకే లోకాభిరామంతో మ‌న‌కు ప‌నిలేదు. నాలుగు రాళ్లు వ‌చ్చే మాట‌లు ఏమైనా ఉంటే చెప్పండి అని అంటోంది మృణాల్ ఠాకూర్‌. నాలుగు మాట‌లు పోగేసి ఉత్త‌రం రాయ‌గానే కాశ్మీర్‌ని మంచుకు వ‌దిలేసి వ‌చ్చేస్తారా? అంటూ సీతారామ‌మ్‌లో ముద్దుముద్దుగా మాట్లాడిన న‌టి మృణాల్ ఠాకూర్‌. 2022లో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన నార్త్ భామ‌ల్లో మృణాల్ ఒక‌రు. కానున్న క‌ల్యాణం ఏమ‌న్న‌ది..తో పాటు, సీతారామ‌మ్‌లోని ప్రతి పాట‌తోనూ, ప్ర‌తి మాట‌తోనూ ఆక‌ట్టుకున్న న‌టి మృణాల్‌. ఈ సినిమా స‌క్సెస్ మృణాల్‌లో తెలియ‌ని కాన్ఫిడెన్స్ పెంచాయి. అదే విష‌యం ఆమె మాటల్లోనూ వ్య‌క్త‌మ‌వుతోంది. ఆ మ‌ధ్య పెళ్లికి ముందు సెక్స్, పిల్ల‌లు గురించి బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది మృణాల్‌.
ఇప్పుడు తాజాగా రెమ్యున‌రేష‌న్ల గురించి మాట్లాడింది.


ఎవ‌రైనా త‌మ‌కు రావాల్సిన రెమ్యున‌రేష‌న్ గురించి ముందే స్ప‌ష్టంగా మాట్లాడుకోవాలి. మార్కెట్లో జ‌నాల మ‌ధ్య ఉన్న‌ అభిమానం, గ్రేస్‌, డిమాండ్‌ని బ‌ట్టే పారితోషికాన్ని ఫిక్స్ చేస్తారు. అది ఎంత అనే విష‌యం మీద ముందే త‌ప్ప‌క అవ‌గాహ‌న ఉండాలి. మ‌న‌సులో అనుకున్న‌దాన్ని గ‌ట్టిగా మాట్లాడుకుని పేప‌రు మీద పెట్ట‌గ‌ల‌గాలి. అనుకున్న‌దాన్ని వ‌సూలు చేసుకోగ‌ల‌గాలి. పారితోషికం విష‌యంలో ఎంత ప‌ర్ఫెక్ట్ గా ఉంటే అంత మంచిది. మ‌న మీద‌, మ‌న స్కిల్ మీద మ‌న‌కున్న కాన్ఫిడెన్స్ ఎలాంటిదో, అవ‌త‌లివారికి తెలియ‌జెప్పిన‌ట్టు అవుతుంది. పురుషుల‌తో పోలిస్తే, స్త్రీలకు చాలా చోట్ల త‌క్కువ రెమ్యున‌రేష‌న్ ఇచ్చి స‌రిపెడుతుంటారు. దాన్నుంచి మ‌న‌ల్ని మ‌నం బ‌య‌ట ప‌డేసుకోవాలంటే, డిమాండ్ చేయ‌గ‌ల‌గాలి“ అని అంటుంది మృణాల్‌. రాయల్ లేడీ కేర‌క్ట‌ర్ల‌కు, ప‌ద్ధ‌తైన పక్కింటి అమ్మాయి కేర‌క్ట‌ర్ల‌కే కాదు, ప‌క్కా గ్లామ‌ర్ కేర‌క్ట‌ర్ల‌కూ రెడీ అంటోంది మృణాల్.


Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×