BigTV English

Naga Vamsi: మింగాలేక‌… క‌క్కాలేక‌… అడ్డంగా బుక్ అయిన వంశీ

Naga Vamsi: మింగాలేక‌… క‌క్కాలేక‌… అడ్డంగా బుక్ అయిన వంశీ

Naga Vamsi: కొన్నిసార్లు అంతే.. ఏదో అనాల‌ని అనం. కాక‌పోతే మ‌నం అన్న మాట‌లు క్ష‌ణాల్లో వైర‌ల్ అయిపోతాయి. అవి బౌన్స్ బ్యాక్ అయి అంతే గ‌ట్టిగా కొట్టేస్తుంటాయి. ఇప్పుడు సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ విష‌యంలో అదే జ‌రిగింది. నిజానికి మొన్న‌టికి మొన్న నాగ‌వంశీ అన్న మాట‌లు కూడా మ‌న వాళ్ల‌నేం కాదు. అయినా జ‌నాల‌కు ఈగో హ‌ర్ట్ అయింది. మొన్న జ‌రిగిందానికి, ఇవాళ జ‌రిగిందాన్ని జోడించి మ‌రీ తిట్టిపోస్తున్నారు. ఇంత‌కీ మొన్నేం జ‌రిగింది అంటారా?. రీసెంట్‌గా రిలీజైన అవ‌తార్‌2 బాగోలేదంటూ త‌న‌దైన స్టైల్లో వ్యంగంగా ట్విట్ట‌ర్‌లో పోస్టు పెట్టాడు నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ. అయినా ఒక సినిమా థియేట‌ర్లో ఉండ‌గానే ఇలాంటి నెగ‌టివ్ రివ్యూలు ఎలా ఇస్తావు? నువ్వు తీసే సినిమాల్లో హాలీవుడ్ సీన్ల‌ను లిఫ్ట్ చేసి వాడేయ‌డం లేదా? అని నెటిజ‌న్లు ఓ రౌండ్ ఆడుకున్నారు. విష‌యం అంత‌టితో స‌ర్దుమ‌ణ‌గ‌లేదు.


తాజాగా ఆయ‌న బ్యాన‌ర్ నుంచి బుట్ట‌బొమ్మ అనే పోస్ట‌ర్ రిలీజ్ అయింది. మ‌ల‌యాళ సినిమా క‌ప్పేలాకి రీమేక్‌గా వ‌స్తున్న సినిమా బుట్ట‌బొమ్మ‌. ఈ సినిమాను జ‌న‌వ‌రి 26న విడుద‌ల చేస్తామ‌ని అన్నారు మేక‌ర్స్. ఆ రిలీజ్ డేట్ పోస్ట‌ర్ మీద ఇప్పుడు నెటిజ‌న్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. ఆ పోస్ట‌ర్ యాజ్ ఇట్ ఈజ్‌గా ది ప్రెస్టీజ్ సినిమా పోస్ట‌ర్‌కి కాపీ. దాన్నే చూపించి తిడుతున్నారు నెటిజ‌న్లు. మొన్న‌నే క‌దా అవ‌తార్‌2 బాగోలేద‌ని అబ్బో త‌మ‌రు క్లాసులు పీకింది. మ‌రి ఇప్పుడు త‌మ క్రియేటివిటీని వెల‌గ‌బెట్ట‌లేక‌పోయారా? ఎందుకు ఓ హాలీవుడ్ పోస్ట‌ర్‌ని మ‌క్కికి మ‌క్కి దించేయడం అంటూ నోటికి వ‌చ్చిన‌ట్టు తిడుతున్నారు. దీని గురించి నాగ‌వంశీ ఏం స్పందించ‌డం లేదు కానీ, అమ్మో… సోష‌ల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెట్టేట‌ప్పుడు ఒక‌టికి నాలుగు సార్లు ఆలోచించాలంటూ మిగిలిన సెల‌బ్రిటీల మ‌ధ్య చ‌ర్చ మాత్రం న‌డుస్తోంది.


Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×